రాష్ట్ర బందుకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో మోటారుసైకిల్ ర్యాలీ!
పెన్ పవర్,తాడేపల్లిగూడెం
విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5 వతేదీన తలపెట్టిన రాష్ట్రబందును విజయవంతం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం మోటారుసైకిలుర్యాలీ జరిగింది.విశాఖఉక్కు పరిరక్షణ ఐక్య కార్యాచరణకమిటీ పిలుపుమేరకు జరిగిన కార్యక్రమంలో ఏ.ఐ.టి.యు.సి., సి.ఐ.టి.యు., అనుబంధ కార్మిక సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.స్థానిక హౌసింగ్ బోర్డు సెంటరులోని ఎస్వీరంగారావు విగ్రహంవద్ద ప్రారంభమైన ర్యాలీఆర్టీసిడిపో,తాలూకాఆఫీసుసెంటర్, ఎంటీఆర్ చౌక్, ఓవర్ బ్రిడ్జి, విజయాటాకీస్ సెంటర్, తాళ్ళముదునూరుపాడు మీదుగా పెంటపాడుగేటు, మార్కెట్, ప్రభుత్వ డిగ్రీకళాశాల మీదుగా తిరిగి తాడేపల్లిగూడెం ఓవరుబ్రిడ్జి వద్దకుచేరింది.ర్యాలీ ప్రారంభానికి ముందు కార్మికులను ఉద్దేశించి సి.పి. ఎం. జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమసుందర్, సి.ఐ.టి.యు.జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సి.పి.ఐ. జిల్లా కౌన్సిలుసభ్యుడు కళింగ లక్ష్మణ రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ముడిపడి ఉందని, రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిఘటించాలని పిలుపుఇచ్చారు. 5 వ తేదీ తలపెట్టిన బందును జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమానికి ఏ.ఐ.టి.యు.సి. నాయకులు ఓసూరివీర్రాజు, తాడికొండశ్రీనివాసరావు, కర్రి వీర వెంకట సత్యనారాయణ, ఎస్.సూర్యనారాయణ, అప్పలరాజు, అంగిన శ్రీనివాస్, ఎర్రగోగులవీర్రాజు, అర్జున, వెంకటేష్, కే.ముత్యం, మండేల్లి అంజి, రామకృష్ణ, అల్లంనరేంద్ర, పోలి రాతి ఆది నారాయణ, సి.ఐ.టి.యు నాయకులు సిరపురపు రంగారావు, కరెడ్ల రామ కృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, జవ్వాదిశ్రీను, మడకరాజు, ధనాలవెంకట్రావు, జగ్గు నిరంజనరామారావు, బి.శ్రీనివాసు, సి.పి.ఐ. నాయకులు మండల నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.