స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు మేం వ్యతిరేకం:జికె వీధి అఖిలపక్షం
గూడెంకోత్తవీదీ, పెన్ పవర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని జికె వీధి అఖిల పక్షం నాయకులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్ ను జికె వీధి లో అఖిల పక్షం నాయకులు విజయవంత చేసారు.మండల కేంద్రం మీదుగా ఉన్న రాష్ట్ర రహదారి మీద వెళ్తున్న వాహనాలను నిలిపివేసి, అఖిలపక్షం నాయకులు, గిరిజన ఉద్యోగులు,విద్యార్థులు కలిసి ర్యాలీ చేసినంతరం మానవహారం నిర్వహించి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనంతరం మన్యం లో గల బాక్సైట్ తవ్వకాలు కూడా చేపడతారని,అందుకే జీఓ నెం 89 ని తీసుకొచ్చారని, జిల్లాల పునర్విభజన లో భాగంగా జికెవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలను రంపచోడవరం జిల్లా లో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రోజురోజుకూ నిత్సవసర సరుకుల ధరల ఆకాశానికి అంటుతున్నాయనీ ప్రభుత్వం పాలన చేస్తుందా లేక వ్యాపారం చేస్తుందా అని ప్రశ్నించారు.ప్రభుత్వరంగా సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు కోల్పోతామని, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పాడుకొంటామన్నారు.ఈ కార్యక్రమం లో ఏపి గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, తెదేపా మండల అధ్యక్షుడు కొర్ర బలరాం, సిపిఐ మండల కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు, సిపిఎం మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు గడుతూరి సత్యనారాయణ, గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు ముక్కలి కామేశ్వరరావు, కొర్ర మల్లేశ్వర్రావు, జెఏసి నాయకులు కొర్ర నారాయణరావు,అడపా పరమేశ్వర్రావు, జికెవీధి సర్పంచ్ కొర్ర సుభద్ర,జికె వీధి దేవరాపల్లి ఉపసర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు,యువకులు పాల్గొన్నారు.