Followers

వాలంటీర్ కు ఆర్థిక సాయం

 వాలంటీర్ కు ఆర్థిక సాయం

సంతబొమ్మాళి, పెన్ పవర్

మండలం లోని లక్కివలస గ్రామ సచివాలయం పరిధిలో  లో  పనిచేస్తున్న గెద్దలపాడు  వాలంటీర్ సిరిగిడి యశోదకు సచివాలయం సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. వాలంటీర్ యశోద భర్త  సాయి ఇటీవల మరణించారు. ఈ మేరకు బాధిత వాలంటీర్ ఆదుకోవడానికి   పంచాయితీ సెక్రటరీరమేష్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది,  వాలంటీర్లు అందరు కలిసి 20,000/సమకూర్చారు. ఈ మొత్తం ఆర్ధిక సహాయం ను సర్పంచ్  శ్రీరంగం వీరాస్వామి  చేతులు మీదుగా బుధవారం వాలంటీర్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు అండగా "దిశ" వాహనం

 మహిళల భద్రతకు అండగా "దిశ" వాహనం

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళల భద్రతకు  గాను "దిశ" ద్విచక్ర వాహనాన్ని జిల్లా యస్.పీ  అందించినట్లు యస్.ఐ కృష్ణప్రసాద్ తెలియచేసారు.జూనియర్ కళాశాల లోని మహిళా విద్యార్థులతో సమావేశం నిర్వహించిన  మండలంలోని ఏ ఒక్క మహిళ   విద్యార్థినిలు  ఇబ్బందులకు గురైతే తక్షణమే ప్రత్యేక సహాయక నంబర్ "100" మహిళా సహాయవాణి నంబర్ "112"  సైబర్ మిత్రమా నంబర్ "9121211100" ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ "181" లలో ఏదో ఒక నంబర్ కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి జీ.పీ.యస్ సాంకేతికత ఆధారంగా ఆపదలో ఉన్న మహిళలలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి బాధిత మహిళలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం లో ఈ దిశ వాహనం యొక్క ఆవశ్యకత చాలా ఉందని ఈ వాహనంలో గిరిశికర ప్రాంతాలకు కూడా అతి తొందరగా చేరుకుని బాధితులకు అండగా నిలబడగలమని తెలిపారు.ఈ దిశ వాహనం చూసి విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేసు ఈ వాహనం కూత వినపడితే ఆకతాయిల గుండెల్లో గుబులు పుట్టడం కాయమని మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ప్రభుత్వ భద్రత పతకాలకు వారి హర్షద్వానాలతో జోహార్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ కృష్ణ ప్రసాద్ తో పాటుగా నందు, మహిళా కానిస్టేబుల్ సంధ్య, మాలతి పాల్గొన్నారు.

3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

 3వ వార్డులో పలు సమస్యలపై జెడ్.సి కి వినతిపత్రాన్ని సమర్పించిన గంటా నూకరాజు

భీమిలి, పెన్ పవర్

భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న పలు సమస్యలపై  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో  మంగళవారం భీమిలి జోనల్ కమీషనర్  సి.హెచ్. గోవిందరావుకి వినతిపత్రం ఇవ్వడమైనది.తెలుగుదేశం పార్టీ  అధికారంలో ఉండేటప్పుడు భీమిలి జోన్ లో బోయవీధి,ఎగువపేట,తోటవీధి,నేరళ్ళవలస కోలనీ, గొల్లలపాలెం,క్రిష్ణా కోలనీ,రెళ్లివీధిలో  7 సామాజిక భవనాలు నిర్మించారని గంటా నూకరాజు అన్నారు.  సామాజిక భవనాలు నిర్మించేటప్పుడే  పూర్తయిన తరువాత ఆయా గ్రామాలకు వాటి నిర్వహణ బాధ్యత అప్పగించి, పూర్తిగా  ఆ గ్రామ  ఆధీనంలో ఉండేవిధంగా చేస్తామని అప్పటి ప్రభుత్వం తరపున అధికారులు మాట ఇచ్చారని  కానీ ఆ 7 సామాజిక భవనాలపై అధికారులు మాట తప్పారని, వెంటనే వాటిని ఆ గ్రామస్టులకు పెద్దల సమక్షంలో  అప్పజెప్పాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో కోరామని  గంటా నూకరాజు అన్నారు. కొన్ని సామాజిక భవనాలలో సచివాలయమని,  మరి  కొన్నింటిని  వృధాగా ఉంచారని అన్నారు.దయచేసి ఈ 7 సామాజిక భవనాలను ఆయా గ్రామాల అవసరాల కోసం ఇవ్వాలసిందిగా  కోరామని చెప్పారు.అదేవిధంగా  జలగెడ్డ శ్మశానవాటిక,గాడువీది శ్మశానవాటిక,  జెడ్.పి.గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న  చెరువుగట్టు దగ్గర విపరీతంగా తుప్పలు మొలిసాయని,శ్మశానవాటికలో అయితే అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లినవారికి సరైన మార్గం లేక నానా అవస్థలు పడుతున్నారు.  ఇక్కడ తుప్పలు తొలగించాలని కోరారు.అదేవిధంగా  మహాత్మాగాంధీ పాఠశాలలో  అంగన్వాడీ కేంద్రం నడుపుతున్నారు.విద్యార్థులు ఎక్కువగా ఉండటం,   వీరికి మంచినీరు గాని, కరెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని గంటా నూకరాజు ఇచ్చిన వినతిపత్రంలో కొరడమైనది.భీమిలి - దొరతోట రోడ్డుకు ఆనుకొని గొల్లలపాలెం పాఠశాల మరియు రెల్లివీధి పాఠశాలలు ఉన్నాయి.ఇక్కడ తరచు ప్రమాదాలు జరుగుతుండటం విద్యార్థులను,వారి తల్లిదండ్రులను మరియు  స్థానికులను కలవర పడుతుంది.  అందువలన పాఠశాలకు దగ్గరలో రెండువైపులా  వాహనాల వేగ నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా స్పీడ్ బ్రేకర్లు వెయ్యవలసినదిగా కోరడమైనది.గుప్తా వీధి,గొల్లలపాలెంలో కాలువలు పూర్తిగా చెత్తతో నిండి ఉండటం వలన మురుగునీరు నిల్వ ఉంటుంది.  దీనివలన దోమలు ఎక్కువగా నిల్వ ఉండటమే కాకుండా,దుర్వాసన  స్థానికులను కలవర పడుతుంది.పైన సూచించునటువంటి సమస్యలను పరిష్కరించాలని జోనల్ కమీషనర్ కి ఇచ్చిన వినతిపత్రంలో గంటా నూకరాజు కోరడమైనది.ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంటపల్లి యోగీశ్వరరావు, మారోజు  సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు,జలగడుగుల మురళి, కంచెర్ల కామేష్ తదితరులు పాల్గొన్నారు.

తీరంలో ఇసుక దందా..

 తీరంలో ఇసుక  దందా..

సంతబొమ్మాళి,పెన్ పవర్

మండలంలోని పాత మేఘవరం లో సాయి పవన్ రొయ్యల హేచరి పనుల కోసం తీర ప్రాంత సముద్రం ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఒక ట్రాక్టర్, జేసీబీని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ అధికారి పి వి శాస్త్రి స్వాధీనంచేసుకున్నట్లుతెలిరు.నిబంధనలు విరుద్ధంగా సముద్ర పరివాక ప్రాంతాల్లో ఇసుకను రవాణా చేస్తున్న ఈ సమయంలో పట్టుకుని ని పీఓఆర్ నెంబరు 06671  అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి టెక్కలి ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యం లో వాహనాలు సీజ్ చేసి ఉంచామని ఫారెస్ట్ అధికారి అరుణ తెలిపారు. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గతంలో కూడా ఈ హేచరీకి సంబంధించి పలు కేసులు ఫైల్ అయినట్లు సమాచారం. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లో,అక్రమ తవ్వకాలు జరిపి సముద్రంలోని వరకు పైప్ లైన్లు కూడా వేసినట్లు సమాచారం. వీటి అంతటికీ మైనింగ్ అధికారుల, రెవెన్యూ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో ఇలాంటి దుశ్చర్యలు కు పాల్పడుతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

 చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి

మెంటాడ, పెన్ పవర్ 

 మెంటాడ మండలం లోని కుంతిని వలస గ్రామం లో బుధవారము గ్రామ సర్పంచ్ పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మెంటాడ తాసిల్దార్ దూస రవి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రవి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. గ్రామస్తులు కూడా తాగునీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వైసిపి నాయకులు పొరిపిరె డ్ది సూర్యారావు, వై. సింహాచలం, పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

నారాయణ పురం గ్రామంలో కోవిడ్ పరీక్షలు

 నారాయణ పురం గ్రామంలో కోవిడ్ పరీక్షలు

కేసముద్రం, పెన్ పవర్

 మండలంలోని నారాయణపురం గ్రామపరిధిలో గల తులస్య తండాలో బుధవారం కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు.  61 మంది పురుషులు, 69 మంది స్త్రీలు మొత్తం 130 మందికి కోవిడ్- 19 పరీక్షలు నిర్వహించగా ఏడు కుటుంబాలకు చెందిన 12మందికి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని హెల్త్ సూపర్ వైజర్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రవి, గ్రామ సర్పంచ్ పందుల లక్ష్మీపతి, ఆశ వర్కర్స్ కనక లక్ష్మి, నాగలక్ష్మి, ఉపేంద్ర, గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

 కేతిరెడ్డి బండిపై అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి

దేశం కోసం ఉన్నత చదువులు చదివి , రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగిస్తూ , ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములవుతూ , ప్రభుత్వాలకతీతంగా ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్న ఐఎఎస్ కలెక్టర్ ను నీచంగా , హేయంగా , బహిరంగంగా మీడియాలో మాట్లాడిన వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై  అనర్హ వేటు వేసి ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం దళిత ప్రజా సంఘాల ఆర్ధ్వర్యం లో ధర్నా నిర్వహించి వినతిపత్రం డి.ఆర్.ఓ.కు  సమర్పించారు. ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులతో ఎదిగి కలెక్టర్ గా సామన్య ప్రజల మన్ననలు అందుకుంటున్న అనంతరం కలెక్టర్ శ్రీగంధం చంద్రుడుపై అసలు పరిపాలన , ప్రజా సంక్షేమం , కనీస అవగాహన లేని ఎమ్మెల్యే కేతిరెడ్డి బహిరంగంగా మీడియాలో కలెక్టర్ ను వ్యక్తిగతంగా దూషించే రీతిలో మాట్లాడటం దుర్మార్గమన్నారు . ఇలాంటి వారిని చట్టా సభలలో కొనసాగించటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు .దేశంలోనే తొలిసారిగా కులాలను సూచించేలా ఉన్న కాలనీ పేర్లుతొలగించాలని ఆదేశించారన్నారు. మాల పల్లె , మాదిగ పల్లె , హరిజనవాడ , దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశించాన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారన్నారు . ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డును కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రి తోమర్ చేతుల మీదుగా అందుకున్నారు . అవార్డు అందుకున్న కలెక్టర్‌ను సీఎం జగన్ ప్రశంసించారు . అయితే జగన్ వద్ద గంధం చంద్రుడు ప్రశంసలు అందుకోగా , ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఈ క్రెడిట్ జాయింట్ కలెక్టరు దక్కుతుందని , ఆయన చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించడం హేయమైన చర్య అన్నారు. విజయనగరం అభివృద్ధి వేదిక అధ్యక్షుడు పుక్కిళ్ళ షణ్ముఖ రావు మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజాయ్ స్వరో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అని సంజయ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారురు. వారి ఇరువురు పై అట్రాసిటీ కేసు నమోదు చేయకుంటే  ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో బహుజన కళా మండలి కార్యదర్శి ఆతవ ఉదయ భాస్కర్, ఆదడా మోహన రావు, గంటన అప్పారావు, గండ్రేటి సత్యనారాయణ, కొమ్ము సోములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేగేటి సంతోష్, కింతడా పైడి రాజు, బోనెల అరుణా, ఎద్దు సంతోషి, విజయనగరం నియోజకవర్గ కన్వీనర్ అయినాడ కృష్ణ, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పెంట శంకర్ రావు, సోము మురళీ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...