Followers

స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని విశాఖ లో న్యాయవాదులు ఆందోళన..

 స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని విశాఖ లో న్యాయవాదులు ఆందోళన..



  పెన్ పవర్,విశాఖపట్నం

  విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కు ఐక్య పోరాట సమితి పిలుపుమేరకు శుక్రవారం చేపట్టిన  రాష్ట్ర బంద్  కు  ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ యూనిట్ మద్దతు ప్రకటించింది.  ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు మెయిన్ గేటు ఎదుట ధర్నా చేపట్టిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నగర ప్రధాన కార్యదర్శి జహారా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు క్యాపిటల్ మైన్స్ కేటాయించాలని , స్టీల్ ప్లాంట్ అప్పులను  పూర్తిగా రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ కి చెందిన 32 వేల ఎకరాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు,  స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు , ఆర్ కార్డు హోల్డర్లకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఎస్ సురేష్ కుమార్  మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాల తో నిర్మితమైన స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించ లనుకోవడం  దుర్మార్గమని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్ని త్యాగాలు అయినా  చేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి జె ఆర్ అజయ్ కుమార్, ట్రెజరర్ హేమమాలిని, న్యాయవాదులు జి సుబ్బారావు, జి సుశీల, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కరెంట్ స్తంభాలు,వీధిదీపాలు వేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

 కరెంట్ స్తంభాలు,వీధిదీపాలు వేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

మందమర్రి, పెన్ పవర్ 

కరెంట్ స్తంభాలు లేని ఏరియాలో స్తంభాలు వేయాలని రామకృష్ణాపూర్ 16వ వార్డు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి కలవల సతీష్ కుమార్ శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గారావు మార్కెట్ ఏరియా, గంగా కాలనీ ఏరియాల్లో కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడంతో ఆ ఏరియా ప్రజలు చీకట్లో జీవిస్తున్నారని ఆయన అన్నారు. విష సర్పాలు ఇండ్లలోకి వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మున్సిపల్ కమీషనర్ సమస్య పట్ల అనుకూలంగా స్పందించి, పరిష్కరానికి కృషి  చేస్తానని తెలిపినట్లు ఆయన తెలిపారు.

తహశీల్దార్ దుర్గారావుకు రెడ్ క్రాస్ అవార్డు

 తహశీల్దార్ దుర్గారావుకు రెడ్ క్రాస్ అవార్డు



పెన్ పవర్,రావులపాలెం

కపిలేశ్వరపురం తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గరావు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి  చేతులమీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు అందుకున్నారు. గతంలో 2018-2019 సంత్సరంలో రావులపాలెం తహసీల్దార్ గా పనిచేసిన సమయంలో ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటీకి ఎక్కువ మొత్తంలో వనరులను సమీకరించడంలో కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ దుర్గారావు  పలువురు అభినందించారు.

స్వేరోస్ గొల్లపల్లి మండల శాఖ ఆధ్యర్యంలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

స్వేరోస్ గొల్లపల్లి మండల శాఖ ఆధ్యర్యంలో  భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

గొల్లపల్లి ,పెన్  పవర్

ఈ రోజు గొల్లపల్లి మండల కేంద్రంలో ని అంబేడ్కర్ విగ్రహం దగ్గర స్వేరోస్ మండల శాఖ ఆధ్యర్యంలో భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరిచడం  జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షులు తాండ్ర జీవన్ మాట్లాడుతూ- మన సుప్రీం స్వేరో,గురుకుల పాఠశాలల కార్యదర్శి, డా.RS ప్రవీణ్ కుమార్ అడిషనల్ DGP గారి ఆదేశాల మేరకు- మార్చ్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు మహనీయుల జయంతి ఉత్సవాలు-

       మాన్యవర్ కాన్షీరాం గారి జన్మదినం మర్చి15న,

       బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఏప్రిల్ 5న,

       మహాత్మ జ్యోతిరావ్ పూలే గారి జయంతి ఏప్రిల్ 11న,

       ఏప్రిల్ 14 న డా.బి ఆర్ అంబేడ్కర్ గారి జన్మదినం సంధర్భంగా  

దాదాపుగా నెల రోజులు స్వేరోస్ మరియు దాని అనుబంద సంఘాలు భీమ్ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుపుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కేవలం విద్యతోనే సమ సమాజ నిర్మాణానికి పునాది వేయవచ్చు అని నమ్మిన మన మహనీయుల ఆలోచనలని స్మరించుకుంటూ వారి పుట్టినరోజులను ఘనంగా నిర్వహిస్తూ,ఈ నెల రోజులు పండగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి 15 న దూలికట్ట, పెద్దపల్లి జిల్లా  సందర్శన తో మొదలయ్యే ఈ భీమ్ దీక్ష  కార్యక్రమం ఏప్రిల్ 18 న NG కాలేజ్ గ్రౌండ్ నల్లగొండ లో  ముగుస్తుంది అని తెలిపారు

ఈ కార్యక్రమంలో స్వేరోస్ గొల్లపల్లి మండల స్వేరోస్ ప్రధాన కార్యదర్శి మారంపల్లి వెంకటేష్,స్వేరోస్ సభ్యులు- చౌటపల్లి తిరుపతి,గంగాదర నరేష్, జేరిపోతుల ప్రణయ్, అంజిబాబు  తదితరులు పాల్గొన్నారు.



రావులపాలెం లో బంద్ పాక్షికం

 రావులపాలెం లో బంద్ పాక్షికం



పెన్ పవర్,రావులపాలెం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో శుక్రవారం బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోడ్ల పైకి రాలేదు. డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే రావులపాలెం బస్ స్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. అయితే  రావులపాలెం, కొత్తపేటల్లో వ్యాపార సంస్థలు మాత్రం యధావిధిగా తెరుచుకున్నాయి. దీంతో బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు



విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 

పెన్ పవర్,ఆలమూరు 

  విశాఖ ఉక్కు ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలంలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు,విద్యా సంస్థలు మూసివేశారు. కొత్తూరు సెంటర్ లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. సీపిఐ మండల కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరోచిత ఆందోళన ఫలితంగా 32 మంది తెలుగు వారి ప్రాణత్యాగాలతో నెలకొల్పబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరి పైనా ఉంది అని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా  కార్పొరేట్  సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ  ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఏ ప్రభుత్వ  సంస్థని మిగల్చకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తుందని, దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ నాయకులు  వి.శ్యామ్, ఏసురాజు,టీడీపీ నాయకులు వంటిపల్లి సతీష్, నల్లబాబు, రామానుజుల శేషగిరి, వైసీపీ నాయకులు  కొపనాతి శ్రీను, నాతి  కుమార్ రాజా , కాంగ్రెస్ నాయకులు లక్ష్మణరావు,ఏ ఐ వై ఎఫ్ ( AIYF)నాయకులు  ఆనంద్,రవి, ఏ ఐ ఎస్ ఎఫ్ (AISF) నాయకులు రామ్ ప్రసాద్, పరీష్ తదితర విద్యార్థి యువజన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నమంత్రి హారిష్ రావు


 విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నమంత్రి హారిష్ రావు

పెన్ పవర్, మల్కాజిగిరి

 గ్రాడ్యువేట్ ఎమెల్సీ ఎన్నికలులో భాగంగా మల్కాజిగిరి అనంద్ బాగ్ లోని బృందవన్ గార్డెడ్స్ లో పట్టభద్రుల విస్తృత స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఆర్దిక శాఖ మంత్రి హారిష్ రావు రాజ్యసభ సభ్యులు కేశవ్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మెహన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు హజరైయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరిష్ రావు మట్లాడుతూ ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు వాటిని అమలు చేసింది లేదని, పెట్రోల్ డిజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవితం పై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం అన్ని ఆరోపించారు. రంగ సంస్థలను పైవేటీకరణ చేస్తున్నారని, ఇటివల ప్రవేశా వెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మెుండిచేయి చూపించారని అన్నారు. ప్రజలు బిజెపికి ఓటు వేయడానికి సిద్దంగా లేరని ఆర్దిక శాఖ మంత్రి హరిష్ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్ది సురభివాణీదేవి ప్రోపెసర్, మాజీ మంత్రి కుమర్తెగా ఒక ఉన్నత సంప్రదాయ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటిలో ఉన్నారని వారిని గెలిపించాలని గ్రాడ్యువేట్ ఓటర్లను కొరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రాముయదవ్, మినా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, జితేంద్ర నాథ్,సబిత అనిల్ కిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ధన్ ఫాల్ రెడ్డి, నాయకులు వీకే మహేష్, బద్దమ్ పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, అధ్యక్ష కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, జి.ఎన్.వి. సతీష్ కుమార్, రాము యాదవ్, గుండా నిరంజన్,మోహన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఖాళీల్,లక్ష్మీ కాంత్ రెడ్డి అమినుద్దీన్,భాగ్యనంద్ రావు,సంతోష్ రాందాస్,కృష్ణ మూర్తి గౌడ్,మోహన్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...