పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేత
లక్షెట్టిపెట్, పెన్ పవర్పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన వ్యక్తి కి గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామనికి చెందిన వేముల భూమయ్య అనే వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉందని విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వంతో పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి బాసటగా నిలిచారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు పలువురు మాట్లాడుతూ అనారోగ్యం నుండి భూమయ్య తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్దిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పద్మశాల అద్యక్షుడు వేముల రాజగురువయ్య,ఇటిక్యాల పద్మశాల అద్యక్షుడు కట్ల చంద్రయ్య,ఉపాద్యాక్షాలు హన్మండ్ల రాంచందర్,సభ్యులు వేముల గుండ శోభన్,కట్ల శ్రీనివాస్ సత్తయ్య,అంకం రమేష్,వేముల రామన్న ,సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.