Followers

వై.ఎస్.ఆర్. భీమా చెక్కుల పంపిణీ

 వై.ఎస్.ఆర్. భీమా  చెక్కుల పంపిణీ

విశాఖ ద్వారకానగర్,పెన్ పవర్ 

 చోడవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్. భీమా పథకానికి చెందిన లబ్ది దారులకు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్బంగా శాసన సభ్యులు ధర్మశ్రీ  మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల్లో కల్లా చోడవరం నియోజకవర్గ మండలాలకు అత్యధికంగా ఈ పథకానికి గ్రాంట్లు కేటాయించారని సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం. డి. ఓ. శ్యామ్ సుందర్ , వై.ఎస్.ఆర్.సి.పి. ముఖ్య నేతలు బొడ్డు శ్రీరామ్మూర్తి ,  దొండా రాంబాబు , గొర్లె సూరిబాబు, చందూ రాంబాబు ,  మరియు చోడవరం , రావికమతం , రోలుగుంట , బుచ్చయ్యపేట  గ్రామాల సర్పంచులు , పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు .

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం

 కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం

మహారాణి పేట, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  బీసీ షేక్ కార్పొరేషన్ వెల్ఫేర్ మరియు డేవేలెప్మెంట్ డైరెక్టర్ సబిరా బేగం గురువారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. విశాఖలోని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రంలో టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం కాసేపు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 45ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకా వేయనున్నారు. ఈ సందర్భంగా సబిరా బేగం  మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. దేశంలో అందరికీ ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వ్యాక్సినేషన్ యజ్ఞంలా జరుగుతుందన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం’ అని తెలిపారు.  వ్యాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

విద్యా హక్కు చట్టానికి 12 ఏళ్లు

విద్యా హక్కు చట్టానికి 12 ఏళ్లు

మహారాణి పేట, పెన్ పవర్

విద్య హక్కు చట్టం 1.4.2009 అమలకు వచ్చి నేటికీ 12 ఏళ్ల. ఈ నేపధ్యంలో గురువారం ఏయు. జర్నలిజమ్ డిపార్టుమెంట్ లో హెడ్ అచార్య డి.వి.ఆర్. మూర్తి చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడం ద్వారా బాలల లకు భరోసా ఇవ్వాలన్నరు. ఫొరమ్ కన్వీనెర్ నరవ ప్రకాశరావు రావ్ మాట్లాడుతూ  విద్యహక్కు అమలు  గురించి శ్వేత  పత్రం విడుదల చేయాలి,రాష్ట్రం లో 0.18 వయసు గల బాలలు 40 శాతం ఉన్నారు.వీరందరని చట్ట పరిదిలొకి తేవలి ప్రభుత్వం భాష విదానాన్ని ప్రకటించాలి,బడ్జెట్ లో 10 శాతం విద్యకు  కేటా ఇంచాలి,కొవిద్ కారణం వల్ల బాలలు చదువికి  దూరం అయ్యారు, డ్రాప్ ఔట్ పేరిగారు వీరిని తిరిగి తిరిగి తీసుకు రావాలి చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో వెంకట్,షణ్ముఖ రావ్,బొద్ఫు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన సిటీ కాంగ్రెస్

పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన సిటీ కాంగ్రెస్

మహారాణి పేట, పెన్ పవర్

స్వతంత్ర  సామరయోదులు పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేసి  100 సంవత్సరాలు పూర్తి అయిన అయిన సందర్భంగా గురువారం ఉదయం విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యoలో జాతీయ జెండా ఏగురు వేసి నివాళులు అర్పించడం జరిగింది ,ఇందులో పాల్గొన్న వారు పిసిసి కార్యదర్శి సోడాదశి సుధాకర్, కార్పొరేటర్ అభ్యర్థులు కస్తూరి వెంకటరావు, వైఎస్ జగన్,ఎండీ అర్షద్,యూత్ కాంగ్రెస్ శివకుమార్,షేక్ మొహిద్దిన్,వణం తాతారావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పనులను ప్రారంభించిన ఎంపిపి

 ఉపాధిహామీ పనులను ప్రారంభించిన ఎంపిపి

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి. శ్రీ బుగ్గ రాజేశ్వర తండా గ్రామాల్లో ఎంపిపి పిల్ల రేణుక కిషన్ సర్పంచ్ లు అజ్మీర రజిత తిరుపతి నాయక్. ముక్క మధుకర్ గురువారం ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి పిల్లి రేణుకా కిషన్ మాట్లాడుతూ ఎండ ఏక్కువగా కొడుతోంది. పనికి వచ్చే టప్పుడు ప్రతి ఓక్కరు నీళ్ళ బాటిల్ ను తెచ్చుకోవాలని ఆమే సూచించారు.  ప్రతి ఓక్కరు ఉపాధి పనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి ఓక్కరు పనికి వచ్చే విధంగా చూడాలనీ కార్యదర్శి సరియా ను ఆదేశించారు. పల్లె పకృతి వనం. మంకీపుడ్ కోర్టు ను. స్మశానవాటికను పరీశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్.   సర్పంచ్ లు ముక్క మధుకర్. ఆజ్మీరా రజిత .టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి కిషన్. ఆజ్మీర తిరుపతి నాయక్. ఉపసర్పంచ్ గోగూరి ప్రదీప్ రెడ్డి. దేవేందర్. శ్రీ నివాస్. రాములు. నరేష్.పద్మ. రమేష్.  వార్డు సభ్యులు వర్కుటీ రాజు. జిన్నా . రేష్మ. రెడ్డి నాయక్. ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

బయట ఆహ్లదకరం - లోపల సమస్యల తాండవం

 బయట ఆహ్లదకరం - లోపల సమస్యల తాండవం


ఫ్యానులు తిరగక ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి

భద్రగిరి సి.హెచ్.సీ లో ఉట్టిపడుతున్న నిర్వహణ లోపం

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలంలో ఏకైక సామాజిక ఆరోగ్యకేంద్రం భద్రగిరి ఆరోగ్య కేంద్రం. మండలంలోని 27 పంచాయతీల ప్రజలకు ఆరోగ్య సమస్య వస్తే వైద్యం అందించవలసిన ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి .అనారోగ్యముతో వచ్చిన బాధితులకు వైద్యం ఎంత అవసరమో దానితో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. కానీ అటువంటి సదుపాయాలు ఏవి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కానరావడం లేదు.సుమారు 300 మంది వరకు అవుట్ పేషేంట్స్ వస్తూ ఉంటారు. అవుట్ పేషేంట్స్ కన్నా ఆసుపత్రిలో ఉండి వైద్యం తీసుకోవలసిన రోగుల (ఇన్ పేషేంట్స్) పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.వార్డు లోకి వెళ్లిన రోగులకు సమస్యలు స్వాగతమిస్తాయి. ప్రతీ వార్డులో ఫ్యానులు ఉన్నా అవి పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు.
రోగుల పరిస్థితితో పాటు ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు,సిబ్బందికి కూడా ఉక్కపోత తిప్పలు తప్పడం లేదు.వైద్య అధికారి గదిలోని కూడా ఏ.సీ పనిచేయకపోయినప్పటికి వాటి నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తున్న ఆ సమస్యలను మాత్రం పట్టించుకోవడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియడం లేదు.ఆసుపత్రిలో ఇంజెక్షన్లు,డ్రెస్సింగ్స్ చేసే గదులను పరిశీలిస్తే లోపల నిర్వహణ పరిస్థితులు అద్దంపడతాయి. ఆసుపత్రి బయట మొక్కలతో చూడముచ్చటగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికి లోన మాత్రం సమస్యల ద్వారానికి కేరాఫ్ గా దర్శనమిస్తాయి.ఇంజెక్షన్ రూమ్ పైకప్పు నుండి నీరు కారుతూ ఉన్నా కనీసం మరమ్మత్తులకు నోచుకోని పరిస్థితిలో విధులను ముందుకు నడిపే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతారని ప్రజలు,ఆసుపత్రికి వచ్చిన రోగులు కోరుతున్నారు.


ఎండిపోయిన ఏకరం వరి పంటకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి

 ఎండిపోయిన ఏకరం వరి పంటకు 25 వేలనష్టపరిహారం ఇవ్వాలి

లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

పంటపోలాలను పరీశీలించిన నాయకులు

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా  వీర్నపల్లి మండలంలోనీ  వివిధ తండాల్లో తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎండిపోయిన పంట పోలాలను గురువారం పరీశీలించారు. ఈ సందర్భంగా  లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్య గజన్ లాల్ నాయక్ మాట్లాడుతూ ఎండిపోయి ఎకరం వరి పంటకు  25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట ఒక వారం రోజుల్లో బోర్లు ఎత్తీపోయి  ఎండిపోయాయనీ  ప్రభుత్వం ఎకరానికి 25 వేలు ఇవ్వాలని రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య గజన్ లాల్ నాయక్ కోరారు. వీర్నపల్లి మండలంలోనీ పలు తండాలలో తిరుగుతూ తండా లో ఉన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఈయకపోతే లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు త్వరలోనే పాదయాత్ర చేస్తామని అన్నారు. ఆయనతో పాటు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్. ఉపాధ్యక్షులు లక్ పతి నాయక్. భూపతి నాయక్ . రాజు నాయక్. దేవేందర్ నాయక్ లు పర్యటించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...