Followers

గుర్వా నగేష్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

 గుర్వా నగేష్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి 

 మండల ప్రధాన్ సంఘం మండల అధ్యక్షులు పూసం రాజేశ్వర్

 బేలా , పెన్ పవర్ 

ఏమైనా సమస్య ఉంటే మీరు సమాజ పెద్దలు కానూక కూర్చొని నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే  బాగుండేది, కానీ పత్రిక ప్రకటన ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు.కాబట్టి   రిటైర్ ఉద్యోగుల సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతరాజ్, కోవ మనోహర్, దౌలత్ రావు,సత్యనారాయణలు సంఘం పై తప్పుడు మాటలు మాట్లాడడం సమంజసం కాదని ,జిల్లా అధ్యక్షుడు దుర్వా నగేష్ కు బేషరతుగా క్షేమపన చెప్పని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ   పర్దన్ జాతి ఐక్యత ను దెబ్బ తీసే విధంగా ప్రయత్నిస్తే జాతి నుండి తరిమి కోటుతమని అన్నారు. జిల్లా అధ్యక్షులు దుర్వా నగేష్ గారు చేసే పనులు ఓర్వలేక, మీరు అధ్యక్షుడు ని పై పత్రిక ప్రకటన చేయడం సమాజానికి చాలా సిగ్గూ చేటు అన్నారు. 70 సంవత్సరాల నుండి ఎవరు చేయని పని ని దుర్వా నగేష్ జాతి ఐక్యత కోసం చాలా ప్రయత్నం చేశారు.ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి మేష్రం భారత్,కిషన్,శేషరావు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

 ఆర్థిక సహాయం అందజేత

 నార్నూర్, పెన్ పవర్ 

మండలంలోని ఉమ్రి  గ్రామానికి చెందిన జాదవ్ మోహన్ కుటుంబానికి రు.15 వేల ఆర్థిక సహాయాన్ని దివ్యశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధరావత్ ప్రవీణ్ నాయక్ శుక్రవారం అందజేశారు. వారి కుటుంబంలో ఐదుగురు పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతుండగా ఆడపిల్ల వివాహానికి ఫౌండేషన్ తరఫున సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యశ్రీ ఫౌండేషన్ తరఫున పేద కుటుంబాలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలను ఆదుకోవడమే  లక్ష్యమన్నారు ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలను ఆదుకుంటామన్నారు. సర్పంచు రాథోడ్ రవీందర్,మాంకపూర్ సర్పంచ్  శావిందర్, గ్రామస్తులు గణేష్, శివ తదితరులు ఉన్నారు.

పోలేపల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పట్నం నరేందర్ రెడ్డి

పోలేపల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పట్నం నరేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా, పెన్ పవర్

వికారాబాద్ జిల్లా, బొమిరేస్ పేట్ మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం లో ప్రత్యేక పూజలు చేసిన స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సి ఎలక్షన్ ఇంచార్జి రాజేశ్వర్, కొడంగల్ నియోజకవర్గం ప్రజలను ఎల్లమ్మ తల్లి  ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఎల్లమ్మతల్లి దర్శనానంతరం ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ లు జడ్పీటీసీ లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు యువజన సంఘం నాయకులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

 విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.                                          

 బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్

తార్నాక ,పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా తయారు చేసారని  బీజేవైఎం హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో యువకులు,మేధావులు,అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని , తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని కళలు కన్న యువకుల ఆశయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడియాశలు చేసారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 28వేల ఉపాధ్యాయుల పోస్టులు కాళీలుగా ఉన్నాయని, అదే విధంగా 14 యూనివర్సిటీ లకు వైస్ ఛాన్స్ లర్స్ , ప్రొపెసర్లు, లెక్చరర్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యారంగంలో ఆంధ్ర మేనేజ్మెంట్ ను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీ చైతన్య,నారాయణ లాంటి ఆంధ్ర మేనేజ్ మెంట్ ను ప్రోత్సహిస్తున్నరని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యాను అందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం విద్యావ్యవస్థ ను అస్తవ్యస్తం చేసారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతు రాంచందర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఆర్. కె.బీచ్ వద్ద స్వచ్చ భారత్ కార్యక్రమము

 భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఆర్. కె.బీచ్ వద్ద స్వచ్చ భారత్ కార్యక్రమము









విశాఖ తూర్పు,పెన్ పవర్

  భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర  అధ్యర్యం లో మరియు రాజ్యసభ సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జి.వి.ల్. నరసింహారావు  పర్యవేక్షణ లో బీచ్ లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నరసింహా రావు మాట్లాడుతూ.... ప్రధాని మోడీ  దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అమలు చేసేటప్పుడు  మంచి స్పందన వచ్చిందని, ఇటువంటి అద్భుతమైన బీచ్ పరిసరాలను శుభ్రంగా, అందంగా ఉంచక పోతే ప్రగతికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో నగర కార్పొరేషన్ వారి వైఫల్యం స్పష్టంగా కబడుతుందని వాపోయారు. ఇక్కడకు ఎక్కువగా సందర్శకులు వేలా సంఖ్యలో వస్తుంటారాని, అందులో విదేశీయుల కూడా ఎక్కువగా వస్తుంటారని కనుక బాధ్యత తో పట్టణ వాసులు ఎవరూ కూడా వ్యర్థాలను , ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధిత వ్యర్థాలను బీచ్ లో ఎక్కడ పడితే అక్కడ పడవేయ కుండా చూసుకోవాలని ప్రాధేయ పడ్డారు. దీనికి అనుగుణంగా కార్పొరేషన్ వారు కూడా భాద్యత గుర్తెరిగి ఎక్కడి కక్కడే డస్ట్ బీన్ లను ఏర్పాటు చేసి  స్వచ్చంద సంస్థల వాలంటీర్ ల ద్వారా సందర్శకులెవ్వరూ వ్యర్థాలను కింద పడవేయ కుండా కంట్రోల్ చేయవచ్చని సలహా ఇచ్చారు. ఈ సుందర మైన బీచ్ ను ఇంకా అతి సుందరంగా తయారు చేయొచ్చని ఈ విషయంపై పార్లమెంట్ లో రాజ్యసభలో ప్రస్తావాన తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం లో త్యరలో జరగబోయే కార్యక్రమానికి ఢిల్లీ నుండి కేంద్ర పట్టణ శాఖా మంత్రి హరదీప్ పురి  నగరంలో స్మార్ట్ సిటీ కు సంబంధించిన అభివృద్ధిని పర్యవేక్షిస్తారని తెలిపారు. కేవలం నిధులను వాడుకోవాడమే కాదు..వాటిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దామా ? ..లేదా..? అన్నది ముఖ్యం అని హితవు పలికారు. వెనువెంటనే తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దాలందరూ బీచ్ లో పడివున్న వ్యర్థాలను ఏరివేసి సుందరంగా తీర్చిదిద్దారు. తదుపరి ఓ.ఎం.సి. దగ్గరున్న చిల్డర్న్స్ పార్క్ ను కూడా పరిశీలించారు. పార్కు లో సరైన క్వాలిటీ లేని మెటీరియల్ ను వాడడం వలన పిల్లలకు ఆడుకోవడానికి అనుకూలంగా లేకుండా పోయిందని  విచారించారు. అక్కడినుండి అప్పుగర్ దగ్గరున్న డివిస్ ప్లాంట్ కు వెళ్లి దానిని పరిశీలించి వేస్ట్ వాటర్ ప్రాసెస్ యొక్క వివరాలను ఆరాతీశారు. ప్లాంట్ ద్వారా వచ్చే వ్యర్ధమైన నీటిని  వృధా పోనివ్వ కుండా దానిని ఏవిధంగా  ప్రయోగించొచ్చో అనే దానిపై లోకల్ కమిటీని విచారించ మన్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె. సుబ్రమణ్యం  18 వ వార్డు జనసేన బి.జె.పి. ఉమ్మడి పార్టీ అభ్యర్థి ని  ద్వారాపురెడ్డి వి.ఎ న్. ఎల్. అరుణ కుమారి, వార్డు అధ్యక్షు లు శ్యామ్ కుమార్  జనరల్ సెక్రటరీ రమా దేవి, ఉదయ్, నూకరాజు,రామ రావు లలితకుమారి మరియు బి.జె.పి కార్యకర్తలు పాల్గొన్నారు.

కేతేపల్లిలో వారోత్సవాలు

 కేతేపల్లిలో వారోత్సవాలు

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో గ్రామ సర్పంచ్ అనిత  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహం చేయడం బాల్య వివాహంగా పరిగణించబడుతుందని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా చూపిస్తూ ఉన్నత స్థాయిలో విద్య నేర్పిస్తూ అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తూ ప్రేరేపించినప్పుడు ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి దేవమ్మ, పంచాయతీ సెక్రెటరీ జహంగీర్, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, ఆశ వర్కర్లు మంజుల, పుష్పలత  పాల్గొన్నారు.

స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో మెకానిక్ శ్రీను

 స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో మెకానిక్ శ్రీను



 15 వ వార్డులో బీరువా జోరు

 నర్సీపట్నం, పెన్ పవర్ 

  నర్సీపట్నం మున్సిపాలిటీ 15 వార్డులో పెదిరెడ్ల శ్రీనివాసరావు (మెకానిక్ శ్రీను) స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. చివరి వరకు పార్టీ బి-ఫారం తనకే దక్కుతుందని ఆశించిన శ్రీను, వేరొకరికి బి-ఫారం అందడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మెకానిక్ శ్రీను కు బీరువా గుర్తు కేటాయించింది. అయితే వార్డు ప్రజల కష్టసుఖాలలో తలలో నాలుకలా ఉండే మెకానిక్ శ్రీనును పోటీలో ఉండమని యువకులు, పెద్దలు పట్టుబట్టడం విశేషం. సాధారణ మెకానిక్ జీవితం గడిపే శ్రీనివాసరావు, తనకు వచ్చే ఆదాయంలో కొంత పేద ప్రజల కోసం కేటాయించటం పట్ల ప్రజల విశ్వాసం చూరగొన్నారు.  కరోనా వంటి కష్టకాలంలో కూడా, వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు,  కూరగాయలు అందజేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ అండగా నిలిచారు. ఇవన్నీ మెకానిక్ శ్రీను గెలుపుకు దోహదపడే అంశాలు. గుర్తు కేటాయించిన వెంటనే కరపత్రాల తో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  తనను గెలిపిస్తే వార్డులో పారిశుద్ధ్య పనులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, సిసి రోడ్లు వేయిస్తానని,  అవసరమైన చోట కల్వర్ట్ లు నిర్మాణం చేయిస్తానని,  వీధులలో ఎల్ఈడి బల్బులు వేయిస్తానని, ప్రతి వీధిలో రెండు చెత్తకుండీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు.  ప్రజలంతా మెకానిక్ శ్రీనుకు  పట్టం కట్టేందుకు ఉత్సాహపడుతున్నారు.  బీరువా గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే , మున్సిపాలిటీ లోనే 15 వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెకానిక్ శ్రీను హామీ ఇస్తున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...