Followers

సిసిరోడ్డు పనులను ప్రారంబించిన ఎమ్మెల్యే

 సిసిరోడ్డు పనులను ప్రారంబించిన ఎమ్మెల్యే

పెన్ పవర్,  మల్కాజిగిరి


గౌతంనగర్ డివిజన్ బీహార్ బస్తి లో 16లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ సునీత రాముయదవ్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు సతీష్ కుమార్, రాంచందర్, పిట్ల శ్రీనివాస్, బాబు,సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, నరేష్ కుమార్,నవీన్ యాదవ్,ఉపేందర్, శంకర్ రావు,ఎస్ ఆర్ ప్రసాద్, రవి,అశోక్,సంతోష్,మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్, సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

జిఎం కార్యాలయంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

 జిఎం కార్యాలయంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

మందమర్రి, పెన్ పవర్

భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏరియాలోని జిఎం కార్యాలయ ఆవరణంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని   ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ  చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే వారానికి 2 గంటలు, సంవత్సరానికి 100 గంటలు శ్రమదానం  చేయాలన్ని సూచించారు.చిన్ననాడు చదువుకున్న పాఠ్యపుస్తకాల ప్రకారం ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత,చెట్లు నాటడం వలన ఆరోగ్యం కలుగుతుందని గుర్తు చేశారు.చిన్ననాటి నుండి పిల్లల్లో స్వచ్ఛత పై అవగాహన పెంచాలన్నారు.స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో కుటుంబాలతో పాటు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.అనంతరం జిఎం కార్యాలయ వెనకాల పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ ఓ టు జిఎం రామ్ మోహన్,ఏరియా ఇంజనీర్,ఏజిఎం జగన్ మోహన్ రావు,ఏజిఎం(ఎఫ్ అండ్ ఏ) చక్రవర్తి,ఏరియా పర్సనల్ మేనేజర్ వర ప్రసాద్, టీబీజీకేఎస్  స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు శంకర్రావు, ఎఐటియుసి స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు రెడ్డి,ఏరియా పర్యావరణ అధికారి ప్రభాకర్ , డివైపిఎం రెడ్డిమల్ల తిరుపతి, జిఎం కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గొల్లపెల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్

 గొల్లపెల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్


పెన్ పవర్,  గొల్లపల్లి

 గొల్లపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవ గౌడ సంఘం మరియు ముదిరాజ్ సంఘం సి సి రోడ్డు శంకుస్థాపన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన  మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమంనకు హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మరియు  జిల్లా కలెక్టర్ ఎంపీపీ నక్క శంకరయ్య జెడ్పిటిసి గోసుల జలంధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం సి చైర్మన్ సుమన్ రావు ముస్కు లింగారెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ ఆవుల సత్యం మండల అధ్యక్షులు బొల్లం రమేష్ మారంపల్లి బాబు సర్పంచి నిశాంత్ రెడ్డి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్ గుండా గంగాధర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.





రాజన్న సేవలో లక్నో హైకోర్ట్ జడ్జి సంగీత చంద్ర

 రాజన్న సేవలో లక్నో హైకోర్ట్ జడ్జి సంగీత చంద్ర..




వేములవాడ, పెన్ పవర్

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం లక్నో హైకోర్ట్ జడ్జి సంగీత చంద్ర కుటుంబ సమేతంగా  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్గే పుష్ప గుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చక స్వాములు నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం గావించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

బాలికలను కంటి రెప్పలా కాపాడుకుందాం

 బాలికలను కంటి రెప్పలా కాపాడుకుందాం.

బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం ....అధికారులు


నెల్లికుదురు , పెన్ పవర్

సృష్టికి రూపకర్త స్త్రీ,జాతి అభివృద్ధికి  మరియు  మానవ జాతి మనుగడ కోసం  బాలికలను సంరక్షించుకుందామని తహసీల్దార్ అనంతుల రమేష్ కుమార్ ,సిడిపిఓ హైమావతి ఐ సి పి ఓ కమలాకర్ స్పెషల్ ఆఫీసర్ బాలరాజు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఎస్సై పత్తిపాక జితేందర్ లు అన్నారు. మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని స్థానిక మండల పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం ఐసిడిఎస్, చైల్డ్ లైన్ ల ఆధ్వర్యంలో సిడిపిఓ హైమావతి అధ్యక్షతన నిర్వహించారు.దీనికి వారు హాజరై మాట్లాడుతూ మహిళలను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారని అయినా ఇంకా వారిపట్ల  వివక్ష కొనసాగించడం దారుణమన్నారు.బాల్య వివాహాలకు పాల్పడుతూ బాలికల జీవితాలను బలిపశువులు చేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా తమ దృష్టికి తేవాలని వారు సూచించారు.మానుకోట జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం మహిళలు ఎనిమిది వందల ఎనబై ఐదు మాత్రమే ఉన్నారని దీనికి కారణం అబార్షన్లు చేయించడమే అన్నారు.ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన దొంగచాటుగా వీటికి పాల్పడడం నేరమని హెచ్చరించారు. ఎక్కువగా గిరిజన తండాలలో అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం ఉందని వీటిని ప్రోత్సహించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు మల్లేశ్వరి,గౌసియా ఎం పి ఓ పార్థసారధి గౌడ్ పి హెచ్ సి  సూపర్వైజర్ సక్రి,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులుచైల్డ్  లైన్  ప్రతినిధులు  అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎంపి బండి సంజయ్ ను కలిసిన రవి యాదవ్

 ఎంపి బండి సంజయ్ ను కలిసిన రవి యాదవ్

పెన్ పవర్,  మల్కాజిగిరి 

బిజెపి మేడ్చల్ జిల్లా నూతనంగ ప్రచార కార్యదర్శిగా ఎనికైన జిల్లెల రవి యాదవ్ ఎనికైన శుభ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యలయంలో ఎంపి బండి సంజయ్ ను మార్యద పూర్వకంగా కలిశారు. పదవి భధ్యతలు సమర్దవంతంగా నిర్వహిస్తామని రవి యాదవ్ తెలిపారు.

వర్షకాలంలోపు నాలా పనులు పూర్తి చేయాలి

 వర్షకాలంలోపు నాలా పనులు పూర్తి చేయాలి - ఎమ్మెల్యే మైనంపల్లి

పెన్పవర్, మల్కాజిగిరి 

ఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ లో వర్షకాలంలో నాలా సమస్యలతో ఇబ్బందులు ఎదురుకుంటున్న కాలనీ వాసులు, వర్షకాలంలో నాలా పోంగి కాలనీలోకి మురికినీళ్లు ప్రవేశించి దుర్వసనతో, అంటువ్యాధిలతో ఇబ్బందులు ఎదురుకున్నారు. ఇకపై అ పరిస్థితి రాకూండ శశ్వత పరిష్కరం కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనంపల్లి హన్మంతరావు షిరిడీ నాలా సమస్య పై ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ అధికారులతో టౌన్ ప్లానింగ్ అధికారుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వేసవి కాలంలో నాలా పనులను మెుదలు పెట్టి పనులు వేగవంతం చేసి వర్షాకాలం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కెటిఆర్ తో ఫోన్ లో మాట్లాడి నాలా సమస్యలను వివరించారు, షీరిడి నగర్ లో నెలకొన్న సమస్యలను వేంటనే పరిష్కరించాలంటు కొరారు. మంత్రి కెటిఆర్ స్పందించి నాలా సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ లతో ఫోన్ మాట్లాడి నాలా సమస్య  పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, పవన్,ఎసిపి. నర్సింగ్ రావు, కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, నాయకులు పిట్ల శ్రీనివాస్, సతీష్ కుమార్,రాముయదవ్, ఉపేందర్ రెడ్డి,రావుల అంజయ్య, సాయి కుమా్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...