Followers

కుటుంబ ఆరోగ్య వ్యవస్థలో పీఎంపీ ల పాత్ర కీలకం

 కుటుంబ ఆరోగ్య వ్యవస్థలో పీఎంపీ ల పాత్ర కీలకం



గోకవరం,పెన్ పవర్

  కుటుంబ ఆరోగ్య వ్యవస్థ లో పీఎంపీ ల పాత్ర కీలకమని మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసు అన్నారు.గోకవరం మండలం బావాజీ పేట అష్టలక్ష్మీ గుడి దగ్గర లో శుక్రవారం ది పీఎంపీ అసోసియేషన్ గోకవరం, కోరుకొండ ఏజన్సీ మండలాల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు పీ చిన్ని అధ్యక్షతన సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంనకు రాజమండ్రి కి చెందిన తోలత్ మెమోరియల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ  అత్యవసర పరిస్థితి లలో పీఎంపీ లు చేయు ప్రాధమిక వైద్యం గురించి తెలిపారు. మాజీ జెడ్పీటీసీ బోస్ మాట్లాడుతూ గ్రామాల్లో కుటుంబం లో ఎవరి ఏవిధమైన అనారోగ్యం వచ్చిన ముందుగా స్పందించేది పీఎంపీ లేనని అన్నారు. ఈకార్యక్రమంలో పీఎంపీ జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి ఎమ్ నాగేశ్వరరావు,కోశాధికారి గున్నూరి లాజర్, ఉపాధ్యక్షులు  వై పవన్,ఎమ్ మల్లేష్,వెంకటేశ్వరరావు, సహాయకార్యదర్శి ఎస్ భాస్కర్, జి నానీ ,జి వెంకటేష్,పీఎమ్ దాస్,పీ లక్షణరావు, కణుపూర్ శ్రీనివాస్ లతో పాటు పీఎంపీ లు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన...

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన...



 ప్రత్తిపాడు పెన్ పవర్ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ కు వ్యతిరేకిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు మద్దతుగా, ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి,  కోర్టు ఆవరణ నుండి మెయిన్ రోడ్ వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగాలని నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రత్తిపాడు- సామర్లకోట రోడ్ లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి అడారి సుగుణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అటువంటి పరిశ్రమను ప్రవేటపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం శోచనీయమని అన్నారు. విశాఖ ఉక్కుని రక్షించకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల అందరూ ఈ ఆందోళనలు బాగస్వాములవుతారని, చెప్పారు.ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ బుగత శివన్నారాయన, అడారి సుగుణ, వెంకటరావు, మధుబాబు, విజయ్ కుమార్, కాళీప్రసాద్, జాన్ బాబు, నర్సింగరావు, చలం, మల్లేశ్వరరావు, నాగేంద్ర, కె శ్రీనివాస్, చిట్టిబాబు, జోగేష్ మరియు రవికుమార్ లు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కును రక్షించుకుంటాం

విశాఖ ఉక్కును రక్షించుకుంటాం



బంద్ కు సంఘీభావ సభలో.. వీరలక్ష్మీ

పెద్దాపురం,పెన్ పవర్

ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును పరిరక్షణకు ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎమ్.వీరలక్ష్మీ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర బంద్ కు పిలుపుకు సంఘీభావంగా పెద్దాపురం మెయిన్ రోడ్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన సిఐటియు- ఎఐటియుసి- ఐఎఫ్ టియు ఆధ్వరంలో జరిగింది. ఈ సందర్బంగా వీరలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపైన కక్షకట్టిందని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం అంటే ఆంద్రప్రజల గౌరవాన్ని వమ్ముచేయడమే అని అన్నారు. 2 లక్షల కోట్ల విలువైన ఆస్ధులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేవలం 5 వేల కోట్లుతో పోస్కో కంపెనీకి అమ్మడం చాలా దారుణమన్నారు. దీనిపైన పెద్దఉద్యమం నిర్వహించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబి, సిఐటియు నాయకులు మాగాపు నాగు, ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఇ.చిట్టిబాబు, ఎఐటియుసి నాయకులు రామకృష్ణ, త్రిమూర్తులు, కన్నూరి ప్రసాద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు,  సిఐటియు నాయకులు ఎస్.శ్రీనివాస్, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దారపురెడ్డి కృష్ణ, జాగారపు సూర్యకుమారి, మామిడి సత్యవేణి, ఉమామహేశ్వరి, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు...

 విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు...



ఎటపాక మండలంలో బంధు ప్రశాంత

ఎటపాక,పెన్ పవర్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో  ఎటపాక మండలం లక్ష్మీపురం తోటపల్లి రహదారులపై  అఖిలపక్ష నాయకులతోసి  బంద్ ప్రశాంతంగా కొనసాగింది  ...ఈ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్ష నాయకులు  విషం పెళ్లి వెంకటేశ్వర్లు రంబాల నాగేశ్వరరావు మాట్లాడుతూ  ...కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం భావ్యం కాదని  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెయ్యడంతో ఆంధ్ర రాష్ట్రానికి  ఆర్థిక వనరులు వాటిల్లుతాయనే  అదేవిధంగా కార్మికులకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని  అన్నారు,విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని దానిని  ను  ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించామని  అన్నారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని  కేంద్రంలోని ఉన్నటువంటి బీజేపీ పార్టీ  పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని అని అన్నారు,దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ  చెయ్యకుండా  ఉండేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు,విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో  బంద్ ప్రశాంతంగా నిర్వహించారు  ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార జాతా వాహనాలు ప్రారంభం

 ఎన్నికల ప్రచార జాతా వాహనాలు ప్రారంభం



పెద్దాపురం,పెన్ పవర్

ఎన్నికల ప్రచారజాతా కు సంబందించిన ప్రచార వాహనాలను రొంగల తాతారావు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం కోసం 14,15,18,21 వార్డులోకి ప్రచార వాహనాలు యాసలపు సూర్యారావు భవనం నుండి  బయలుదేరాయి. నిరంతరం ప్రజల కోసం పని చేసే సిపిఎం అభ్యర్దులను గెలిపించాలని కోరారు. నిస్వార్దంగా కార్మికుల కోసం, రైతుల కోసం సిపిఎం మాత్రమే పోరాడుతుందని ఆయనన్నారు. ఈ కార్సక్రమంలో 14వ వార్డు సిపిఎం అభ్యర్ది రొంగల సుబ్బలక్ష్ణీ, 15వ వార్డు అభ్యర్ది యాసలపు అనంత లక్ష్మీ, 18వ వార్డు అభ్యర్ది కూనిరెడ్డి అరుణ, 21వ వార్డు అభ్యర్ది నీలపాల సూరిబాబు తదితరులు పాల్గోన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...

 మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...



పాలిథిన్ కు  పూత పూసినట్లు ఉన్న  బెల్లం చెక్కిలు..

పెన్ పవర్,విశాఖపట్నం

  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు బలవర్ధకమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం  కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి నాణ్యమైన పదార్థాలకు తిలోదకాలు ఇస్తున్నారు.  పాఠశాలలో నాణ్యమైన ఆహార పదార్థాలతో మధ్యాహ్న భోజనం మరియు పుష్టినిచ్చే వేరుశనగ చెక్కిలు,గుడ్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తున్నా  నాణ్యమైన సరుకులు మాత్రం పిల్లలకు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన  బెల్లం వేరుశెనగ  గుళ్ళతో  తయారుచేసిన చెక్కిలకు  కాంట్రాక్టు కుదుర్చుకోవాలసి  ఉంది. కానీ అధికారులు కాసులకు కక్కుర్తిపడి  కాంట్రాక్టర్ తో చేతులు  కలుపుతున్నారు అన్నది బహిరంగ రహస్యం. కాంట్రాక్టర్లు తమకు నచ్చిన విధంగా చెక్కిన లు  చేయించి సరఫరా చేస్తున్నారు. దీనికి  అనేక సంఘటనలు రోజూ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం మాడుగుల మండలం జె డి పేట పాఠశాలలో  పాలిథిన్   పేపర్ కు అతికించి ఉన్నా  వేరుశనగ చెక్కిలు  పిల్లలకు అందజేశారు. ఇచ్చిందే తడవుగా పిల్లలు  నోట్లో పెట్టేసి చెప్పడం చేశారు. వేరుశెనగ పలుకులు బెల్లం పాకం కరిగిపోయే  నోట్లోకి  పాలదిన్  పేపర్ వచ్చింది. తీరా పరిశీలిస్తే  పాలదిన్  పేపర్ కు బెల్లం పాకం వేరుశనగ పప్పు పూసినట్లు ఉంది. వేరుశనగ పప్పు కూడా చెడిపోయిన ట్లు ఉండటం విశేషం. ఈ విషయం ఒకరిద్దరు ఉపాధ్యాయుని ప్రశ్నించగా  ఈసారి అలా రాకుండా చూసుకుంటాం  అన్న సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి   బెల్లం వేరుశనగ పప్పు చెక్కి పరిమాణం  బరువు  ఇంత మేర కేటాయించాలని ఉంది. కానీ అవేమీ కనిపించడంలేదు. బెల్లం  వేరుశెనగ చెక్కి  ఇచ్చేశాం  అంతే.. మధ్యాహ్న భోజన పథకం అమలు పై పర్యవేక్షణ కొరవడింది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా నాణ్యతలేని  పదార్థాలు అందజేస్తున్నారు అని  విమర్శలు వినిపిస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు  ఆ వైపు కన్నెత్తి అయినా చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పాలిథిన్  పేపర్లు పిల్లలకు హాని కలిగిస్తాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

విశాఖ ఉక్కు కోసం కదంతొక్కిన విలేఖరులు

 విశాఖ ఉక్కు కోసం కదంతొక్కిన విలేఖరులు




నర్సీపట్నం, పెన్ పవర్ 

  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న విశాఖ జిల్లా బంద్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిపింది. వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు జిల్లా వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సీపట్నంలో  జాబ్ యూనియన్ సభ్యులు,  వారికి మద్దతుగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముందుగా జాప్ రాష్ట్ర కార్యదర్సి యలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ అబీద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, మానవహారంగా ఏర్పడ్డారు. రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం జాప్ నాయకుడు వేణు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉంటే, దానికి సొంత గనులు కేటాయించి ఆదుకోవాలి గానీ, ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పడిందని గుర్తు చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ పాత్రికేయుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన భారీ ఉద్యమ ఫలితమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, దశల వారీగా  ఉద్యమ నిర్మాణం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అద్యక్షులు ఎం.అప్పలరాజు, అద్యక్షులు గొర్లి రాజు, కార్యదర్సి లంక శివకుమార్, కోశాధికారి కోట్ని రాజశేఖర్, ప్రెస్ క్లబ్ గౌరవ అద్యక్షులు వర్రే రమణ, కార్యదర్సి జామిశెట్టి శ్రీధర్ మరియు పులిగా మురళి, జె.శంకర్, రవిశేఖర్, కడిమిశెట్టి తాతాజీ, పి.గోవింద్, ఎల్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...