Followers

పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ.

 పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ...

నార్నూర్,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఎస్ ఐ విజయ్ కుమార్ బుధవారం ఆటో డ్రైవర్లకు ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున నేపత్యంలో డ్రైవర్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాల దూరాన్నీ పాటించాలని,డ్రైవర్లు బయటి ప్రదేశంలో ఆటోలు నడిపేటప్పుడు ప్రయాణికులకు ఆటోలో కూర్చునప్పుడు జాగ్రత్తలు వివరించి చేతికి శానిటైజర్ చేసి మాస్కులు ధరించాలని తగు సూచనలు పాటించి జాగ్రతలో ఉండాలని ఆదేశించారు. వారి వెంట యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, ట్రైనీ ఎసై, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ ను కలిసిన పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ ను కలిసిన పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్

మహారాణి పేట, పెన్ పవర్

పోర్టు షప్పింగ్ కార్యదర్శి సంజీవ్ రంజన్ మంగళవారం విశాఖ పోర్టు కి వచ్చారు అసందర్బంగా పోర్టు సి.ఐ.టి.యు. యూనియన్ కలవడం జరిగింది.యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.పద్బనాభ రాజు  మాట్లాడుతూ పోర్టుల ప్రవేటీకరణ చెయరాదు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, ముఖ్యంగా పారా 64,65 మరియు 66 లో భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల కార్యకలాపాలను పరిష్కరించారు. దీనిలో "పిపిపి ఆపరేటర్లను ఈ చర్యలో అనుమతించడం ద్వారా" మేజర్ పోర్టుల సరుకును నిర్వహించడంలో భారం తగ్గుతుంది. మేజర్ పోర్ట్ యొక్క కోర్ కార్యాచరణ కార్గో హ్యాండ్లింగ్. దాని కార్యకలాపాలకు ఇది భారం కాదు. ఈ నేపథ్యంలో, “మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021” ఫలితం పిపిపి మోడ్ కింద మేజర్ పోర్టులలో మొత్తం 30 బెర్త్లను అవుట్సోర్స్ చేయాలని మరియు ఆదాయ వాటాను సంపాదించాలని నిర్ణయించిందని, తద్వారా అన్ని పోర్టులను భూస్వామి మోడల్ క్రింద మార్చాలని మేము చూశాము. ఈ నిర్ణయం మేజర్ పోర్ట్స్ మరియు దాని కార్మికుల ఆసక్తికి చాలా హానికరం అని మా అభిప్రాయం. పార్లమెంటుకు సమర్పించిన కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క నివేదిక ప్రకారం అన్ని పిపిపి ప్రాజెక్టులు విఫలమయ్యాయి. ఉదాహరణకు మా విశాఖపట్నం పోర్టు ట్రస్ట్,అధాని టెర్మినల్, ఏస్.ఈ.డబల్యూ,ప్రాజెక్ట్,ఎస్సార్ మరియు వేదాంత టెర్మినల్స్ నుండి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, మార్కు వరకు ఎటువంటి ఆదాయాన్ని పొందడం లేదు. ఈ ప్రాజెక్టులలో కొన్ని లేదా చట్టపరమైన వ్యాజ్యాలలో మాత్రమే కాదు. పిపిపి ప్రాజెక్టుల వల్ల విపిటి భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. అందువల్ల బహుళజాతి జాతీయ సంస్థ ఆక్రమణకు మార్గం సుగమం చేస్తుంది మరియు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విధంగా మన జాతీయ భద్రత మరియు భద్రత సమస్యను మరింత దారి తీస్తుంది కాబట్టి అలాంటి చర్యను విరమించుకోవాలని మేము మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాము.షిప్పింగ్ సెక్రెటరీ ని సి.ఐ.టి.యు,యూనిటెడ్ పొర్టు మరియు డాక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఎస్ కుమార్, వి ఎస్ పద్మనాభ రాజు, వర్కింగ్   ప్రసిడెంట్ సి.హెచ్.త్రినాద రావు,కార్యదర్శి జగన్ కలిసారు.

కరోనా 2వ దశ పై అవగాహన కార్యక్రమం

 కరోనా 2వ దశ పై అవగాహన కార్యక్రమం

విశాఖ తూర్పు, పెన్ పవర్

సీతమ్మదార రైతు బజారు వద్ద మంగళవారం ప్రజారోగ్య వేదిక మరియు ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా కరోనా 2వ దశ పై అవగాహన కార్య్రక్రమం మరియు కరపత్రం పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో పి.ఏ.వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ 2 చాలా ప్రమాద కరమైనదని దీనికి లక్షణాలు కూడా కనిపించవు అని వచ్చిన 3 రోజులలోనే చెయ్యి దాటిపోయి ప్రమాదం ఉందని దీనికి మందులేదని ఏస్.ఎమ్.ఏస్,మాత్రమే నివారణ అని తెలియచేస్తూ (ఏస్) అంటే శానిటేషన్(ఎమ్ ) అంటే మాస్క్(ఏస్ ) అంటే సోషల్ డిస్టెన్స్ ఇది వాక్సిన్ వేసుకున్నా పాటించాలని తెలియచేశారు పి.పి.సి,రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్యం చొరవ తీసుకొని ప్రతీ ఒక్కరికీ మాస్క్ లు మరియు ఉచితంగా ఇవ్వాలని ప్రతీ వారు ఏస్.ఎమ్ఏస్,పాటించే విధంగా చొరవ చేసుకోవాలని  విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎమ్.ఏస్.అర్.యు,నాయకులు చంద్రశకర్, సంజయ్, సంతోష్ మురళి. ఎన్.జి.ఓ, నాయకులు రమణారెడ్డి, సివనగేశ్వరావు, కృష్ణ ,శ్రీను ,మహిళా నాయకులు కుమారి తదితరులు కరపత్రాలు పంచి ప్రజలకు జాగృతం చేశారు.

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

వై.ఏస్.ఆర్.సి.పి, తీర్థం పుచ్చుకున్న 31 వార్డు టి.డి.పి నాయకులు

మహారాణి పేట, పెన్ పవర్

తెలుగుదేశం పార్టీ సభ్యులైన మరియు వివిధ విభాగాల్లో 31 వార్డులో పని చేసినటువంటి వార్డు స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో సభ్యులందరూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతులమీదుగా కండువా స్వీకరణ మరియు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరిలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో పని చేసిన సకురు రామకృష్ణ త్రినాథ్ (శివాలయం ట్రస్ట్ చైర్మన్ ) పట్టాభి (ఎల్లమ్మ తల్లి ట్రస్ట్), బీసీ సెల్ ప్రెసిడెంట్ సిరం అప్పలరాజు, మంగరాజు దస్పల్ల శివాలయం ట్రస్ట్ మెంబెర్,సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘ జిల్లా కార్యదర్శి ఉల్లి రమణ వార్డు టిడిపి ప్రధాన కమిటీ కార్యదర్శి గాద పార్వతి బూత్ అధ్యక్షులు పిలక మోహన్,గుత్తుల శ్రీను సూర్యకుమారి,ఎర్ర రామకృష్ణ,దుర్గా రెడ్డి,వడాల సతీష్, టిడిపి యువత నాయకుడు కిరణ్, రాజా బాబు వార్డు టిడిపి కార్యదర్శులు పిలక దుర్గ, శ్రీదేవి శ్రీనివాస్, బాణాల కృష్ణ,చంద్రశేఖర్,సూరిబాబు,గౌరీ శంకర్, సన్యాసమ్మ మరియు విశాఖ సెంట్రల్ పార్క్ మొబైల్ ట్రక్ వెండర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ మరియు వారి సభ్యులు,మూకుమ్మడిగా వైసిపి తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో వార్డు వైసిపి నాయకులు దొడ్డి బాపు ఆనంద్, మాజీ కార్పొరేటర్ సాయి లక్ష్మి,పల్లా శ్రీనివాస్,మొకర గోపి,దొడ్డి రామానంద్, కర్రి ధనలక్ష్మి, గారి రాంబాబు, నవీన్, లక్ష్మణ్, మిగిలిన వార్డు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

 బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు...

బేల, పెన్ పవర్

ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ గుండావార్  తండ్రి, మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన కొప్పుల్వర్ రామన్న అనారోగ్యంతో  మరణించడంతో బుధవారం వారి కుటుంబాలను తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ జైనాథ్ మండల అధ్యక్షుడు కల్చప్ రెడ్డి, బేల మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ నక్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వమాన్ వాంఖడే, పాఠన్ సర్పంచ్ ఫైజుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జండా కు ,శత సంవత్సరాల వేడుకలు

 జాతీయ జండా కు ,శత సంవత్సరాల వేడుకలు

మహారాణి పేట, పెన్ పవర్

జాతీయ జండా రూపశిల్పి,స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కు ఘన నివాళులు.పింగళి కి భారతరత్న ఇవ్వాలి.శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చర్ అండ్ యూత్ అకాడమీ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ,ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ పాల్గొని ముందుగా స్వాతంత్ర సమరయోధుడు,నిష్కళంక దేశభక్తుడు పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  త్రివర్ణ పతకమును  గగన తలమునకు ఎగురవేశారు.వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య ఆగస్టు 2 ,1876 లో కృష్ణా జిల్లాలో  సామాన్య  సాంప్రదాయ కుటుంబంలో జన్మించారని అన్నారు.గాంధీజీ  పిలుపును అందుకొని బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకముగా,భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై జాతీయ స్వాతంత్ర ఉద్యమములో పాల్గొని తన వంతు పోరాటం సాగించారు.1916 లో జాతీయ పతాకము అనే ఆంగ్ల పుస్తకమును రచించారు.త్రివర్ణ పతకమును 1921 లో రూపొందించారు.ఈ పతాకంలో  ఎరుపు రంగు  హిందూ మతానికి ,తెలుపు రంగు ఇతర మతాలకు,ఆకుపచ్చరంగు ఇస్లాం మతమునకు ప్రతీకలుగా రూపొందించారు. మహాత్ముని సూచన తో జెండాలో రాట్నం చిహ్నం పొందుపరిచారు.1947 లో స్వాతంత్రం అనంతరం కాషాయం ,తెలుపు ,ఆకుపచ్చ రంగుల తోటి మరియు మధ్యలో అశోక చక్రమును పొందుపరిచారు .జూలై 4 ,1963 వ సంవత్సరంలో  తన 86వ ఏట పరమపదించారు.విదేశాల నుంచి వచ్చి పేదలకు సేవలు అందిస్తూ, మురికి వాడలలో మత  ప్రచారం చేస్తున్న వారికి కూడా భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.కానీ 135  కోట్ల మంది ప్రజలు నిత్యము వందనము చేయు జాతీయ జండా రూపకర్తకు  నేటి వరకు  భారత ప్రభుత్వము భారతరత్న ప్రకటించకపోవడం విచారించ వలసిన విషయం. ఆంధ్రులైన పీవీ నరసింహారావు కు ,పింగళి వెంకయ్యకు ఆంధ్రుల ఆత్మ గౌరవం పెంపొందించిన ఎన్టీ.రామారావుకు,అల్లూరికి ,భోగి రాజు పట్టాభి సీతారామయ్య కు  ఇంకా ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం త్యాగము చేసిన మహనీయులకు కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య కుటుంబానికి 75 లక్షలు  ఆర్థిక సహాయము అందజేశారు .ఇన్ని సంవత్సరాలుగా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ,పోయారు కానీ వెంకయ్య కుటుంబాన్ని ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.ఈ కార్యక్రమంలో  డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ,డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి ,పల్లా చలపతి రావు ,ఎస్ మహేష్ ,గేదెల శ్రీహరి,డాక్టర్ బుచ్చిబాబు ఎల్,డాక్టర్ వై లక్ష్మణరావు,ఎస్ చాతుర్య , దుటి,రమణ,రాము,శారద,కొండమ్మ ,ఎమ్.ఏస్.  నాయుడు,రమణి,రామదాస్ అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అందరికీ పండ్లు ,స్వీట్స్ పంచారు.

రాజమండ్రి వేదికగా మిస్టర్ ఆంధ్రా పోటీలు

రాజమండ్రి వేదికగా  మిస్టర్ ఆంధ్రా పోటీలు

విశాఖ,పెన్ పవర్ 

 ఈ నెల 28 న రాజమండ్రిలో మిస్టర్ ఆంధ్రా క్లాసిక్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ - 2021 పోటీలు  నవ్యాంధ్ర  ఫిట్నెస్ బాడీ బిల్డర్స్  అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి వీరభద్రరావు ,  ప్రధాన కార్యదర్శి టి.ఎస్. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో  జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రంలో 12 జిల్లాల నుండి  9 గ్రూప్ లు గా మొత్తం 135 మంది బాడీ బిల్డర్లు పాల్గొనడం జరిగింది. అందులో ఒక్కొక్క గ్రూప్ లో ముగ్గురు చొప్పున  మొత్తం 27 మంది కి  వెయిటేజ్ ప్రకారం విజేతలు గా నిర్ణయించి వారి వారి స్థానాలను కేటాయించడం జరిగింది. 

మరల వీరిలో ముగ్గురిని  ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ , బెస్ట్  ప్రేజర్ , మరియు మోస్ట్ మస్క్యూలర్ మాన్ గా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న బిల్డర్లకు స్టార్ జిమ్ ఆర్గనై జేషన్ వారు వసతి , భోజన  సదుపాయాలను కల్పించారు. ఈ పోటీలకు ముక్య అతిధులుగా రాష్ట్ర  చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ తానేటి వనిత , రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రాం , స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి. యువ నాయకులు  జక్కంపూడి గణేష్ , మాజీ  డిప్యూటీ మేయర్  బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ , మాజీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ బర్రె కొండ బాబు , మునిసిపల్ కౌన్సిలరు అంగడ సరళ దేవి లు హాజరైనారు. వీరి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు.  గెలిచిన అభ్యర్థులకు విశాఖ  జిల్లా  బాడీ  బిల్డర్స్   అసోసియేషన్ అధ్యక్షులు  ఎర్రబిల్లి  ప్రభాకర రావు ,  ప్రధాన  కార్యదర్శి  కె. సుబ్రమణ్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గెలిచిన అభ్యర్థుల వివరాలు 9 గ్రూప్ ల నుండి.......

55 కె.జీ. లు. లోపల

1.సుశాంత్ మినియక. --విజయవాడ   - మొదటి స్థానం

2.ఎం.వంశీ నాయుడు –      విశాఖ     -   రెండవ స్థానం

3.ఎస్.సౌమ్య రాజన్.   -   నెల్లూరు.   -   మూడవ స్థానం 

60 కె.జీ. లు. లోపల

1.ఎం.నూకరాజు.        -     విశాఖ.    -    మొదటి స్థానం

2. పి.ప్రసాద్.              -     విశాఖ.    -     రెండవ స్థానం

3.డి.వంశీ కృష్ణ.         – విజయవాడ -   మూడవ స్థానం

65 కె.జీ. లు లోపల

1.జి.గణేష్.            -    తూ. గో. జిల్లా -   మొదటి స్థానం

2.కె.తిరుమల రెడ్డి. -    కృష్ణ  జిల్లా.   -    రెండవ స్థానం

3.వై.బాబీ.             -    తూ. గో.జిల్లా.-   మూడవ స్థానం

70 కె.జీ. లు. లోపల

1.ఎస్.నాగేంద్ర.     -       ప.గో. జిల్లా -      మొదటి స్థానం

2.జి.భాస్కర్ రావు-       ప.గో.జిల్లా-       రెండవ స్థానం

3.జె.కిరణ్ కుమార్ -         విశాఖ.  -      ముడవ స్థానం

75 కె.జీ. లు లోపల

1.కె.వంశీ.             -    తూ. గో.జిల్లా-     మొదటి స్థానం

2.వి.శ్రీరామ్.         -     ప.గో. జిల్లా. -     రెండవ స్థానం

3.ఎ. నరేంద్ర.        -       విశాఖ.      -    మూడవ స్థానం

80 కె.జీ. లు.  లోపల   

1.ఎస్.కె.యూసుఫ్-   గుంటూరు-        మొదటి స్థానం

2.జి.శ్రీకాంత్.       -       శ్రీకాకుళం -       రెండవ స్థానం

3.జె.ఉమామహేశ్వరావు-     శ్రీకాకుళం-      మూడవ స్థానం

85 కె.జీ. లు లోపల

1.బి.సూర్య.          -         విశాఖ  -      మొదటి  స్థానం

2.కె.రామకృష్ణ.     -        విశాఖ -       రెండవ స్థానం

3.ఎం.వెంటేశ్వర్లు. -  తూ. గో. జిల్లా-    మూడవ స్థానం

90 కె.జీ.లు లోపల

1.ఎం.వెంకటేష్. -          విశాఖ   -     మొదటి స్థానం

2.పి.బాబు ప్రకాష్-       శ్రీకాకుళం-     రెండవ స్థానం

3.ఎ. డి.వి.ప్రసాద్       విశాఖ. -     మూడవ స్థానం

90    కె.జి.లు పైన 

1.ఎం.శివ అప్పలరాజు-  విశాఖ. -      మొదటి స్థానం

2.ఎస్.కె.మునవల్లి.   -   విశాఖ.  -       రెండవ స్థానం

3.ఐ. హరీష్.       -     తూ. గో.జిల్లా-   మూడవ స్థానం

ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ :-

ఎస్. నాగేంద్ర....తూర్పు గోదావరి జిల్లా...

బెస్ట్ ప్రేజర్ : -

ఎస్.కె.యూసుఫ్............గుంటూరు 

మోస్ట్ మస్క్యూలర్ మాన్

జి.గణేష్........తూర్పు గోదావరి జిల్లా....

 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...