Followers

వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం

 సంతబొమ్మాళి, పెన్ పవర్

మండల కేంద్రం సంతబొమ్మాళి లో గ్రామ సచివాలయ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు సంతబొమ్మాళి పి హెచ్ సి, సచివాలయం-1  ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఎంపిక చేశారని తహసిల్దార్ రాంబాబు తెలిపారు. కోవిద్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు. దీని ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరిశీలించేందుకు డాక్టర్ పి.అవని హాజరయ్యారు. మండలంలో 45  పైబడిన వారు చాలామంది ఉన్నప్పటికీ కేవలం 24 మంది వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వైద్య సిబ్బంది అవగాహన లోపంతో వ్యాక్సినేషన్ కు వెనకంజ అయిందని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కె ఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాస్కు ధరించకుంటే జైలుకు

 మాస్కు ధరించకుంటే జైలుకు


పెన్ పవర్,  మల్కాజిగిరి 

రాష్ట వ్యాప్తంగా డిజిపి మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సూచనలు మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ చౌరస్తాలో ఎస్.ఐ అనంత చారి ఆద్వర్యంలో సెకండ్ వేవ్ కోవిడ్- 19, కరోనా విజృంబిభిస్తున్న నేఫేద్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటు అవగాహన కల్పించారు. వ్యాపారస్తులు, వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి, బౌతిక దూరం పటించి, శానిటైజర్ తో శుభ్రం చేసుకొవాలని అన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అయినా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహించి మాస్కులు ధరించకుండా ఉంటే వారిని జైలుకు తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిష్టేబుల్ రమేష్, వీరా చారి, కృష్ణ, మహిళా కానిష్టేబుల్ మాధవి, సంధ్య, శ్రీదేవి పాల్గొన్నారు.

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలి

విజయనగరం,పెన్ పవర్

వివిధ సచివాలయాల్లో సమయపాలన పాటించని 8 మంది కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మెమోలు జారీ చేశారు. సచివాలయాల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని 46, 47, 48 నెంబరు గల సచివాలయాలను కమిషనర్ పరిశీలించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాని 8 మంది కార్యదర్శుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెమోలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని వీడాలని కార్యదర్శులకు ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా సమయపాలన పాటించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించడం, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థ రూపొందించిందని, అటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తేవాలని చెప్పారు.

డస్ట్ బిన్ రహిత నగరం

 డస్ట్ బిన్ రహిత నగరం

విజయనగరం,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన క్లాప్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ కోరారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు పారిశుద్ధ్య అధికారులు, పర్యవేక్షకులు, కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాలు, పట్టణాలు పరిశుభ్రత,పచ్చదనంతో పరిఢమిల్లాలని ప్రభుత్వం క్లాప్  కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు.

 ఈ కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వార్డుల్లో పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చి పచ్చదనంతో వెల్లి విరియాలని అన్నారు. వార్డులలో సమూల మార్పులు తీసుకొచ్చి పచ్చదనానికి, పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. డస్ట్ బిన్ రహిత నగరంగా తీర్చిదిద్దడం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సంపూర్ణ చైతన్యాన్ని ప్రజలలో తీసుకొచ్చి తద్వారా క్లాప్ కార్యక్రమ విశిష్టతను చాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య  అధికారి డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలి

 జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలి

బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్

గొల్లపల్లి,  పెన్ పవర్

 తెరాస నాయకులు గొల్లపెల్లి మండల జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలని మండల బిజెపి అధ్యక్షులు కట్ట మహేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్య సమాజానికి ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని బాధిత జర్నలిస్ట్ కు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. బర్నలిస్ట్ లకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు.  అలాగే బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి సత్యం మాట్లాడుతూ విలేకరుల ను టిఆర్ఎస్ నాయకులు చులకనగా హేళన చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులను గౌరవించే విధంగా మాట్లాడాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచి రాజేష్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సత్యం జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు మంచాల పరుశురాం బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ కళ్యాణ్ శేఖర్ తదితరులున్నారు..

మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు

 మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు

విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్  

శ్రీ భారతి జాలరి కుల  సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో  మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు కొత్తజాలరి పేటలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేకు ను కట్ చేశారు. తదుపరి సంఘ సభ్యులు శాలువా ను కప్పి పుష్ప గుచ్చాన్ని సమర్పించారు.కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ హార్ధిక  జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.  పిమ్మట పేదవారికి  పండ్లను , మిఠాయిలను  పంచిపెట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పోతరాజు మాట్లాడుతూ.... కరోన 2 వ దశ విజృంభిస్తున్న తరుణంలోనే  ప్రజ లందరూ ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారు అతి జాగ్రత్తగా ఉండాలని శుభ్రతను పాటించాలని ,  ఎప్పటికప్పుడు చేతులకు శానిటైజేసన్ చేసుకోవాలని ,  మాస్కులను తప్పక  దరించాలని ,సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాల తో భాదపడుతున్నట్లైతే  వారు మాకు తెలియజేసినట్లైతే వారికి తప్పక మా సంఘం అన్నివేళలా అందుబాటులో ఉండి తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు కుర్మాన అప్పారావు , ఉపాధ్యక్షులు చింతపల్లి సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి కదిరి అచ్చుత మోహన్ రావు , కోశాధికారి చింతపల్లి పోతరాజు మరియు గ్రామ పెద్దలు , 30 , 37 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

అనకాపల్లి, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ పరిధిలో ప్రజలకు24 గంటలు త్రాగు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకోసం నూతనంగా ఎన్నికయిన కార్పొరేటర్ లు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం అన్నారు. మంగళవారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మున్సిపాలిటీ గా ఉన్న నాటి నుండి కేవలం మున్సిపల్ నీటి కనెక్షన్లు కి ఉదయం కేవలం గంట మాత్రమే సరఫరా చేసేవారని జీవీఎంసీ లో విలీనం అయినప్పటికీ అదే తీరు కొనసాగుతుండడం విచారకరమన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 24 గంటలు మంచి నీరుని  సరఫరా చేసేలా ఆలోచన చేయాలని కోరారు. ఒక వేళ అది సాధ్యపడక పోతే కనీసం రెండు పూటలు అయినా సరఫరా చేయాలని, అందుకోసం పట్టణానికి చెందిన కార్పొరేటర్ ల తో పాటు విశాఖ సిటీ పరిధిలోని కార్పొరేటర్ లు అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. విశాఖ ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం  మేఘాద్రి గెడ్డ నుండి నిల్వ చేసి ప్రజలకు తాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందని ఈ క్రమంలో చాలా నీరు వృధా అవుతుందని అన్నారు. ప్రస్తుతం విశాఖ ప్రజల త్రాగునీటి కోసం 200 ఎంజి డి ల నీరు అవసరమవుతుంది అని అన్నారు. ఐతే ఇటీవల ప్రభుత్వం 3339 కోట్ల రూపాయల నిధుల తో ఏలేరు నుండి నీటిని పైపులైన్ ద్వారా తీసుకువచ్చేందుకు డిపిఆర్ఓ రూపొందిస్తున్నట్లు తెలిసిందని తొలగిన ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తే తాగునీటి సమస్యలు తొలగిపోతాయి అన్నారు. అలాగే సముద్రపు నీటిని డిశాలినాషన్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి పరిశ్రమలకు అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమని ఐతే ప్రకటనల కే పరిమితం కాకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆచరణలో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కొణతాల సీతారాం కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జై అనకాపల్లి సేన ఆధ్వర్యంలో మంచి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధముగా ఉన్నామని కొణతాల సీతారాం స్పష్టం చేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...