Followers

జిందాల్ రైతులకు న్యాయం చెయ్యండి

జిందాల్ రైతులకు న్యాయం చెయ్యండి 










విజయనగరం,పెన్ పవర్  

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం గ్రామ పరిధిలో జెడ్ ఎస్ డబ్ల్యూ  జిందాల్ అల్యూమినియం లిమిటెడ్ పరిశ్రమను నిర్మించేందుకు జరిగిన భూసేకరణ లో అన్యాయం జరిగిన రైతులకు న్యాయం చేయాలని బుధవారం విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ ని లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు,వినతిపత్రం అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 వ సంవత్సరం లో బొడ్డవర, ముసిడిపల్లి,చినఖండేపల్లి,మూల బొడ్డవర, కిల్తం పాలెం,ప్రాంతాల్లో 1050 ఎకరాలు గిరిజనులు నుండి భూమిని సేకరించి జిందాల్ పరిశ్రమకి ఇచ్చారని ఇందులో డి పట్టా భూములు,ప్రభుత్వ భూమి కూడా ఉందని,భూసేకరణ లో అప్పటి అధికార పార్టీ నాయకులు అధికారులు చేతివాటం ప్రదర్శించి తమకు నచ్చినట్టు ప్రవర్తించి నిజమైన లబ్ధి దారులైన గిరిజనులకు అన్యాయం చేశారని,భూ సేకరణ జరిగి నేటికీ14 సంవత్సరాలు పూర్తి అయినా కర్మాగారం రాలేదని, భూమిని ఇచ్చిన కొంతమంది రైతులు ఆందోళన తో చచ్చిపోయారని వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు, భూ సేకరణలో కొంతమంది కి భూములు లేక పోయినా దొంగ రికార్డు లతో అధికారులు చలవతో లక్షల రూపాయలు స్వాహా చేసారని లోక్సత్తాపార్టీ ఆధారాలతో బయట పెట్టిందని,ప్రభుత్వం నేటివరకు బినామిలనుండి రికవరీ చేయలేకపోయిందని,గత ప్రభుత్వం కూడా కనీసం రైతులకు న్యాయం చేయలేదని ఆరోపించారు, జిల్లా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు వెంటనే తీసుకోక పోతే లోక్సత్తాపార్టీ నుండి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భీశెట్టి అన్నారు,ఆర్డీఓ భవాని శంకర్ ని కలసినవారిలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు,ఎస్. కోట.నియోజకవర్గ అధ్యక్షుడు కాండ్రేగుల ప్రసాద్,రఘు రాం,తదితరులు ఉన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందవచ్చు

 నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందవచ్చు,,,

మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు

కేసముద్రం,  పెన్ పవర్

 మిర్చి పండించిన రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మార్కెట్ కు అమ్మేందుకు తీసుకువస్తే మంచి ధర దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు అన్నారు. బుధవారం మిర్చి యార్డులో వేలం పాటలను పరిశీలించారు. మార్కెట్ కు వచ్చిన మిర్చిని చూసి రైతులతో మాట్లాడారు. రైతులు తాము తీసుకువచ్చే మిర్చిని పూర్తిగా ఎండబెట్టి , తాలు లేకుండా వేరు చేసి తీసుకురావాలన్నారు. పూర్తిగా ఎండబెట్టకుండా తేమగా ఉన్న మిర్చిని అమ్మకానికి తెస్తే ఆశించిన ధర దక్కదని అన్నారు. వ్యాపారులు వేలం పాటలు అయిపోయిన వెంటనే తూకాలు వేసి రైతులను త్వరగా వారి వారి గ్రామాలకు పంపించే విధంగా చూడాలని వ్యాపారులకు సూచించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ఉన్న ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మార్కెట్ కు వచ్చిన ప్రతి రైతు భాదతో కాకుండా, సంతోషంగా వెళ్ళేవిధంగా మార్కెట్ అధికారులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది వ్యవహరించాలని కోరారు.

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిజియో తెరిఫి పై అవగాహనా కార్యక్రమం            


 విజయనగరం, పెన్ పవర్                   

శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న వాకార్స్ క్లబ్ నడకమైదానంలో శ్రీనిధి ఫిజియో థెరిఫి సెంటర్ ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ పొగిరి విశ్వేశ్వరరావు చే ఫిజియో థెరిఫిపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ విశ్వేశ్వరరావు క్లబ్ సభ్యులందరికి శరీరంలో కండరాలు, ఎముకలు పై సంబంధించిన జాగ్రత్తలును ఏవిధంగా తీసుకోవాలో వివరిస్తూ ఫిజియో థెరిఫి ఎప్పుడు అవసరమో,నడక సభ్యులు ఏవిధమైన వ్యాయామాలు చేయాలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 గవర్నర్ ఎడ్ల గణేష్ మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్యకరమైన అవగాహనా కార్యక్రమాలు క్లబ్ సభ్యులుకు,ప్రజలకు ఎంతో దోహదపడుతుందని, కార్యక్రమం  నిర్వహించిన అధ్యక్షకార్యదర్శిలకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ పొగిరి ఈశ్వరరావుకు క్లబ్ సభ్యులు సత్కరించారు. శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు,గోల్డ్ డోనర్ పిన్నింటి సూర్యనారాయణ, క్లబ్ గౌరవ అధ్యక్షులు,గోల్డ్ డోనర్ డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కార్యదర్శి ఆరికతోట తిరుపతి రావు,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కోశాధికారి వై. శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శి ములగ శ్రీనివాసరావు, కోశాధికారి ఆర్.సి.హెచ్.అప్పలనాయుడు, జాలీ వాకర్ నలమరాజు, సభ్యులు కె.ఎన్.స్వామి,డి.రాములు,బి.నరసింహమూర్తి,ఐ.వి.ప్రసాదరావు, పైడియ్య,వల్లూరి శ్రీనివాసరావు,చక్రధర్ పట్నాయక్,నాగరాజు,కోట్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ.. 

పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట.. 

విపత్కరపరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు.. 

రూ.2.36 కోట్ల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని 236 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.2,36,27,376 విలువైన కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను బుధవారం చింతల్ లోని కేఎంజి గార్డెన్స్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. పేదలను ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యులు సత్తి రెడ్డి, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

మాస్కుధారణపై అవగాహ కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

 మాస్కుధారణపై అవగాహ కల్పించిన ట్రాఫిక్ పోలీసులు

విజయనగరం,పెన్ పవర్

కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కు తప్పనిసరిగా ధరించాలని విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు అన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐ.పి.ఎస్., ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది బుదవారం నాడు విజయనగరం పట్టణంలో ప్రధాన కూడళ్ళు ఒవర్ బ్రిడ్జి, ఎస్పీ బంగ్లా జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్ లు పడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి, కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కులు ధరించడం చాలా ముఖ్యమని ప్రయాణికలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్.ఐలు భాస్కరరావు, జియావుద్దీన్ మరియు సిబ్బంది ప్లకార్డులు ప్రదర్శించి బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ - కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, సేనిటైజర్ తో గాని తరుచూ శుభ్రపరుచుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి ఆదేశాలతో విజయనగరం పట్టణ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించడం గురించి ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ అవ కార్యక్రమాలలో భాగంగా ప్రధాన కూడళ్ళలో సిగ్నల్స్ పడుతున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా వాహనదారులకు మాస్కు ఆవశ్యకత గురించి అవగాహహన కల్పిస్తున్నామన్నారు.

క్లాస్ మేట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో కోనేరు హంపి జన్మదిన వేడుకలు

 క్లాస్ మేట్ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో కోనేరు హంపి జన్మదిన వేడుకలు

వనపర్తి, పెవర్

వనపర్తి క్లాస్ మేట్ క్లబ్ అద్వర్యంలో వనపర్తి జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో  కోనేరు హంపి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి క్లాస్ మేట్ క్లబ్ మెంర్ అంబటి పల్లి వాస్తవ్యులు అంతటి శివప్రసాద్  పాఠశాల కు క్రీడా సామాగ్రి అందజేశారు. ముఖ్య అతిథి వనపర్తి మున్సిపల్ వైస్ ఛైర్మెన్ వాకిటి శ్రీధర్  మాట్లాడుతూ చదరంగం మేధాశక్తిని పెంచుతుందని,  విద్యార్థులు అందరూ సాధన చేయాలని కోరారు. ప్రముఖ క్రీడాకారులు, క్రీడా కారిణిల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విధి గా ఆటల పోటీలు నిర్వహిస్తూ, వివిధ పాఠశాలలకు క్రీడా సామాగ్రి అందజేస్తున్నందుకు క్లాస్ మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్ కు, క్లాస్ మేట్ క్లబ్ ప్రతినిధుల కు అబినందనలు తెలిపారు.  ఎఎమ్.ఓచంద్రశేఖర్  మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో మేము ఇకపై పాల్గొంటామని, క్లాసుమేట్ క్లబ్ ద్వారా ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించి వారి బాగు కొరకు ప్రయత్నం చేస్తున్న క్లాసుమేట్ క్లబ్ కు అభినందనలు తెలిపారు.ఎఎమ్.ఓ గణేష్  మాట్లాడుతూ చెస్ నేర్చుకోవడం వలన మాథ్స్ బాగా వస్తుందని, పిల్లలు చురుకుగా తయారు అవుతారని, వారి జీవితంలో కూడ మంచి ప్లాన్ ఏర్పాటు చేసుకొని అన్నింట్లో విజయం సాధిస్తారన్నారు.స్కూల్ హెడ్ మాస్టర్ తారబాయ్  మాట్లాడుతూ మీరు మా స్కూల్ లో ప్రోగ్రాం చెయ్యడం చాలా ఆనంద దాయకం అని అన్నారు. వనపర్తి జిల్లా క్లాసుమేట్ క్లబ్ అధ్యక్షులు ఆకుల రవి శంకర్  మాట్లాడుతూ అందరం కలిస్తే ఇలాంటి కార్యక్రమాలు  ఇంకా ఎక్కువ మంది ప్రతిభ గల నిరుపేద విద్యార్థులను గుర్తించి వారికీ సహాయం చెయ్యొచ్చు అని అన్నారు. వనపర్తి  ప్రెసిడెంట్ వెంకటయ్య ,జనరల్ సెక్రటరీ రవీందర్ గౌడ్, కోశాధికారి కురుమూర్తి , క్లాసుమేట్ క్లబ్ ప్రతినిధులు అయిన నుర్జహాన్, పి.ఇ.టి పద్మ ,సతీష్, స్కూల్ బోధన, బోధనేతర సిబ్బంది,ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు అనురాధ, ఎస్.మాదవి, మౌనిక, వనజ, క్లాసుమేట్ క్లబ్ ప్రతినితులు పాల్గొన్నారు.

విజేత ఎస్ వి ఎస్ ఎస్

 విజేత ఎస్ వి ఎస్ ఎస్

సంతబొమ్మాళి, పెన్ పవర్

మండల కేంద్రం సంతబొమ్మాళి లో శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఉత్సవాలు సందర్బంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఎస్ వి ఎస్ ఎస్ (మామిడి పల్లి) టీమ్ విజేత గా నిలిచి ప్రధమ బహుమతిగా 20వేలు రూపాయలు గెలుచుకుంది.హనుమాన్ గురుస్వామి పప్పు రాజు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఆదివారం నుంచి జరిగిన ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 50టీమ్ లుపాల్గొన్నాయి.   ద్వితీయ స్థానం లో పాలకొండ టీమ్ నిలిచి 15వేల రూపాయలు గెలుపొందగా, తృతీయ స్థానం లోసింగుపురం,  మామిడి పల్లిటీమ్ లు నిలబడి చెరో 8వేలు బహుమతి గా గెలుచుకున్నారు. విజేతలు కు సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పాల వసంత రెడ్డి, మరియు కోత సతీష్ చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కళింగ పట్నం లక్ష్మి, వైసీపీ నాయకులు వాదాల దుర్గారావు,  కొన్న శ్రీరాములు, పాల మహేష్,  సోమేసు, డాక్టర్ అప్పారావు, అట్టాడ వెంకటరమణ, దూబ వేణు, పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...