Followers

18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

ఎం.పి రాజ్యసభ సభ్యులు జి.వి. ఎల్ నరసింహారావు పిలుపు

పెన్ పవర్,విశాఖపట్నం

యం. వి.పి కాలనీ తూర్పు నియోజక వర్గ బిజెపి కార్యకర్తల సమావేశం జామి ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమమునకు ఎం.పి  రాజ్యసభ సభ్యులు  జి వి యల్ నరసింహ రావు పాల్కొంటo జరిగింది 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి ని అత్యధిక మెజారిటీ తో గేలిపించలని కార్యకర్తలను కోరారు   ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని చూసి ఓటు వెయ్యండి...బీజేపీ ... గత 6 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి చేసిన విశేష కృషిని చూసి రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కోరారు.   ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి బీజేపీ కి ప్రాతినిధ్యం లేకపోయినా ప్రక్క రాష్ట్రాలనుంచి రాజ్యసభకి ఎన్నికై, పార్లమెంటులో రాష్ట్ర సమష్యల పట్ల పొరాడుతున్నామని, తమ శ్రమను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను ఆదరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు ధన రాజకీయాలు, భ్రమ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర సమష్యల పరిస్కారంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖకు, రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్త్తున్న మన్నరు  విశాఖపట్నాన్ని దేశంలోనే మొదటి స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. విశాఖపట్నంలో వైద్యపరికరాలను తయారీచేసే మెడ్టెక్ పార్క్ స్థాపించారన్నారు. 500కోట్ల రూపాయాలతో 350 పడకల సూపర్ స్పెషలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నా మన్నారు. విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గాగుర్తించి అభివృద్ధి చేస్తున్నా మన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము, జనసేన తో కల్సి విశాఖలోని 98 వార్డుల్లో పోటీచేస్తున్నా మన్నారు. విశాఖ స్టీల్ నుసమర్ధ వంతంగా నడిపి లాభాల్లోకి తీసుకు రావడం కోసమే ప్రయివేటు కు అప్పగించాలనే విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో . రామా,లీలావతి,శ్యామ్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ రవీంద్ర రెడ్డితదితరులు పాల్గొన్నారు.



కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు మూడు నెలల జైలు శిక్ష

 కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు మూడు నెలల జైలు శిక్ష 

రాజన్న సిరిసిల్ల జిల్లా,పెన్ పవర్

 కోర్టు ధిక్కరణ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ డి. కృష్ణ భాస్కర్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాష, భూ సేకరణ అధికారి శ్రీనివాసులకు హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయలు జరిమానాగా విధించింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గోదావరి నీటిని అధికారులు ప్రాజెక్టులోకి తరలించారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పిటిషనర్లకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.

ముహూర్తానికి మోక్షమెప్పుడు …?

 ముహూర్తానికి మోక్షమెప్పుడు …?  

పేదోడి సొంతింటి కళ నెరవదెన్నడు ......?  

రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్



నిరుపేదలే లక్ష్యంగా తెలంగాణ  రాష్ట్ర సర్కార్ నిరుపేదల , బడుగు బలహీన వర్గ  ప్రజల సంక్షేమ దిశగా అనేక  రకాల పధకాలను ప్రవేశపెట్టింది .  రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పధకాలలో అతి ప్రదానమైనది.  రెండు పడకల గదుల నిర్మాణం చేపట్టడం.   వసతి సౌకర్యాన్ని కల్పించే  దిశగా  రెండు పడకల గదులను నిర్మింఛి దారిద్ర  రేఖకు దిగువన ఉన్న నిరుపేద ప్రజానికానికి   అందించాలన్నదే  ప్రభుత్వ లక్ష్యం.  

జోరుగా ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములోని రాచర్ల గొల్లపల్లి, వెంకటాపూర్, రాచర్ల బొప్పాపూర్, కోరుట్లపేట గ్రామలలో నిర్మించిన రెండు పడకల  గదుల నిర్మాణం పూర్తయి ప్రారంబోత్సవం , ఇళ్ళ పట్టాల పంపిణీల స్తితి గతులు అందుకు బిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అర్హులైన లబ్ధిదారులకు నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్య ఉద్దేశం అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించి ప్రచారం హంగు ఆర్భాటాలు కూడా ఎక్కువే కానీ నిరుపేదలకు ఇప్పటికీ డబుల్ బెడ్ రూములు అందకపోవడం వల్ల లబ్ధిదారులకు నిరాశనే మిగిల్చింది.

గత చరిత్ర ఎల్లారెడ్డిపేట పట్టణము చివరిలో  స్థలములో  దివంగత నేత  ముఖ్యమంత్రి వై ఎస్  రాజశేఖర్ రెడ్డి హయాములో ఇందిరమ్మ ఇల్లు అనే పదకము ద్వారా నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టి అర్హులైన లబ్దిదారులకు అందించి పేదల సొంతింటి కళను నెరవేర్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.  

పదకొండు కోట్ల వ్యయం అయితే టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వగా ,  మిగిలిన ఖాళి  స్థలములో   సుమారుగా  నాలుగు ఎకరాల విస్తీర్ణములో  నిర్మించే 168  రెండు పడకల గదుల నిర్మాణానికి 2016 సంవత్సరములో సరిగ్గా దసరా సమయములో మూహుర్తాలు చేసి , నిర్మాణాలు ప్రారంభించడముతో అధికారుల , స్థానిక ప్రజా ప్రతినిధుల అలసత్వముతో  పాటు , ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కొరతతో పాటు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యముతో  ఆలస్యంగా మూడు అంతస్తుల ఎత్తుతో  రెండు పడకల గదులను పదకొండు కోట్ల వ్యయముతో ఒక్కొక్క ఇంటికి ఆరు లక్షల వ్యయంను వెచ్చించి ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను పూర్తీ చేసారు.  

మొదటి నుండి ఎంపిక వరకు లోపాలే

 అయితే నిర్మించిన 168  ఇళ్ళ పట్టాలను అందించేందుకు గాను నిరుపేదల నుండి  350కి పైగా దరఖాస్తులను స్వీకరించారు. స్థానిక రెవెన్యు  అధికారులు . ఇళ్ళ పట్టాలు అర్హులకు కట్టబెట్టాలన్న  దిశగా ఎల్లారెడ్డిపేట లో అధికారులు సర్వే నిర్వహించి ,మొదటగా 134 దరఖాస్తుల దారులు మాత్రమె అర్హులుగా గుర్తించడముతో , సమగ్ర సర్వే లోపా భూష్టంగా ఉందంటూ నిరాశ్రయులైన లబ్దిదారులు మరో మారు స్థానిక తహశిల్దార్ శ్రీకాంత్ కు ధరఖాస్తులు పెట్టుకోగా , తూతు మంత్రంగా  సమగ్ర సర్వే చేపట్టి  రెండో సారి దరఖాస్తు  పెట్టుకున్న వారిలో 148 మంది లబ్దిదారులను గుర్తించినట్లు తెలుస్తోంది.  ఇందులో కూడా అనర్హులను అర్హులుగా చూపెట్టే ప్రయత్నం జరిగింది అనే గుసగుసలు వినబడుతున్నాయి కొందరు నాయకులు ప్రజాప్రతినిధులు వారికి సంబంధించిన వారికే డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించుకుని ప్రయత్నం చేశారు. రెండో సారి సమగ్ర సర్వే చేపట్టగా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చినట్లు  సమాచారం. 

ప్రతిపక్షాలు అర్హులకు ఇవ్వాలి అంటున్నారు అయితే ఇది ఇలా ఉండగా  .... కే టి ఆర్ నియోజక వర్గములో నిరుపేదలకు సొంత  గూడును నిర్మించి అందించాలన్న లక్ష్యం సరైనది అయునప్పటికి , రెండు పడకల గదుల నిర్మాణాలు పూర్తీ అయ్యి నేటికి సంవత్సరా కాలం పూర్తీ కావొస్తున్న  నేటికి ఇప్పటికి కూడా నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా అధికారులు , స్థానిక ప్రజా  ప్రతినిధులు,  ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వైఖరి చెప్పాలని డీమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టి  మండల అధ్యక్షుడు దొమ్మాట నర్సయ్య. లోపం ఎవరిది ఇల్లు లేకుండా బెక్కు బెక్కుమని ఎదురు చూస్తున్న పేదవానికి  ఇల్లు ఎప్పుడు ఇస్తారో  తెలియని అయోమయములో ఉన్న పేదవానికి ఇల్లు  ఇవ్వడములో అధికారుల లోపామా ?,

 స్థానిక ప్రజా ప్రతినిధుల లోపామా ,?, 

తెరాస నాయకుల లోపామా ?,

 సమగ్ర సర్వే లోపామా అని ప్రశ్నించారు.  

నిష్పక్షపాతంగా ఎంపిక జరగాలి రెండు పడకల ఇళ్ళను ఎవరికీ కేటాయించాలి. ఎవరు లబ్దిదారుడు , ఎవరికీ ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు ., ఎవరు నిరుపెదవాడో గుర్తించాల్సిన భాద్యత  సమగ్ర సర్వే చేసే అధికారులపై ఉన్నదని అన్నారు నిష్పక్షపాతంగా సర్వే చేయాల్సిన అధికారులు నాయకుల రికమండేషన్ లతో ఎవరికి అయితే ఏంటి ఇచ్చావా లేదా అన్నట్టుగానే లబ్ధిదారులను ఎంపిక చేశారు . ఇల్లు ఉన్న వారికి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ వచ్చింది అని చెప్పినా పట్టించుకునే నాధుడే లేడు. ఎవరు లబ్దిదారులో నిర్ణయించేందుకుగాను గ్రామా సభ ఏర్పాటు చేసి , గ్రామా సభలో  ఎవరు అర్హులు , ఎవరు అనర్హులు అని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప . నాలుగు గోడల మధ్యన తూతూ మంత్రంగా  లబ్దిదారుల్ని నాయకులు  గుర్తించి అర్హులు  వారేనని మీ యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం తీసుకొని   ప్రకటించడం పేదవానికి ఆన్యాయం చేసినట్లే అని విమర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రెండు పడకల ఇల్లు పేదవానికి సరైన సమయానికి అందించని ఇల్లు దేనికని ఎద్దేవా చేసారు. 

తెరాస కార్యకర్తలు నాయకులు అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఇళ్ళను కేటాయించాలని, లేదా తమ బందువులకు తమ కార్యకర్తలకు అంటూ ఇళ్ళను కేటాయిస్తే మండల కాంగ్రెస్ నాయకులు రెండు పడకల ఇళ్ళ సముదాయాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. డ్రా నిర్వహించి నెలలు గడుస్తున్న లబ్ధిదారులకు అందని ద్రాక్షలాగే మిగిపోయాయి. ఇప్పటి కైనా అర్హులతో పాటు , లోపాలను గుర్తించి ఈ సంవత్సరం ఉగాది కల్లా నిరుపేదలకు ఇళ్ళను కేటాయించి , పట్టాలను పంపిణి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి..

ఫీల్డ్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి

 ఫీల్డ్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి

పెన్ పవర్, రావులపాలెం

ఒ ఎన్ జి సి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణ పై యాజమాన్యం తక్షణం సరైన నిర్ణయం తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ వై సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం ఒక ప్రకటన వెలువడించారు. ఇప్పటికే ఫీల్డ్ ఆపరేటర్ల ఉద్యోగ భద్రత విషయంలో మేనేజ్ మెంట్ తో పలు దఫాలుగా చర్చలు జరపినా ఆ చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మెకు దిగాల్సివచ్చిందన్నారు. ఆపరేటర్ల వేతన సవరణ జరగక పోవడం వల్ల  మానసిక క్షోభకు గురవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల కాలంగా వేతన సవరణ విషయంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం సరైనది కాదని ఆయన దుయ్యబట్టారు.ఇప్పటికే అనేకమంది ఫీల్డ్ ఆపరేటర్లు ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురై పదవీ విరమణ చేయటం జరిగిందన్నారు. తక్షణం యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్లు ఉద్యోగ భద్రత విషయంలో  చర్యలు చేపట్టాలని కోరారు.

మొబైల్ ఒక వ్యసనం అస్థిరతకు, నిద్రలేని రాత్రులకు దారితీస్తుంది

 గాడ్జెట్ ప్రభావం: మొబైల్ ఒక వ్యసనం అస్థిరతకు, నిద్రలేని రాత్రులకు దారి తీస్తుందంటున్నారు పరిశోధకులు 




న్యూస్ డెస్క్, పెన్ పవర్ 

 లండన్ కు  చెందిన  కింగ్స్ కాలేజ్  యునివర్సిటి  నుండి పరిశోధనలో  పలు  ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొబైల్‌పై ఇటీవలి పరిశోధనలు చేసిన వీరు...   మీరు మొబైల్ వ్యసనంతో పోరాడుతుంటే, మొబైల్ నుండి దూరం కూడా ఇబ్బందికరంగా ఉందని రుజువు చేస్తోందని,  మొబైల్ నుండి దూరం కారణంగా, ప్రజలకు  రాత్రుళ్లు  నిద్ర  లేమి , మనసు  చంచలత వంటి లక్షణాలను చూపుతున్నారు. 1,043 మొబైల్ వినియోగదారులపై నిర్వహించిన ఈ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు . పరిశోధనలో పాల్గొన్న వినియోగదారుల వయస్సు 18 మరియు 30 సంవత్సరాల మధ్య ఎంచుకున్నారు. 


1043 లో 406 మంది మొబైల్ వ్యసనంతో బాధపడుతున్నారు

పరిశోధనలో పాల్గొన్న వినియోగదారులలో నాలుగింట ఒకవంతు మంది రోజులో కనీసం 3 గంటలు మొబైల్ ఉపయోగించినవారే. అదే సమయంలో, 19 శాతం మంది రోజూ 5 గంటలకు పైగా మొబైల్‌తో బిజీగా ఉన్నారు. 1,043 మందిలో 406 మంది మొబైల్ వ్యసనంతో బాధపడుతున్నారు. ఈ వినియోగదారులు మొబైల్ వాడే సమయాన్ని తగ్గించలేకపోతున్నారు. మొబైల్స్ వారి నుండి దూరంగాపెట్టినప్పుడు, వారు  చాలా అసౌకర్యంగా ప్రవర్తించడం    ప్రారంభించారు. 57 శాతం మంది వినియోగదారులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు పరిశోధనలో తేలింది.


స్మార్ట్‌ఫోన్ స్థాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

స్మార్ట్‌లు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి, వాటిని వేరు చేయడం చాలా కష్టం అని కింగ్స్ కాలేజీ మనస్తత్వవేత్త సమంతా సోని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా, ఆరోగ్యంపై స్మార్ట్ ఫోన్   ప్రభావం ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో  తెలిపారు. ఇది కాకుండా, స్మార్ట్ ఫోన్    స్థాయిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మనస్తత్వవేత్త నికోల్ కుల్క్ మాట్లాడుతూ, మనం స్మార్ట్‌ఫోన్‌లను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో, నిద్రపై అంత ఎక్కువ ప్రభావం చూపుతుందని అన్నారు.


మీ మొబైల్ వ్యసనం కారణంగా ఎక్కడో ఒకటి, వాటిలో ఒకటి కాదు…

ఫేడ్ (ఫేస్‌బుక్ వ్యసనం రుగ్మత): మీరు ఫేస్‌బుక్‌లో నిరంతరం చిత్రాలను పోస్ట్ చేయడాన్ని ఇష్టపడితే మరియు మీ స్నేహితుల పోస్ట్ కంటే ఎక్కువసేపు వేచి ఉంటే, ఫేస్‌బుక్ వ్యసనం రుగ్మతగా మారి  మిమ్మల్ని ఆధిపత్యం చేస్తుందని అర్థం. ఈ కారణంగా, మీరు ఇతర సోషల్ మీడియా వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మీ పిక్రేను కూడా రేట్ చేస్తారు.


నోమోఫోబియా: నోమోఫోబియా అంటే ఓడిపోయే భయం, మొబైల్‌ను ఉపయోగించలేకపోవడం వల్ల లేదా     ఫోన్‌లో సిగ్నల్ లేకపోవడం వల్ల లేదా బ్యాటరీ తక్కువగా ఉండటం వల్ల మీరు కలత చెందుతుంటే, అది నోమోఫోబియా యొక్క లక్షణం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పరికరానికి మీ  అటాచ్మెంట్ ను ఒక  హానికరమైన పరిస్థితికి తీసుకుపోతుందని అంటున్నారు నిపుణులు. 


సెల్ఫిటిస్: ఇది విచక్షణారహిత సెల్ఫీలను పోస్ట్ చేయడానికి సంబంధించిన రుగ్మత. మీరు నిరంతరం సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ మరియు ఇతర సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తూ ఉంటే, మీరు ఈ రుగ్మత వైపు వెళుతున్నారని  అర్ధం . సెల్ఫిటిస్ అనే పదాన్ని 2014 లో కనుగొన్నారు.


IGD (ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్): మీరు కాండీ క్రష్, ఫిఫా ఆన్‌లైన్ లేదా ఇతర ఆటలను ఆడితే IGD గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ ఆటలను ఆడాలనే అధిక కోరిక మరియు ఆట కోసం ఇతర సోషల్ మీడియా వినియోగదారులకు అభ్యర్థనలను పంపే అలవాటు అంటే మీరు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని అర్థం.


ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్: ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ (పివిఎస్) అనేది ఒక రుగ్మత, దీనిలో ఫోన్ కాల్ లేకుండా కంపనం యొక్క భావన ఎప్పుడూ ఉంటుంది. ఫోన్ రింగ్ చేయనప్పుడు కూడా ఇది జరుగుతుంది. వాస్తవానికి, ఏదైనా కాల్ లేదా సందేశం తప్పిపోతుందనే భయం కారణంగా, మేము చాలా అప్రమత్తంగా ఉన్నాము మరియు ఎటువంటి కంపనం లేకుండా ధ్వనిని అనుభవిస్తాము. అయితే, మానసిక ఆరోగ్యం విషయంలో ఇది మంచిది కాదు.


ఫోమో (తప్పిపోతుందనే భయం): తప్పిపోతుందనే భయం అంటే సోషల్ మీడియాలో ఏమీ మిస్ అవ్వదు. సోషల్ మీడియాను నిరంతరం తనిఖీ చేయకుండా మీరు జీవించలేకపోతే, మీరు సోషల్ మీడియాలో ప్రతి అప్ డేట్ ను  ఇష్టపడటానికి, వ్యాఖ్యానించడానికి లేదా పంచుకునేందుకు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే సమయాన్ని వృథా చేయకుండా వెంటనే చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఫోమోలో ఉన్న అవకాశాలు బాధితులు అని అర్ధం. 


టెక్నాలజీ ఎంత పెరిగితే అంతమంచిది కానీ మనం ఆ టెక్నాలజీ ని మనం అదుపులో పెట్టుకోవాలి... మనల్ని టెక్నాలజీ అదుపులో పెట్టుకోవడం కాదు, సో  తస్మాత్ జాగ్రత్త ... 

ఈ నెల 5వ తారీఖున జరిగే బంద్ ను జయప్రదం  చేయండి ...

ఈ నెల 5వ తారీఖున జరిగే బంద్ ను జయప్రదం  చేయండి 

వి.ఆర్.పురం,పెన్ పవర్

 వి.ఆర్.పురం మండలం రేఖపల్లి సెంటర్ లో   కిరాణా షాపులు వారికి గ్రామ ప్రజలకు సిపిఎం, సి ఐ టి యు, గిరిజన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కరపత్రాలు  ప్రజలందరికీ ఇవ్వటంజరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు కారం సిరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని  ప్రయివేట్ పరం చేసి,ఈ దేశాన్ని  పూర్తీగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే "విశాఖ ఉక్కు స్టిల్స్" ను ప్రయివేటుపరం చేయాలని  కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనకు పూనుకుందని ఆయన అన్నారు.  తదుపరి జిల్లా కమిటీ సభ్యులు  బొపెన కిరణ్ మాట్లాడుతూ ఐదవ తేదీన జరగబోవు బంద్ లో ప్రతీ ఒక్కరు  కలిసికట్టుగా పాల్గొని  బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సి.పి.యం సీనియర్ నాయకులు మాజీ MPP కారం.శిరమయ్య,జిల్లాకమిటి సభ్యులు బొప్పెన.కిరణ్, సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు పూనెం.సత్యనారాయణ, శ్రీరామగిరి సర్పంచ్ పులి.సనోథ్ కుమార్,నాయకులు  పంకు.సత్తిబాబు,పోడియం.శ్రీరాముర్తి,గుండెపుడి.లక్ష్మణ్ రావు,నాళ్లరపు.ప్రకాశ్ రావు,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

 అవకాశం ఇవ్వండీ... అభివృద్ధి చేసి చూపిస్తా...

31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్.




విశాఖపట్నం, పెన్ పవర్ 

మార్చి 10 న జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా గెలిపించి ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని 31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల నియమావళి కి అనుగుణంగా బుధవారం వార్డులో అమ్మోరు వీధి, కనకల దిబ్బ, డాబాగార్డెన్స్,లలితా కోలని, అమరావతి లైన్, స్ప్రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.




అనంతరం వార్డు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వానపల్లి యువసేన సభ్యులతో ప్రత్యేక  సమావేశం నిర్వహించారు.    ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ మాట్లాడుతూ తాను పార్టీ పరంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు,వార్డు అభివృద్ధి పనులను గుర్తించి టీడీపీ నాయకత్వం 31 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందని గుర్తు చేస్తూ అధిష్టానంకు వార్డు ప్రజానీకం తరపున కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, వార్డు సమస్యలపై ఇప్పటికే ఓ అంచనాకు రావడం జరిగిందని తెలిపారు. 



గతంలో ఇదే వార్డు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం వార్డు అభివృద్ధికి  కృషి చేశానని పేర్కొన్నారు.   కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేష్, నాయకులు కనకరాజు, అప్పారావు,విజయ్, లోహిత్, నరేష్, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.   




కార్యాలయంలో సంబరాలు:- ఉత్కంఠ వాతావరణంలో మంగళవారం రాత్రీ 10 గంటల సమయంలో 31 వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బిఫారం అందుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్డు కార్యాలయంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,కుటుంబ సభ్యులు నడుమ వానపల్లి రవికుమార్ అందరికీ మిఠాయిలు పంచుకొంటూ సంబరాలు చేసుకున్నారు. పలువురు వార్డు కులసంఘాల పెద్దలు కలిసి వానపల్లి కి శుభాకాంక్షలు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...