Followers

ఘనంగా హనుమాన్ ఆలయం గోపురం పూజ

 ఘనంగా హనుమాన్ ఆలయం గోపురం పూజ

అదిలాబాద్, పెన్ పవర్

మండలంలోని మాల్కు గూడా గ్రామంలోని  స్థానిక హనుమాన్ ఆలయంలో బుధవారం గోపురం పూజ ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తనయుడు ఆత్రం వినోద్ మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి  ఆలయ గోపురం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆలయంలో  హోమం పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు ఆయన మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కులు మోక్కడం జరిగిందని  పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరమేశ్వర్ రాథోడ్, ఎంపిటిసి రేణుక దిలీప్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మెస్రం హనుమంతురావు, టిఆర్ఎస్ నాయకులు  గోవింద్, శ్రీరామ్,గ్రామ పటేల్ ఆనంద్ రావు, కారోబారి గోపాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో వేడెక్కిన రాజకీయాలు

 విశాఖలో వేడెక్కిన రాజకీయాలు 

విశాఖ తూర్పు,పెన్ పవర్

సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. సొంత నియోజకవర్గంలో వైసీపీ జాయినింగ్స్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమయ్యింది.   బుదవారం  ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా అనుచరుడు కాశీవిశ్వనాథం వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు కానీ మంత్రి అవంతి హాజరుకాకపోవడంపై వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కాశీ విశ్వనాథం జాయినింగ్‌ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల నిర్ణయం ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతమే ము‌ఖ్యమని వ్యాఖ్యానించారు. అయితే గంటా అనుచరుడు విశ్వనాథం వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరే కించారు.

వాసవి సేవాదళ్ టీమ్ ను అభనందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి

వాసవి సేవాదళ్ టీమ్ ను అభనందించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి      

 పెన్  పవర్, కందుకూరు

   కందుకూరు వాసవి సేవాదళ్ టీం కరోనా సమయంలో తమ  ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పేదవారికి ఆహరం, నిత్యావసర సరుకులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసినందుకు గత ఆదివారం విజయవాడ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు కళానికేతన్ లో ఆదరణ చారిటీస్ సమర్పణలో వేదిక క్రియేటివిటి,కల్చరల్ టాలెంట్  అండ్ వెరియస్ కిల్స్ సొసైటీ,24క్రాఫ్ట్స్, విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదిక తెలుగు నంది జాతీయ పురస్కారం వాసవి సేవాదళ్ టీం తరుపున ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు నంది అవార్డు తీసుకొన్నారు. ఈసందర్బంగా కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ని కందుకూరు వైస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం లో మహీధర్ రెడ్డిని కలసిన వాసవి సేవాదళ్ టీం సభ్యులు ఈ సందర్బంగా శాసన సభ్యులు  మహీధర్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో వాసవి సేవాదళ్ టీమ్ సభ్యులు నిరంతరం  కరోనాను సైతం లెక్కచేయకుండా సేవాకార్యక్రమం చేశారు.వారికి ఈ నంది పురస్కారం రావడం చాలా సంతోషదాయాకమని, భవిష్యత్ లో ఇలాగే సేవలో ముందుకు కొనసాగాలని ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ కరోనా సమయం లో కందుకూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తూ,మనోధైర్యాన్ని కాల్పించిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు చేశామని,రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు మా టీమ్ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని, ఈ నంది  పురస్కారం మా దాతలకు అంకితం అన్నారు.  ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఆర్యవైశ్య నాయకులు పబ్బిశెట్టి శివ,చలంచర్ల సుబ్బారావు,ఇస్కాల మధు, శ్రీ రామసాయి సేవా సమితి అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, ఇన్నమూరి శ్రీను, మానేపల్లి బుచ్చయ్య గుప్తా, సోమిశెట్టి శశాంక్, పాదర్తి వెంకట అమరనాధ్ తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాత పశువుల అభివృద్ధి

 కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాత పశువుల అభివృద్ధి


పెద్దాపురం,పెన్ పవర్

  పెద్దాపురం మండలం, సిరివాడ గ్రామంలో రైతు భరోసాకేంద్రం నందు ఆత్మ మరియు ఎస్ఎఐపి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరమునిర్వహించి గుడివాడ సిరివాడ రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు
చేయడం జరిగింది. ఈ యొక్క రైతుల అవగాహన సదస్సుకు డి.ఎల్.డి.ఎ. ఇ.ఒ.డా॥ ఆర్.వెంకటేశ్వరరావు, ఆర్ఎహెచీసి అసిస్టెంట్ డైరెక్టర్ పి.వి.వరప్రసాద్,ఏరియా ప్రభుత్వ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా॥ వై.శ్రీనివాసరావు, పశువైద్యులు.డాక్టర్ చిక్కం బాలచంద్రయోగేశ్వర్ హాజరై వీరు  మాట్లాడుతూ. కృత్రిమ గర్భదారణ ద్వారా మేలుజాతి పశువుల అభివృద్ధి, ఏడాదికి ఒక దూడ యాజమాన్య పద్ధతులు, అధిక పాలదిగుబడికి పశుగ్రాసాలు, చూడి పశువుల సంరక్షణ వంటి విషయములపై రైతులకుఅవగాహన కల్పించుట జరిగింది. ఈ పశువైద్యశిబిరాన్ని సిరివాడ గ్రామ సర్పంచి.ఇనకొండ కృష్ణకుమారి వీరవిష్ణు చక్రం ప్రారంభించి గుడివాడ సిరివాడగ్రామాల పరిధిలో150 పశువులకు వైద్య పరీక్షలుదూడలకు ఏటిక మందులు,చూడి పరీక్షలు, చూడి కట్టని పశువులను పరీక్షించి వాటికి సరియైన చికిత్స అందించి ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడఉపసర్పంచ్ శ్రీమతి రేలంగి వరలక్ష్మి అప్పారావుకాండ్రకోట పశువైద్యులుడా॥ తోట నవీన్, ఆర్.బి.పట్నం పశువైద్యులు డా॥ కె.రాకేష్ , కాండ్రకోట వెటర్నరీఅసిస్టెంట్ కాశీరాజు,గోపాలమిత్ర సతీష్, ఎహెచ్ఎలు ప్రతాప్,పూర్ణ, షేక్ దర్గలుపాల్గొన్నారు.


బేల మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్

 బేల మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్

అదిలాబాద్,పెన్ పవర్


 జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు బుధవారం బేలా మండల విద్యాశాఖ అధికారి గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం లో మండల విద్యాశాఖ అధికారి గా ఉన్న అతను బేల మండల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో బాధ్యతలు స్వీకరించి సంతకాలు చేశారు.  నూతన మండల విద్యాశాఖ అధికారి కి ఎం ఆర్ సి సిబ్బంది స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేలా జడ్.పి.హెచ్.ఎస్ ఇంచార్జి హెడ్ మాస్టర్ రాహుత్ రాజ్ కుమార్, ధోప్టలా హెడ్ మాస్టర్ చొప్డే రాజు, పీడీ దర్శనలా దేవేందర్, మండల వనరుల శాఖ సి ఆర్ పి లు రాకొండే వెంకన్న,విజయ్,రేణుకా, సిబ్బంది అతుల్, మిథున్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ

 విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ 



స్వామి స్వరూపానంద స్వామిని కలిసిన నారాయణ

పెందుర్తి, పెన్ పవర్ 

సిపిఐ నేత నారాయణ విశాఖ శారదా పీఠంలో ప్రత్యక్షమయ్యారు. జీవీఎంసీ 97వ వార్డులో ప్రచారం చేసిన ఆయన విశాఖ శారదా పీఠం ను సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. విశాఖ జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్ధి యశోద ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన ముషిడివాడలో నిర్వహించిన ప్రచారంలో నారాయణ పాల్గొన్నారు. అందులో భాగంగానే దారిలో ఉన్న విశాఖ శారదా పీఠాన్ని నారాయణ సందర్శించారు. ఆ పీఠాన్ని దర్శించుకుంటే గెలుపు ఖాయమని అంటుంటారని తమ అభ్యర్ధిని కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని నారాయణ కోరినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి.

 ముఖ్యమంత్రి కెసిఆర్  పేదల పెన్నిధి...

 జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్

ఆదిలాబాద్, పెన్ పవర్ 

  దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలతో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పెన్నిధి అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ అన్నారు. బుధవారం మండలంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మండల తెరాస నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఏ రాష్ట్రంలో ఆడపడుచులకు లేనటువంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది కెసిఆర్ పుణ్యమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రె,ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ ఎంపిపి రఘుకుల్ రెడ్డి, తహసిల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్,టిఆర్ఎస్ నాయకులు తన్విర్ ఖాన్, మంగేష్, సుధాకర్, సుభాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నారాయణ, గీత తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...