Followers

కేంద్రం వదిలేసినా రాష్ట్రం ఉంది మనకు అండగా

కేంద్రం వదిలేసినా  రాష్ట్రం ఉంది మనకు అండగా 

 పెన్ పవర్,ఆత్రేయపురం

పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఏపీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి  అన్నారు. దీనికోసం వైఎస్పార్‌ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తుందనీ,  అర్హులైన వారందరికీ  బీమా వర్తింపజేస్తామనీ అన్నారు.  అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పరిహారం అందని 42 మందికి నియోజకవర్గం లో కొత్తపేట మండలంలో 12 మంది కి 24 లక్షల రూపాయలు, ఆత్రేయపురం మండలం లో ఏడుగురికి 14 లక్షల రూపాయలు, ఆలమూరు మండలంలో తొమ్మిది మందికి 18 లక్షల రూపాయలు, రావులపాలెం మండలంలో 14మందికి 40 లక్షల రూపాయలు   వైఎస్సార్‌ బీమా నిధులను నామినీదారులకు  చెల్లించారు. 

బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రతి పాలసీకి పీఎంజేజేబీవై, ప్రధాన మంత్రి సురక్షా యోజన కింద కేంద్ర ప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లించేది. 2020 మార్చి 31 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించడం ఆపేసింది. 2020 మార్చి నుంచి పథకాన్ని నిలిపివేస్తామనీ,ఇష్టమైతే రాష్ట్రాలు కొనసాగించుకోవచ్చని తెలిపింది. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని చెల్లిస్తోందని అన్నారు. గత ఏడాది అక్టోబరు 21న బ్యాంకులకు ప్రీమియం రూపంలో రూ. 510 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం  చెల్లించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.అనంతరం ఆత్రేయపురం గ్రామంలో వృద్దుల విశ్రాంతి భవనం  రైతు బజార్ ఏర్పాటు కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  ఆత్రేయపురం మాజీ ఎంపీపీ పీఎస్ రాజు, గ్రామ పెద్దలు ముదునూరి రామరాజు,  ఎంపీడీఒ నాతి బుజ్జి,  వాడపల్లి దేవస్థానం కమిటీ మెంబర్ సురేష్ రాజు,వసంతవాడ సర్పంచి గాదిరాజు, ఎస్సైనరేష్, డీటీ మాధురి,పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్,చిలువూరి చిన వెంకట్రాజు, చిలువూరి రామకృష్ణంరాజు,బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, గోపాలరాజు, గోపీరాజు తదితరులు పాల్గొన్నారు.

జాతిలో స్ఫూర్తిని నింపిన వ్యక్తి పింగళి వెంకయ్య

జాతిలో స్ఫూర్తిని నింపిన వ్యక్తి పింగళి వెంకయ్య

శత జయంతి వేడుకలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్

రాజమహేంద్రవరం, పెన్ పవర్ 

భారత  జాతీయ  జెండా  రూపకర్త  శ్రీ  పింగళి వెంకయ్యచే  రూపకల్పన  చేయబడిన జాతీయ  జెండాను  ఆవిష్కరించి  శత వసంతాలు అయిన  సందర్భంగా శత జయంతి వేడుకలలో భాగంగా పిసిసి పిలుపుమేరకు రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో నేడు జాతీయ  జెండా ఆవిష్కరణ జరిగినది.నగర  అధ్యక్షులు  బాలేపల్లి మురళీధర్  ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమం లో ముందుగా శ్రీ  పింగళి  వెంకయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ,జాతీయ జెండాను  ఆవిష్కరించి వందనం సమర్పించారు,  ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ జాతీయ జెండాను రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిస్వార్థ స్వాతంత్ర సమరయోధులు అని కొనియాడారు మనం జాతీయ  జెండాకు  ను  గౌరవ ఇచ్చినంత కాలం  పింగళి వెంకయ్య గారిని  స్మరించాలి సిన  అవసరం ఉందని అన్నారు. మహిళా నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జాతిలో స్ఫూర్తిని నింపిన జాతీయ జెండాను రూపకల్పన రూపకర్త అయినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారు నిత్య  స్మరణీయుడు అని అన్నారు.పి సి సి నాయకులు బెజవాడ రంగ మాట్లాడుతూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహించటం ఆనందదాయకం అన్నారు.ఈ సందర్భంగా పింగళి వారి స్మృత్యర్థం నగర ప్రముఖులు ప్రముఖ  ఆస్ట్రాలజీ ఈస్ట్ శ్రీ మధుర పాలక శంకర శర్మ గారిని  సన్మానించడం అయినది.  ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు  నల్లపాటి    శ్యామ్ ,  కె విశ్వనాథ్,  చామర్తి లీలావతి  ,ఎండి ఫిరోజ్,    సుబ్రహ్మణ్యం,    ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి నవ  తార కేష్  , ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షుడు ప్రేమ్ భాస్కర్,  హరీష్,  సంపత్, మండా రాజు,  శివ  తదితరులు పాల్గొన్నారు.

కార్పెంటర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కార్పెంటర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎటపాక,పెన్ పవర్

సూర్యచంద్ర కార్పెంటర్ యూనియన్ అధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికున్నారు.  గురువారం ఎటపాక మండలంలోని నెల్లిపాకా లో కార్పెంటర్ యూనియన్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికున్నారు. కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు గా గుంతపల్లి రామ కృష్ణ, కార్యదర్శి గా చిట్యాల శ్రీనివాస రావు, కోశాధికారి చీరాల వీరయ్య, ఉపాధ్యక్షుడిగా బోస్ కాంతారావు, గౌరవ సలహా దారుడు గా గొల్లపల్లి అప్పల స్వామి లను యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్పెంటర్ లకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని,  కార్పెంటర్లు యూనియన్ సమస్యలపై పోరాడేందుకు సిద్దంగా ఉంటామని, యూనియన్ అధ్వర్యంలో మనకు కావాల్సిన హక్కుల కోసం, ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు  వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.

వైయస్సార్ భీమామిత్ర చెక్కులు పంపిణీ

వైయస్సార్ భీమామిత్ర చెక్కులు పంపిణీ

తాళ్లపూడి,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత  అన్నారు. చాగల్లు మండలం నెలటూరు శ్రీరామ కళ్యాణ మండపం లో లబ్ధిదారులకు వైయస్సార్ భీమామిత్ర  చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 274 కోట్ల రూపాయలు 12 వేల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చటం జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా సహజ మరణం జరిగితే ఆ కుటుంబానికి రెండు లక్షలు, దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షలు రూపాయలు భీమా వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకంలో భాగంగా  చాగల్లు మండలంలో  14 మంది  కుటుంబాలకు  28 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో ఇంటి పెద్ద మరణించినట్లయితే వారి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు వైయస్సార్ భీమా మిత్ర పథకానికి ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి కుటుంబంలో ఈ పథకాన్ని ఎన్రోల్మెంట్ చేసి భీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు.   ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా ఎంత ఖర్చయినా నేను భరిస్తాను అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఓ వ్యక్తిని ఏప్రియల్ పూల్ చేస్తే ఏమొస్తుంది-అదే ఓ మొక్క నాటితే ఏప్రియల్ కూల్ అవుతుంది

 ఓ వ్యక్తిని ఏప్రియల్ పూల్ చేస్తే ఏమొస్తుంది-అదే ఓ మొక్క నాటితే ఏప్రియల్ కూల్ అవుతుంది

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటువుంటారు. వారి కుటుంబంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు వచ్చినప్పుడు అర్భాటాలకు, హంగులకు ధనం వెచ్చించకుండా తమకు ఉన్నంతలో, స్తోమతను బట్టి వృద్ధులకు బట్టలు పంపిణీ, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ, వృద్దాశ్రమాలకు ధనం, ఆహారం, నిత్యావసరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అలవర్చుకున్నారు. అదేక్రమలో గురువారం వినూత్నంగా, సేవాకార్యక్రమాల్లో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి కి మొక్కలు అందించి, నాటించారు. అదేవిధంగా తోటి ఉద్యోగుల కు మొక్కలు అంధించి, నాటించారు. ఈయన కూడా మొక్కలు నాటారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్నంగా ఆలోచించి, పలు సేవా కార్యక్రమాలు చేయడం తన లక్ష్యమని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరసింహమూర్తి మాట్లాడుతూ అందరూ సమాజహితమైన కార్యక్రమాలు చేయుట కు ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ని స్ఫూర్తి గా తీసుకోవాలని తెలిపి, ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటి ఏ.రాజబాబు, సీనియర్ అసిస్టెంట్ సత్యేంద్ర కుమార్, ఆర్ఐ క్రాంతిరేఖ, జూనియర్ అసిస్టెంట్ ప్రభు కుమార్, విఆర్వో లు ప్రకాష్, కమల్, సాయి, విఆర్ఏ లు సురేష్, ఉమారాణి, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, అబ్బులు, అటెండర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామకృష్ణకు రసాయన శాస్త్రంలో డాక్టరేట్

 శ్రీరామకృష్ణకు రసాయన శాస్త్రంలో డాక్టరేట్

పెన్ పవర్,ఆలమూరు

     కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన సూరపరెడ్డి శ్రీరామకృష్ణ  రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆచార్య డాక్టర్ రవీంద్రనాథ్ కుంట పర్యవేక్షణలో "అరుదైన చక్కెర వాటి ప్రోసెసింగ్ సంబంధిత మలినాల విశ్లేషణ కోసం నోవెల్ క్యాపిల్లరీ ఎలక్ట్రో ఫోరెసిస్ పద్ధతి అభివృద్ధి" అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి  కేఎల్ యూనివర్శిటీ రిజిస్టార్ ఆచార్య వై వి ఎస్ ఎస్ వి ప్రసాద్ రసాయన శాస్త్రంలో ఆయనకు డాక్టరేట్ ప్రకటించారు. ఆలమూరు మండలానికి చెందిన సూరపురెడ్డి శ్రీరామకృష్ణకు ఈ అరుదైన డాక్టరేట్ సాధించడంతో పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, సంధిపూడి సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, పెదపల్ల సర్పంచ్ యేడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైవీవీ రమణ పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

అన్నదేవరపేటలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం

అన్నదేవరపేటలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ ఎలిమెంటరీ స్కూల్లో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన వారికి వైద్యులు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదేవరపేట  పిహెచ్సి డాక్టర్ మైఖేల్, డాక్టర్ కరిష్మా, పంచాయతీ  సర్పంచ్ ఎలిపే సుధారాణి, పంచాయతీ సెక్రటరీ అనురాధ, విఆర్వో లు నాగేశ్వరరావు, బోస్, ఆశావర్కర్లు, ఏయన్ఎం లు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...