ఓ వ్యక్తిని ఏప్రియల్ పూల్ చేస్తే ఏమొస్తుంది-అదే ఓ మొక్క నాటితే ఏప్రియల్ కూల్ అవుతుంది
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయంలో ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటువుంటారు. వారి కుటుంబంలో పెళ్లి రోజులు, పుట్టినరోజులు వచ్చినప్పుడు అర్భాటాలకు, హంగులకు ధనం వెచ్చించకుండా తమకు ఉన్నంతలో, స్తోమతను బట్టి వృద్ధులకు బట్టలు పంపిణీ, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ, వృద్దాశ్రమాలకు ధనం, ఆహారం, నిత్యావసరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అలవర్చుకున్నారు. అదేక్రమలో గురువారం వినూత్నంగా, సేవాకార్యక్రమాల్లో భాగంగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తహశీల్దార్ ఎం.నరసింహమూర్తి కి మొక్కలు అందించి, నాటించారు. అదేవిధంగా తోటి ఉద్యోగుల కు మొక్కలు అంధించి, నాటించారు. ఈయన కూడా మొక్కలు నాటారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్నంగా ఆలోచించి, పలు సేవా కార్యక్రమాలు చేయడం తన లక్ష్యమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరసింహమూర్తి మాట్లాడుతూ అందరూ సమాజహితమైన కార్యక్రమాలు చేయుట కు ఏయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు ని స్ఫూర్తి గా తీసుకోవాలని తెలిపి, ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటి ఏ.రాజబాబు, సీనియర్ అసిస్టెంట్ సత్యేంద్ర కుమార్, ఆర్ఐ క్రాంతిరేఖ, జూనియర్ అసిస్టెంట్ ప్రభు కుమార్, విఆర్వో లు ప్రకాష్, కమల్, సాయి, విఆర్ఏ లు సురేష్, ఉమారాణి, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, అబ్బులు, అటెండర్ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.