Followers

ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి

 ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి:మేడ్చల్ కలెక్టర్..


మేడ్చల్ ,పెన్ పవర్

ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదనపు ప్రిసైడింగ్ ,అధికారులకు ర్యాండమైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశామని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌  పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఈనెల 14న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గురువారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి 934 మందికి సెకండ్ ర్యాండమైజేషన్ నిర్వహించామని తెలిపారు.. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 198 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... మొత్తం 1,31,000 మంది ఓటర్లు ఉన్నారని దీనికి సంబంధించి ఆయా కేంద్రాల్లో ఎన్నికలు కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. అలాగే కొన్ని చోట్ల ఏమైనా పనులు ఉంటే వాటిని సైతం పూర్తి చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ఇప్పటికే ఆయా ఎన్నికల కేంద్రాల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు,  విద్యాసాగర్, డి ఆర్ ఓ .లింగ్య నాయక్ , ఏ ఓ .వెంకటేశ్వరులు    తదితరులు పాల్గొన్నారు..

ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మందమర్రి,పెన్ పవర్ 

రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు కాలనీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల నుండి రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తూ వారి వేలి ముద్రలు మొబైల్ చెక్ డివైస్ ద్వారా సేకరిస్తున్నామని రామకృష్ణాపూర్ ఎస్సై కటిక రవి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రజలు తీర్థయాత్రలకు తమ అవసరాల నిమిత్తం ఇంటిని వదిలి వేరే ఊరికి వెళ్లినప్పుడు వారు తమ వివరాలు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారస పడి నట్లయితే వారి వివరాలను పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా తమ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల వారిని లేదా ఇతర రాష్ట్రాల వారిని తీసుకు వచ్చినప్పుడు వారి వివరాలు ఆధార్ కార్డు తో సహా పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు వారి వివరాలు ఈ నెంబర్, 100, 6309825776, 9440795039 లకు ఫోన్ చేసి వారి వివరాలు తెలపాలని కోరారు.

మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్


 మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్

కూకట్ పల్లి,పెన్ పవర్

ఆదిలోనే నయం అయే కొన్ని వ్యాధులను మొదటి దశలొనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా జీవితాలను కాపాడుకోవచ్చు అని ఆర్థోపెడిక్  డాక్టర్ సుధీర్ రెడ్డి  తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా ఘాన్పూర్ చెందిన కవిత(28) అనే మహిళ గత 9సంవత్సరాలగా కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఉంది. సరైన వైద్యం అందక డబ్బు చెలించలేని స్థితిలో కూకట్ పల్లిలోని హైదర్ నగర్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కు రావడం జరిగిందని, అప్పటికే కవిత తనంత తానుగా నడవలేక, ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. కవితను పరీక్షించిన డాక్టర్ సుధీర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీచరణ్ ఇతర వైద్యబృందం వైద్యం చేస్తాం కానీ ఏడూ లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు, దీనితో అంత డబ్బు లేదు అని తాను వైద్యులకు వివరించింది. దీనితో వైద్యులు సామాజిక బాధ్యతగా ఆమెకు ఆపరేషన్ ను ఉచితంగా నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో మోకాలి మార్పిడి చాలా అరుదుగా జరుగుతుంది అని డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఆమె వైకల్యాలను సరిదిద్దడానికి ఆసుపత్రిలో ఒక నెల కన్నా ఎక్కువ సమయం పట్టింది అని అన్నారు. నాలుగు నెలల్లో కవిత అందరిలాగానే నడుస్తుందని తెలియజేసారు. కవిత మాట్లాడుతూ తనకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్లు పునర్జన్మ ప్రసాధించారని, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని అన్నారు.

కరోనా పై అపోహలు వద్దు

 కరోనా పై అపోహలు వద్దు అవగాహన ముఖ్యం.వైద్యులు డాక్టర్ రవి

చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో కరోన రాపిడ్ రెస్పాన్స్ సందర్శించి గురువారం నాడు విద్యార్థులను పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మిగతా విద్యార్థినిల కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని అన్నారు. కానీ కరోనా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ లు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సరస్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏ ఎన్ ఎం వనిత, అనిత తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలి.

 ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ రెడ్డి ని  గెలిపించాలి.

కేసముద్రం, పెన్ పవర్

 రాబోయే నల్గొండ  వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున పోటీ చేస్తున్న సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని టి పి సి ఎల్ ఎ రాష్ట్ర పత్రికా విభాగం అధ్యక్షులు కడుదుల జనార్ధన్ కోరారు. గురువారం కేసముద్రం మండలం లోని తాళ్లపూసపల్లి, కల్వల, కేసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, శ్రీ వివేకవర్ధిని హై స్కూల్, కృషి స్కూల్, మహర్షి డిగ్రీ కాలేజీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్ కళాశాల అధ్యాపకుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షులు సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ గా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి, టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీలకి సంబంధించినవి కావని, కానీ రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేయడం ఆశ్చర్యమేస్తుంది అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిని గుర్తించి ఎన్నుకోవాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టి పి సి ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ కే రామారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీణవంక రాజు, నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుదురుపాక జనార్ధన్, బుర్ర సుధాకర్, ధరావత్ శంకర్, బానోతు మంగీలాల్, సుమన్, మూల రాజి రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

మహిళ అనుమానాస్పద మృతి

మహిళ  అనుమానాస్పద మృతి 

మహిళ పై సమూహికంగా అఘాయిత్యం చేసి ..హత్య చేసినట్లు పలు అనుమానాలు..

 పోలీస్ క్లూస్ టీం పరీశీలన..

మిష్టరీని చేదించేందుకు జిల్లా ఏఎస్పీ   యోగేష్ గౌతమ్

బయ్యారం, పెన్ పవర్


మహుబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జగ్ తండా పంచాయితి బీసీ కోలని లో గుర్తు తెలియని వ్యక్తులు బుదవారం రాత్రి  నిమ్మల యాకమ్మ (29)ను.  అతి కిరాతకంగా ఆమెపై  అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కూలి పనులకు వెళ్లుతుండేదని.. భర్త రామారావు ఖమ్మం లో హమాలి పని చేస్తూ ఉండేవాడని భార్య భర్తలు చాలా ఆన్యోన్యంగా ఉండేవారని పేర్కొన్నారు. మృతురాలు ఆ కాలనీలో మరి కొంత మంది మహిళలతో
రాత్రి సమయాలలో ట్రాక్టర్లలో ఇసుక నింపేందుకు కూలీ పనులకోసం వెళుతుండేవారని తెలిపారు. ఇంత దారుణానికి ఎలా ఒడి గట్టి హత్య చేశారో తెలియడం లేదని.. హత్య జరిగిన సమయంలో ఇంటి చుట్టూ పక్కల ఇల్లు తాళాలు వేయడం... ఎవరు లేక పోవడంతో  మృతురాలిని ఇంటి పక్కనే నిర్థీవ ప్రాంతంలో హత్య చేసి.. ఇంటి వరండా బాగంలో నిందితులు  విద్యుత్ షాక్ తో  చని పోయే విదంగా  చిత్రీకరీంచే ప్రయత్నం చేసినట్లు కనపడుతుందని తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సూర్య.. (08), చిన్న కుమారుడు ఆది (03), చిన్న కుమారుడు ఆనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. దీనిపై స్టానిక ఎస్ ఐ జగదీష్ తమ సిబ్బందితో మహిళ  అనుమానాస్పద మృతి  సంఘటణ ప్రాంతాన్ని పరిశీలించి,  విషయాన్ని జిల్లా పోలీసు అధికారులు తెలుపడంతో, జిల్లా ఏఎస్పి  యోగేష్ గౌతమ్ చేరుకొని క్లూస్ టీం తో ఫోరెన్సీ అధికారులు చేరుకొని ఆప్రాంతాన్ని క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం  కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

39వ వార్డు పర్యటనలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం

 39వ వార్డు పర్యటనలో  వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి  సింహాచలం




మహారాణి పేట, పెన్ పవర్

  39కొత్త వార్డ్ చిలకపేటలో వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై  డ్రైనేజీ నీరు, నిలుపుదల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే అక్కడికి చేరుకుని సంబంధించిన జీవీఎంసీ అధికారులు సానిటరీ ఇన్స్పెక్టర్ లతో  ఫోన్ లో మాట్లాడి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించి,అక్కడ నివసించే ప్రజలు ఎక్కువుగా  డ్రైనేజీ వాటర్ వెళ్లుటకు అవకాశం లేనందువల్ల దోమలు చేరకుండా ఉండేందుకు దోమలు నివారణ చర్యలు లో భాగంగా ఫాగింగ్ చేయాలని ప్రజలు వినతి పత్రం అందజేశారు.తక్షణమే సమస్యలపై. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కొల్లి సింహాచలం అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల యొక్క ప్రతీ సమస్య తన సమస్యగా భావించి తక్షణమే చర్య చేపట్టి ప్రజల మన్నలను పొందుతున్న ఎమ్మెల్యే గారని అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ మాజీ కార్పొరేటర్ కుల పెద్ద కదిరి అప్పారావు ముస్లిం కుల పెద్ద అలీ ఖాన్ కుమారడు నూశృద్ద్ అలీ ఖాన్ సౌత్ మైనారిటీ ప్రెసిడెంట్  ముజీబ్ ఖాన్,వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తు నల్ల బాబు మహిళా వార్డు ప్రెసిడెంట్ మాధురి,మత్తు శ్రీను(,సి మెన్ శ్రీను )హెరా  సాయి,బాబ్జి,తిత్తి కృష్ణ ,కుదీర్ తుల్ల,కామల్,రమణ విజయ్,మాణికుమార్,వెంకట్,అమ్మోరు,బంగారి, పెంటయ్య,కదిరి చిన్నప్ప రావు,సి మెన్ బాషా, ఇబ్రహీం, శివ,లాయర్ రసూల్,కదిరి చిన్న అప్పారావు, యూసుఫ్,బుకరి ఖాన్,మామ,దూడ తాతారావు, సలీమ్, బంగారి,హరి,పెంటయ్య,సన్యాసి రావు, ఇక్బాల్,వెంకట్,శివ,రాంబాబు,శివ,సంతోష,రవి, ప్రసాద్,రమణ,సత్తిబాబు,రాము,రాజు,రవి,సంజయ్, నవీన్,రామకృష్ణ,సతీష్, వరహాలు రావు,సకల సూరి,మంగరాజు,బుజ్జి,కొండా,హమీద్,సతీష్, రాజు, పైడినాయుడు,గణేష్, వేణు,ఎల్లాజీ,రమణమ్మ, నూకరత్నం, కదిరి చిన్న అప్పారావు,మాలతి,అనిల్, అది, శ్రీను, క్రాంతి,సాయి,పవన్,రాజేష్,ధనరాజు, స్థానిక మహిళలు, వైస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...