జిందాల్ రైతులకు న్యాయం చెయ్యండి
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం గ్రామ పరిధిలో జెడ్ ఎస్ డబ్ల్యూ జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ పరిశ్రమను నిర్మించేందుకు జరిగిన భూసేకరణ లో అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేయాలని బుధవారం విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ ని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు,వినతిపత్రం అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 వ సంవత్సరం లో బొడ్డవర, ముసిడిపల్లి,చినఖండేపల్లి,మూల బొడ్డవర, కిల్తం పాలెం,ప్రాంతాల్లో 1050 ఎకరాలు గిరిజనులు నుండి భూమిని సేకరించి జిందాల్ పరిశ్రమకి ఇచ్చారని ఇందులో డి పట్టా భూములు,ప్రభుత్వ భూమి కూడా ఉందని,భూసేకరణ లో అప్పటి అధికార పార్టీ నాయకులు అధికారులు చేతివాటం ప్రదర్శించి తమకు నచ్చినట్టు ప్రవర్తించి నిజమైన లబ్ధి దారులైన గిరిజనులకు అన్యాయం చేశారని,భూ సేకరణ జరిగి నేటికీ14 సంవత్సరాలు పూర్తి అయినా కర్మాగారం రాలేదని, భూమిని ఇచ్చిన కొంతమంది రైతులు ఆందోళన తో చచ్చిపోయారని వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు, భూ సేకరణలో కొంతమంది కి భూములు లేక పోయినా దొంగ రికార్డు లతో అధికారులు చలవతో లక్షల రూపాయలు స్వాహా చేసారని లోక్సత్తాపార్టీ ఆధారాలతో బయట పెట్టిందని,ప్రభుత్వం నేటివరకు బినామిలనుండి రికవరీ చేయలేకపోయిందని,గత ప్రభుత్వం కూడా కనీసం రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు, జిల్లా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు వెంటనే తీసుకోక పోతే లోక్సత్తాపార్టీ నుండి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భీశెట్టి అన్నారు,ఆర్డీఓ భవాని శంకర్ ని కలసినవారిలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు,ఎస్. కోట.నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల ప్రసాద్,రఘు రాం,తదితరులు ఉన్నారు.