Followers

ప్రతి బుధవారం రోగులకు అల్పాహారం అందిస్తాం

 ప్రతి బుధవారం రోగులకు అల్పాహారం అందిస్తాం

 స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్

 ఆదిలాబాద్ , పెన్ పవర్



 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో వచ్చే రోగులకు నేటి నుండి  ప్రతి బుధవారం అల్పాహారం అందించడం జరుగుతుందని స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ అన్నారు.స్వస్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈరోజు నుండి ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ లో నిరంతరాయంగా అల్పాహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎంతో మంది ట్రైబల్స్ గ్రామాల నుంచి వస్తున్న రోగులు వారి బంధువులు ఉదయం పూట ఆకలితో అవస్థ పడుతున్నారని ఈ విషయం మా దృష్టికి రావడం తో ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా అల్పాహారం అందించడానికి పూనుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ 10 సంవత్సరాలు పూర్తవడంతో ఇక ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.అన్నదాన కార్యక్రమాలు చేసి  అవకాశం రావడం మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్ష్మణ్ సింగ్ పోతివాల్, మున్నా ,పురుషోత్తం, నక్క గణేష్ ,సాయి కిరణ్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల సంతకాల సేకరణ

 న్యాయవాదుల సంతకాల సేకరణ

కూకట్ పల్లి,పెన్ పవర్




వామనరావు దంపతులను నడి రోడ్డుమీద అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ లీగల్ సెల్ పిలుపుమేరకు కూకట్ పల్లి కోర్టులో న్యాయవాదుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య జరిగి రోజులు గడుస్తున్నా సరే అధికారులలో చలనం లేదని, జంటహత్యల కేసులో విచారణ వేగవంతం చేసి నిజమైన నిందితులను పట్టుకొవాలని, స్వయం ప్రతిపత్తి గల సంస్థతో న్యాయ విచారణ జరిపించాలని, న్యాయవాదులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అఖిలేష్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కృష్ణ కుమార్, యాదయ్య, హరీష్ శంకర్ రెడ్డి, మల్లేష్, సుబ్బారావు, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్రావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

108 అంబులెన్స్ ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు

 108 అంబులెన్స్ ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు

గంభీరావుపేట్,పెన్ పవర్


గంభీరావుపేట మండల కేంద్రంలో  108 అంబులెన్సు ను  ఎంపీపీ వంగ కరుణ మండల వైద్యాధికారి వెంకటేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగా కరుణ మాట్లాడుతూ మండలం లో ఆరోగ్య సేవల నిమిత్తం ప్రభుత్వం 108 వాహనాన్ని మండలానికి అందించిందని ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి సింగిల్విండో చైర్మన్ భూపతి సురేందర్,  ఏఎంసి సుతారి బాలవ్వ, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పి కోఆప్షన్  హైమద్, ఎంపిటిసి భాగ్య, దమ్మన్నపేట సర్పంచ్ లక్ష్మి, మాజీ ఎంపిటిసి ఏగదండి స్వామి, ఏఎంసి డైరెక్టర్ శేఖర్ గౌడ్, తెరాస నాయకులు సురేందర్ రెడ్డి, సి హెచ్ వో రమేష్, వైద్య సిబ్బంది బాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు



విజయనగరం,పఎన్ పవర్ 

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వైసీపీఅరాచకపాలనకు ముగింపు పలకాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం 26వడివిజన్లో, సాయంత్రం 20, 27, 28 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దురాగాతాలకు తెగబడినా టీడీపీ ఎదురొడ్డి పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టణంలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి, బెదిరించి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పధకాలు అమలులో నెం.1 స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఎన్నికల్లో ఎందుకు దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు, ప్రజల నుంచి తీర్పు కోరేందుకు వైసీపీ భయపడుతోందన్నారు.ఓడిపోతామనే భయంతోనే దౌర్జన్యాలు, ప్రలోభాలకు తెరతీసారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం శాంతియుత వాతావరణంలో సాగాలని, అటువంటి పరిస్థితులు కలిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పారదర్శక పాలన సాగాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో 26వ డివిజన్ అభ్యర్థి విజ్ఞపువెంకటలక్ష్మి, 20వ డివిజన్ అభ్యర్థి జోగచంటి, 27వ డివిజన్ అభ్యర్థి కంఠ మీనాకుమారి, 28వ డివిజన్ అభ్యర్థి సారిక వెంకటరమణ, పార్టీ నాయకులు ఐవిపి రాజు, విజ్ఞపు ప్రసాద్, కంఠఎర్రయ్య, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.


తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు

 తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్



ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగ ఆక్కపూర్ కృష్ణ ను మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నియామకం చేశారు.

ఈ సందర్భంగా దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. వీటితోపాటు బూత్ కమిటీ నియామకం కూడా చేపట్టడం జరుతుందన్నారు. గ్రామంలో గ్రామశాఖ ఉపాధ్యక్షునిగా గుంటి నాగరాజు ఎస్ సి సెల్ అధ్యక్షునిగా జెల్లీ ప్రభాకర్ ఉపాధ్యక్షునిగా సండ్ర గణేశ్ నియమించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జండా ఆవిష్కరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కె గౌస్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్ కె సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్, కరికే శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు

కుటుంబ సభ్యులను నమ్మించేందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్లుగా కట్టు కథ

 కుటుంబ సభ్యులను నమ్మించేందుకే కాళ్ళు, చేతులు కట్టేసినట్లుగా కట్టు కథ

విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఐపిఎస్

పెన్ పవర్,విజయనగరం

విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులను కట్టేసి ఉన్నట్లుగా మార్చి 1, ఉదయం గుర్ల పోలీసులకు వచ్చిన సమాచారం పై గుర్ల ఎస్ఐ నీలావతి మరియు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంకు వెళ్ళి కాళ్ళు, చేతులు బంధించి ఉన్న సుమారు 24 సంవత్సరాల అమ్మాయిని అపస్మారక స్థితిలో గుర్తించారు. వెంటనే, ఆమెకు స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి,చికిత్స నిమిత్తం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి నుండి విజయనగరం ఘోషాసుపత్రికి పంపడం జరిగింది.చికిత్స తరువాత కోలుకున్న అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు క్రైం నంబరు 45/2021 గా కేసు నమోదు చేసారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఈ కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషనుకు అప్పగించి, డిఎస్పీ శ్రీ టి.త్రినాధ్ గార్ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. మహిళా పిఎస్ డిఎస్పీ త్రినాథ్ తో పాటు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్, విజయనగరం రూరల్ మంగవేణి, గుర్ల ఎఱ నీలావతి, పి.నారాయణరావులు వివిధ బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీగారి స్వీయ పర్యవేక్షణలో ఫిర్యాది చెప్పిన వివరాల ప్రకారం సాక్ష్యాధారాలను సేకరించారు. చివరికి ఫిర్యాది తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకుగాను ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని పెర్మిషను తీసుకొని బయటకు వెళ్ళినట్లుగా చెప్పారు. ఇదే సమయంలో హాస్టల్ లో తన గురించి తన అన్నయ్య వాకబు చేసినట్లుగా విషయం తెలుసుకున్న అమ్మాయి, తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన పాలకొల్లు-పాలకొండ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె గుర్ల రోడ్డు ప్రక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకుగాను తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకొని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు ఆమె అంగీకరించినట్లుగా తెలిపారు. తాను హాస్టల్ నుండి బయటకు వెళ్ళిన విషయంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకే తనను గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ళు, చేతులు కట్టేసినట్లు కట్టు కథ చెప్పినట్లుగా వెల్లడైందని, ఈ విషయం సిసీ ఫుటేజిల పరిశీలన ద్వారా నిర్ధారణ అయ్యిందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.ఈ కేసు విచారణలో విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, దిశ మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్, విజయనగరం రూరల్ సీఐ టి.ఎస్.మంగవేణి, గుర్ల ఎస్ఐ నీలావతి, విజయనగరం రూరల్ ఎస్ఐ పి. నారాయణరావులుసమర్ధవంతంగా పనిచేసి, 48 గంటల్లో కేసును ఛేదించి, వాస్తవాలను వెలికితీసారని, వారిని అభినందిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు.


హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్

 హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్  రంగినేని మనీషా- పవన్ రావు దంపతులు...

 


ఆదిలాబాద్, పెన్ పవర్ 

 ఆదిలాబాద్ మండలంలోని  జామున్ దరి గ్రామంలోని స్థానిక హనుమాన్ ఆలయంలో బుధవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా దంపతులు మండల టిఆర్ఎస్ నాయకులతో,గ్రామస్తులతో  కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు  గ్రామస్తులు మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ బాయి  ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు  లకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయ, లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం లేనటువంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రం ఈరోజు నెంబర్ వన్ లో ఉంది అంటే అది కేసీఆర్  పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకన్న, అయ్యుబ్, గంగారెడ్డి, క్రాంతి, నర్సారెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...