వైద్య సిబ్బంది అవగాహన కల్పించకపోవడమే లోపం
సంతబొమ్మాళి, పెన్ పవర్
మండల కేంద్రం సంతబొమ్మాళి లో గ్రామ సచివాలయ స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు సంతబొమ్మాళి పి హెచ్ సి, సచివాలయం-1 ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఎంపిక చేశారని తహసిల్దార్ రాంబాబు తెలిపారు. కోవిద్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపుతామని తెలిపారు. దీని ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పరిశీలించేందుకు డాక్టర్ పి.అవని హాజరయ్యారు. మండలంలో 45 పైబడిన వారు చాలామంది ఉన్నప్పటికీ కేవలం 24 మంది వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వైద్య సిబ్బంది అవగాహన లోపంతో వ్యాక్సినేషన్ కు వెనకంజ అయిందని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కె ఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.