Followers

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

 మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్లకు సత్కారం

పెద గంట్యాడ, పెన్ పవర్

ఇటీవల జరిగిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ బాడీ బిల్డర్ లు తమ సత్తా చాటారు. 85 కేజీల విభాగంలో లో సూర్య గోల్డ్ మెడల్ సాధించాడు.75 కేజీల విభాగంలో రాము ఆరవ స్థానంలో నిలిచాడు. పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రైస్ లో 120ప్లస్ కేజీ ల విశాఖ డిస్టిక్ లో సతీష్ గోల్డ్ మెడల్ సాధించగా,  ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ లో ఐదవ స్థానంలో పండు యాదవ్ గెలుపొందాడు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇండియన్ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాడీ బిల్డర్ లకు సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ రెడ్డి మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతి ఒక్కరి పేరు పై దృష్టి సాధించాలని అని అన్నారు. 

నే వి, ఆర్మీ, బి ఎస్ ఎఫ్, సీ ఐ ఎస్ ఎఫ్, పోలీస్ వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయని అని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రయత్నించాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిమ్ అధినేత ఆర్మీ రాజు, ఎమ్మెల్యే మహేష్, ములకలపల్లి ఈశ్వరరావు, ప్రసాద్, తేజ, గోవింద్ వంశీ, బుజ్జి, దుర్గ, ఎల్లాజీ, దినీష్  జిమ్ యువకులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన నర్సింహారెడ్డి.. 

కలెక్టర్ చాంబరులో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకారం.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి.. 


మేడ్చల్ , పెన్ పవర్ 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కొత్తగా మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తా మని ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిసిన ఆయన కలెక్టర్‌కు పూలబోకె అందించారు.. అనంతరం అదనపు కలెక్టరేట్లోని ఛాంబర్లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు,  అధికారులు,  ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ పక్కా ప్రణాళికతో అధికారుల సహకారంతో విజయవంతమయ్యేలా కృషి చేస్తానని వివరించారు . కరోన రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సానిటైజ్ చేసుకోవాలని, టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు..

ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ

 ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ
మహారాణి పేట, పెన్ పవర్

కంచరపాలెం రైతు బజార్ వద్ద సెకండ్ వేవ్ కరోనా పట్ల తీసుకోవాల్సిన చర్యల పట్ల ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ క్యాంపయిన్ బుధవారం నిర్వహించాయి. కరోనా కి ప్రస్తుతానికి మందు లేదని, కాబట్టి నివారణ ఒక్కటే పరిష్కారం అని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు కామేశ్వరరావు అన్నారు. అవగాహన కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ప్రజారోగ్య కమిటీ నాయకులు సంతోష్, సోమేశ్వరరావు, అప్పలరాజు,పి.రామారావు, ధర్మరాజు, జగదీశ్, రాము, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.సత్యనారాయణ

భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.సత్యనారాయణ 

మహారాణి పేట, పెన్ పవర్

విశాఖ నగరానికి చెందిన వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం వి వి సత్యనారాయణ 2021- 2022 గాను  భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా ఎంపికయ్యారు. వీరిని భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు జి బాలచంద్రుడు ఎంపిక చేయగా  వివిధ ప్రాంతాలకు చెందిన భారత్ వికాస్ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు బలపరిచారు ఏప్రిల్ 2021 నుండి 2002 ఏప్రిల్ వరకు భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రస్థాయిలో మరియు వివిధ జిల్లాల స్థాయిలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తారు.తనను భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా  ఎన్నుకున్నందుకు ఎం వి వి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేసి శక్తివంచన లేకుండా సంస్థ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో  భారత్ వికాస్ పరిషత్ జాతీయస్థాయి ఉపాధ్యక్షులు ఆర్ సి జైన్ బి వి పి సీనియర్ సభ్యులు డి సూర్య సూర్యప్రకాశరావు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వి రాజశేఖర్, పి వెంకటేశ్వరరావు టి హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.జాతీయస్థాయి ఉపాధ్యక్షులు జైన్ గారి చేతుల మీదగా నియామక పత్రం అందుకున్నారు.

కుమారి దగ్గులూరు దేవికి 10,000/- ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి

కుమారి దగ్గులూరు దేవికి 10,000/- ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి

మహారాణి పేట, పెన్ పవర్

30వార్డ్ కె.జి.హెచ్ వార్డుబాయ్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన దగ్గులూరు దేవి, 30సం"రాల వయస్సు కలిగిన దగ్గులూరి దేవికి గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపదుతున్నదని వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే కి తెలియ జేసిన వెంటనే స్పందించి తక్షణమే సొంత నిధుల నుండి 10,000/- ( పదివేల రూపాయలు) ఆర్ధిక చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ ని  అక్కడ ప్రజలు ఎమ్మెల్యే ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 30 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోడూరు అప్పల రత్నం, వార్డ్ ప్రెసిడెంటు దసమంతుల మాణిక్యాలరావు, పెంటపిల్లి సత్యనారాయణ,కోన శంకర్,రవితేజ,దిలీప్, రమేష్,తదితర నాయకులు పాల్గొన్నారు.

లాసన్స్ బే కోలని లో నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం

 లాసన్స్ బే కోలని లో నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం

విశాఖ తూర్పు, పెన్ పవర్

నగరంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నూతన ఫిజియోధేరపీ క్లినిక్ ప్రారంభం అయింది.లాసన్స్ బే కోలని పోస్టాఫీస్ మార్గంలో గీతాస్ ఫిజియోధేరపీ నేడు ఘనంగా ప్రారంభమైంది.ప్రారంభోత్సవానికి ముఖ్యాతిదులుగా గీతం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య పి‌ఎస్ రావు,కే‌జి‌హెచ్ విశ్రాంత విభాగాదిపతి డాక్టర్ ఉదయ్ కుమార్ లు విచ్చేశారు.ముందుగా దీపప్రజ్వలన గావించి క్లినిక్ ని అతిదులు ప్రారంభించారు.ప్రముఖ వైద్యనిపుణులు,సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సి‌హెచ్ ఉదయ్ శంకర్ ఆద్వర్యంలో  నిర్వహించనున్న క్లినిక్ ప్రత్యేకతలను అతిదులు అడిగితేలుసుకున్నారు.అత్యాధినిక పరిజ్ఞానంతో పాటుగా నిష్ణార్ధులైన వైద్య నిపుణులతో చికిత్స అందించనున్న క్లినిక్ అంతర్జాతీయ ప్రణాళికతో ఉందని అతిదులు కొనియాడారు.శరీర స్థితిగతులను సరియైన అంచనా వేసి వ్యాదుల నిర్మూలనకు అవసరమైన ఫిజియోధేరపీ వైద్య విధానంతో చికిత్స అందించనున్నామని నిర్వాహికులు తెలిపారు.రోగుల శారీరక స్థితిగతులను తెలుసుకోవడానికి వారితో కలిసి వారి వ్యవహారశైలి,ఆహారపు అలవాట్లు గుర్తించి వారి బౌతీక స్థితికి అనుగుణంగా అత్యున్నతమైన వైద్యం అంధించే క్లినిక్ నగరవ్యాప్తంగా ఎక్కడాలేదని తొలిసారిగా గీతాస్ క్లినిక్ ద్వారానే పరిచయం చేస్తున్నామని తెలిపారు.సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో చికిత్స అందించేలా టారిఫ్ రూపకల్పన చేశామని నిర్వాహికులు తెలిపారు.ఇంతటి ఉత్తమ వైద్యం అందిస్తున్న గీతాస్ క్లినిక్ భవిష్యత్తులో మరింత వృద్ది చెంది మరిన్ని శాఖలుగా విస్తరించాలని అతిదులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహికులతో పాటుగా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ.

 పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మాస్కుల పంపిణీ...

నార్నూర్,  పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఎస్ ఐ విజయ్ కుమార్ బుధవారం ఆటో డ్రైవర్లకు ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున నేపత్యంలో డ్రైవర్ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాల దూరాన్నీ పాటించాలని,డ్రైవర్లు బయటి ప్రదేశంలో ఆటోలు నడిపేటప్పుడు ప్రయాణికులకు ఆటోలో కూర్చునప్పుడు జాగ్రత్తలు వివరించి చేతికి శానిటైజర్ చేసి మాస్కులు ధరించాలని తగు సూచనలు పాటించి జాగ్రతలో ఉండాలని ఆదేశించారు. వారి వెంట యూనియన్ ప్రెసిడెంట్ ఫెరోజ్ ఖాన్, ట్రైనీ ఎసై, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...