Followers

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం అభినందనీయమం

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం అభినందనీయమం



విజయనగరం, పెన్ పవర్ 

తెలుగుదేశం పార్టీ విధివిధానాలకు విసిగివేసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం నాడు తన నివాసంలో 50 వ వార్డు పరిధిలో వైయస్సార్ నగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ వార్డు ఉపాధ్యక్షులు తిరుమల నాయుడు, కోశాధికారి  షేక్ సలీం ఖాన్, తెలుగు యువత కన్వీనర్ మొయిద రాజీవ్, తెలుగు మహిళా విభాగం నేతలు మంగమ్మ, వెంకటలక్ష్మి, షేక్ హసీనా, పార్టీ జాయింట్ సెక్రటరీ నాయుడు శేఖర్ తో పాటు, భారతీయ జనతా పార్టీ పట్టణ యువమోర్చా బీసీ అధ్యక్షులు అనుపోజు శేఖర్, వీరితో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కోలగట్ల సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి రావడం శుభపరిణామం అన్నారు. నేటి నుంచి వీరు వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులని, అందరూ సమిష్టిగా పనిచేసి  వార్డు అభ్యర్థులను గెలిపించాలన్నారు. 2024 కల్లా నగరంలో మౌలిక వసతులు సమస్య లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి నేతలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము తెలుగుదేశం పార్టీలో ఉన్న గౌరవం లేదని, వారి విధానాలు నచ్చకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు తప్పకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ పార్టీ పోటీ అభ్యర్థి పట్టా ఆదిలక్ష్మి, పార్టీ నాయకులు  జగన్నాథరెడ్డి,  రఘురామయ్య, కనకల సంతోష్, తాడి శేఖర్, నాగభూషణం తోపాటు  డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమ పధకాలే గెలిపిస్తాయి

 సంక్షేమ పధకాలే గెలిపిస్తాయి



 25 వ వార్డులో సన్యాసిపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్ 

స్థానిక సంస్థల ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసిపి సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు ధీమా వ్యక్తం చేశారు.  నర్సీపట్నం మున్సిపాలిటీ 25 వ వార్డు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దేవత అరుణ కు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అబీద్  సెంటర్ రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన ప్రచార రధాన్ని ప్రారంభించారు.  అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అబీద్  సెంటర్,  అయ్యరకవీధి, మేదర వీధి, తోటవారి వీధి లో సన్యాసి పాత్రుడు ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచుతూ వైసీపీ అభ్యర్థిని  దేవత అరుణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 25 శాతం తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉన్నందున, దేవత అరుణను ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.  అభ్యర్థిని దేవత అరుణ మాట్లాడుతూ రాజకీయం అంటే ప్రజాసేవ అనే ఉద్దేశ్యంతో, వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని,  వార్డు సమస్యలపై కౌన్సిల్లో తన వాణిని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పెదిరెడ్ల  శ్రీనివాసరావు, పెదిరెడ్ల కుమార్,  సురేష్, పద్మనాభుని కన్నయ్యశెట్టి, లాలం చినఅప్పారావు, తాటికొండ బ్రహ్మలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

మినుము పంట రకం టియు - 40 పంటను క్షేత్రస్థాయిలో సందర్శన

 మినుము పంట రకం టియు - 40 పంటను క్షేత్రస్థాయిలో సందర్శన

చెన్నూరు, పెన్ పవర్

చెన్నూరు మండలం కొమ్మెరా గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ ఆహార భద్రత పథకం  (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద ఇచ్చినటువంటి మినుము పంట రకం టియు - 40 పంటను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయల పంటలు ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సస్య రక్షణ చర్యలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. పంట కల్లలు పనులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్. సాగర్, నాయకులు రాజమల్లు, గట్టు మొండి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ

 కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ 

సచివాలయసిబ్బంది స్పందన కార్యక్రమం లో 

మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు

తప్పనిసరిగా హాజరు కావాలి  

  పెన్ పవర్, పెద్దాపురం



సచివాలయంలో జరుగు స్పందన కార్యక్రమానికి మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయ సిబ్బంది సచివాలయంలోనే ఉండాలని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం పెద్దాపురం మండలం జి. రాగంపేట సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. స్పందన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది సచివాలయంలో హాజరుకాకపోవడం మాదృష్టికి వచ్చిందని తెలిపారు.  క్షేత్రస్థాయిలో విధులు నిర్వత్తించిన, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు  సచివాలయంలో హాజరు కావాలని, దీనిపై మండలస్థాయి అధికారులు పర్యవేక్షణ వుండాలని అన్నారు. గత డిసెంబర్ నుండి నేటి వరకు ఆర్జీలు బయట మీ-సేవలో పెరుగుతున్నాయని ,సచివాలయంలో ఆర్జీలు తగ్గినవ ని దీనికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.  ఏప్రిల్ నెల నుంచి సచివాలయ జీతాలు బయోమెట్రిక్ ద్వారా అనుసంధానం చేయడం జరుగుతుందని, దీనికో లాగిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తనికీలోబయోమెట్రిక్ హాజరు జెసి  పరిశీలించారు. హాజరుకాని సిబ్బంది వివరాలను సచివాలయ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో వచ్చిన అర్జీలు, పరిస్కరించిన అర్జీలు నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించారు. కౌలురైతులు గ్రామంలో ఎంత మంది ఉన్నారని, కౌలురైతు రుణ అర్హత కార్డు ఎంత మంది పొంది ఉన్నారని వ్యవసాయ సహాయకుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ అప్పర్ ప్రైమర్ స్కూల్ నాడు-నేడు పనులు పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా పిల్లలుకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించి జాయింట్ కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు పెట్టిన  భోజనాని భుజించారు. తదుపరి తరగతులను  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ డిఓ కె.ఎం.వి ప్రసాద్, ఎంపీడీఓ కె.రమణారెడ్డి, తహసీల్దార్ బి.శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి ఎం. సెలెక్టరాజు ఇఓపిఆర్డీ హిమమహేశ్వరి,ఎంఇఓ టి. జోసఫ్, హెచ్.ఎం కెనడి,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ , డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి

 ✍గ్యాస్ , డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క నాగేశ్వరరావు

జగ్గంపేట, పెన్ పవర్

గ్యాస్,డీజిల్,పెట్రోల్ధరలనువెంటనే తగ్గించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జగ్గంపేట లోని గ్యాస్ ఏజెన్సీని  ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పేరుతో ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరను విపరీతంగా పెంచేశారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహార శైలికి  పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగడంతో సామాన్యులపై పెను భారం పడిందన్నారు. నెలలో రెండు సార్లు రాష్ట్రంలో గ్యాస్ ధరలు పెరిగాయని,  గ్యాస్ ధర నేడు కూడా పెరిగి 847రూపాయలు అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అనేక మంది సామాన్య ప్రజలు ఉన్నారని, ఈ గ్యాస్ ధర పెంపు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందన్నారు.  రోజుకు 200 నుంచి 300 రూపాయల కూలీ పనిచేదుకునేవారు ఈ ధరలతో ఎలా జీవించగలరని ప్రశ్నించారు. అలాగే పప్పులు, నూనెలు, వంటి నిత్యావసర ధరలన్ని విపరీతంగా సామాన్యులు బ్రతకడానికి వీలులేకుండా పోయిందన్నారు.  ఇక ఉల్లిపాయల ధరలైతే సామాన్యులను కంటతడి పెట్టిస్తున్నాయన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ప్రణాళికను తీసుకువచ్చి ప్రజలను ఈ బారి నుండి రక్షించాలని, ధరలను తగ్గించాలని  నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు

 ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు

చెన్నూరు , పెన్ పవర్

జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దుర్గం రఘునాథ్ గత 7 సంవత్సరాలుగా సామాజిక సేవలో భాగంగా  నిరుపేదలకు అన్నదానం నిత్యవసర సరుకులను అందిస్తూ రక్తదానం అవయవ దానం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్త దాతలను పంపడం వంటి సేవలు చేస్తున్నందుకు మంగళవారం ఢిల్లీలో పూర్వర్ అచీవర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో దుర్గం రఘునాథ్ కు బాలీవుడ్ నటుడు కునాల్ సింగ్ రాజ్ పుథ్ చేతుల మీదగా ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం రఘునాథ్ మాట్లాడుతూ, నిరుపేదలకు సేవ చేసినందుకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ పోలీసుల మెరుపుదాడులు.

 ఎక్సైజ్ పోలీసుల మెరుపుదాడులు.

నాటుసారా స్వాధీనం.

 బెల్లం పానకం ధ్వంసం.

గంభీరావుపేట్ ,పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటమండలంలోని ముచ్చర్ల తండా శివారు ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. ఈ నాటు సారా తయారీ కి బాధ్యులు అయినటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్ తో పాటు  హెడ్కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్ రావు, హఖాని మరియు సిబ్బంది హమీద్, శంకర్, సుమన్, కృష్ణా నాయక్, రాజేందర్, రూప, సుమలత పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...