Followers
వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం
విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం
మందమర్రి, పెన్ పవర్
మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం గురువారం పాఠశాల విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయూబ్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల నుండి నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ (ఎన్ఎస్ఎస్) ఆర్గనైజిర్ ద్వారా నాసాకు ప్రాజెక్టును పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తున్నారని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వారు అభినందన పత్రాలు పంపించగా, నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని గురువారం విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేసినట్లూ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డిజిఎం లక్ష్మణ్ రావు, ఆర్ఐ రాజు, అకాడమీ కోఆర్డినేటర్ కృష్ణారావు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నాగేశ్వరరావు, గైడ్ టీచర్ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి
జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి
మందమర్రి ,పెన్ పవర్
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోడ్రైవర్ పట్ల అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ముఖేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే జిల్లా వ్యాప్త ఆటోల బంద్ లో ప్రజలు, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆటో యూనియన్ మందమర్రి పట్టణ అధ్యక్షులు మేడి రాజు కోరారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మించి హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, ఎండీ షరీఫ్, దాసరి రాజ్ కుమార్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి
పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి
వ్యవసాయ శాఖ ఏడీఏ చౌదరి
పెన్ పవర్, పెదపళ్ల
ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీఏ సీహెచ్ కేవీ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారిణి (ఏవో) సోమిరెడ్డి లక్ష్మి లావణ్య అన్నారు. ఆలమూరు మండలంలో పెద్దపల్ల గ్రామంలో డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం ఆలమూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వీహెచ్ కేవీ చౌదరి, ఏవో ఎస్ లక్ష్మి లావణ్య అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యకరమమలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు విధానాలు గురించి వివరించారు. పొలంబడిలో నాలుగు యాజమాన్య సూత్రాలు, పొలం పరిసరాల విశ్లేషణ, బాగస్వామ్య కార్యాచరణ, పరిశోదనలు వంటివి క్షేత్రస్థాయిలో రైతులతో పొలంలో నిర్వహించారు. అలాగే సుడిదోమ,జీవిత చక్రం దానికి నివారణకు తూటికాడ కాషాయం తయారీ విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి వారం నిర్వహించే ఈ పొలంబడి శిక్షణను రైతులు వినియోగిచుకోవలని తెలియజేశారు. అనంతరం పంట పొలాలను సందర్శించి రైతులతో చర్చలు జరిపి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదపల్ల, గుమ్మిలేరు, సంధిపూడి, మోదుకురు గ్రామా వ్యసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.
సమర్థులను ఎన్నుకోండి అభివృద్ధికి బాటలు వేయండి
సమర్థులను ఎన్నుకోండి అభివృద్ధికి బాటలు వేయండి ఓటు వేసి గెలిపించండి
మీతోనే ఉంటాను బిజెపి జానసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి ఇంటింటా ప్రచారం
విశాఖ తూర్పు పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిని గా పోటీ చేస్తున్న ద్వారపు రెడ్డి అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డ్ డి ఆర్ డి ఎ ఆఫీస్ పరిధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్కసారి అవకాశం ఇచ్చి తనకు గెలిపించినట్లయితే వార్డ్ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు నేను పుట్టిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని, ఒక అవకాశం ఇవ్వండి అని ముందుకు సాగారు చదువుకున్న వ్యక్తి, న్యాయవాది అయ్యి ఉండటం వల్ల సమస్యల మీద తనకు ఒక అవగాహన ఉందని, ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే నమ్మకంతో ప్రజలు ముందుకు వస్తున్నానని అన్నారు విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు భాగంగా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శ్యామ్ కుమార్., రామారావు మరియు బిజెపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
మాన్సస్ చైర్మన్ పదవికి సంచయత రాజీనామా చెయ్యాలి!
మాన్సస్ చైర్మన్ పదవికి సంచయత రాజీనామా చెయ్యాలి!
డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక డిమాండ్!
విజయనగరం,పెన్ పవర్
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరుపొందిన మాన్సస్ విద్యా సంస్థల పేరుని చెడగొట్టేలా వ్యవహరిస్తోన్న చైర్మన్ సంచయత తనపదవికి రాజీనామా చేయాలని డాక్టర్ పి.వి.జి. రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు గురువారం సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాన్సస్ సంస్థ పుట్టినరోజు మార్చ్ మూడోవతేది అని తెలిసికూడా చైర్మన్ గా కనీసం సంస్థ ఫౌండర్స్ డే చెయ్యకుండా తప్పించుకు తిరగడం మంచిది కాదని తాను ఆనందగజపతి రాజు వారసురాలునని చెప్పుకు తిరగడమేతప్ప వారి గౌరవాన్ని కాపాడటంలో విఫలమయ్యారని, సంచయత ఛైర్మన్ గా బాధ్యత తీసుకొని మాన్సస్ లో అనేక సంచలనం సృష్టించిన నిర్ణయాలు తీసుకొని మాన్సస్ కి చాలా చెడ్డపేరు తెచ్చిపెట్టారని అన్నారు గతంలో ఆనందగజపతిరాజు చైర్మన్ గా సంస్థ కి ఎంతో గొప్పపేరు తేవడమేకాక వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటూ ఉపాద్యాయులని కుటుంబసభ్యులుగా చూసుకుంటూ మాన్సస్ ని నడిపించేవారని అన్నారు,రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ ని ఎందుకు కొనసాగిస్తున్నారని,గత సంవత్సరం విద్యార్థులకి డోనర్స్ ఇచ్చిన నగదు పురస్కారాలు ఏమయ్యాయని,చైర్మన్ గా సంచయత డోనర్స్ కి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు, ఎండోమెంట్స్ నుండి విడుదలైన నిధుల పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం ఊర్మిలా కూడా మెంబర్ గా ప్రమాణస్వీకారం చెయ్యాలని కానీ సంచయత అడ్డుకున్నారని భీశెట్టి విమర్శించారు, ఎంతో మంది ఉపాద్యాయులని అక్రమంగా తొలగించారని, చాలా మంది ఉపాద్యాయులకి అరవై శాతం జీతాలు ఇచ్చి మిగిలింది ఇవ్వకుండా తిప్పుతున్నారని పాపం ఉపాద్యాయులకుటుంబాలు నిస్సహాయ స్థితిలో రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు,ప్రధాన కార్యాలయం పద్మనాభం కి ఎందుకుమార్చవలసి వచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొందని,సంచయత పిచ్చిపిచ్చిగా నిర్ణయాలు తీసుకోవడం మానుకొని చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని భీశెట్టి డిమాండ్ చేశారు.
పేద వృద్ధులకు భోజనాలు సమకూర్చిన వృద్ధమిత్ర కో-ఆర్డినేటరు ఆదిత్య
పేద వృద్ధులకు భోజనాలు సమకూర్చిన వృద్ధమిత్ర కో-ఆర్డినేటరు ఆదిత్య
విజయనగరం,పెన్ పవర్
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...