Followers

గురుకుల పాఠశాల/కళాశాలను తిరిగి ఇంద్రవెల్లికి తెప్పించాలి

 గిరిజన గురుకుల పాఠశాల/కళాశాలను తిరిగి ఇంద్రవెల్లికి తెప్పించాలి 

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు డిమాండ్

ఆదిలాబాద్,పెన్ పవర్



ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన గురుకుల పాఠశాల కోసం తుడుం దెబ్బ ఆదివాసీ నాయకులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి మండలంలో గత నాలుగేండ్ల కిందట గిరిజన గురుకుల పాఠశాల, రెషిడెన్షియల్ కళాశాల మంజూరైయింది.ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది.నాలుగేండ్లు గడుస్తున్న ఆ భవనం ఇంకా పూర్తి కాలేదు.ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇదివరకే పలుమార్లు తమకు ఇతర చోటా ఇరుకు గదులు మరియు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ధర్నాలు చెపట్టారు.గతెడాది లాక్ డౌన్ కన్న ముందే ఈ గిరిజన  గురుకుల పాఠశాల, కళాశాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న మావల మండల కేంద్రంలో ఎర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అక్కడే చదువులు కొనసాగించారు.

లాక్ డౌన్ అయిన తరువాత ఇప్పుడిప్పుడే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో ఇప్పుడు విద్యార్థులు ఇంద్రవెల్లి నుండి ఆదిలాబాద్ కు వెళ్ళాలంటె అక్కడ సైతం వారికి తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోందని, ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన ఈ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి తరలించడంపై ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులు మండిపడుతున్నారు. బుధవారం  ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ ఆద్వర్యంలో విలేఖరుల సమావేశం ఎర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ మాట్లాడుతూ గత నాలుగేళ్ల కిందట ఇంద్రవెల్లి మండలంలో మంజూరైన గిరిజన గురుకుల పాఠశాల మరియు రెసిడెన్షియల్ కళాశాల భవనం నాలుగేళ్లు గడుస్తున్న భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇంద్రవెల్లికి చెందిన గిరిజన గురుకుల పాఠశాల ,కళాశాలను  ఇక్కడి ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోని మావల మండల కేంద్రానికి తరలించడం పట్ల విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే తిరిగి ఇంద్రవెల్లి మండలంలో గిరిజన గురుకుల పాఠశాల కళాశాలను కొనసాగించెలా చర్యలు తిసుకోవాలని లేనిపక్షంలో ఇంద్రవెల్లి నుండి ముత్నూర్ వరకు ఆదివాసీ గిరిజనులంత కలిసి రోడ్డు దిగ్బందం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగనాథ్, మాజీ ఎటిడబ్లయూఎసి చైర్మెన్ సిడాం భీంరావ్, ఇంద్రవెల్లి ఎంపిపి పోటేశోభా, ఇంద్రవెల్లి మాజీ సర్పంచ్ కొరెంగ సుంకట్ రావ్, ఆదివాసీ నాయకులు తొడసం నాగోరావ్, మెస్రం జైవంత్, గెడం భారత్ , తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరిన బండారు సత్యనారాయణ

 ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరిన బండారు సత్యనారాయణ 

విశాఖ అభివృద్ధి పేరిట మోసం చేస్తున్నారు : మాజీ మంత్రి బండారు 
విశాఖ సిటీ,పెన్ పవర్

విశాఖ అభివృద్ధికి 17 అంశాలతో రెఫరెండంకు ఎక్కడికైనా రావాలని విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సవాల్ విసిరారు. విశాఖ అభివృద్ధి పేరిట ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని అయన ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆధాని, లూలూ హైపర్ మార్కెట్, ఫ్రాంకీలిన్ టెంపుల్టోన్ వంటి సంస్థలు ఏమయ్యాయని ఆలత ప్రశ్నించారు. తిడ్కో ఇళ్లను ప్రజలకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని బండారు సత్యనారాయణ మండిపడ్డారు.

ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో నిరసన

 ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో నిరసన

ఆదిలాబాద్, పెన్ పవర్



ఇంద్రవెల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి సహకార సంఘం సిఇఓ ఆత్మహత్యకు నిరసినగా ఒక్కరోజు కార్యలయం బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ధరమ్ సింగ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండు మైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆత్మహత్యకు కారకులైన చైర్మన్ ను వెంటనే తొలిగించాలని వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మక్బల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం అసిస్టెంట్ సెక్రెటరీ సునిల్, సిబ్బంది లక్ష్మణ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు

 వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు




 పెన్ పవర్,ఆత్రేయపురం
ఆత్మకూరు మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగదైవం అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధి కి వచ్చినా భక్తులు తమకు తోచిన నట్లుగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మొక్కు  తీసుకోవడం జరుగుతుంది  ఈరోజు ఆ స్వామి వారి  హుండీ లెక్కింపు 28 రోజులుగా నూ ఆలయం ప్రధాన హుండీ నుండి 35,56,866/- రూపాయలురాగా ఆ స్వామివారి అన్నప్రసాద నుండి 5,62,872/- రూపాయలు మొత్తం కలిపితే 41,19,738/- రూపాయలు       ఆ స్వామి వారికి బంగారం రూపంలో 162 గ్రాములు  వెండి కేజీ 493 గ్రాములు వచ్చినది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు నామ సత్య పెద్దిరాజు వేణుగోపాల స్వామి దేవస్థానం ఈవో రాజమండ్రి  జి రమేష్ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవస్థానం రాజమండ్రి ఈవో శ్రీ కృష్ణ చైతన్య శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం ర్యాలీ  ఈవో  శ్రీలక్ష్మి వివో గ్రూప్ దేవాలయములు  వీరితో పాటు ఆలయ చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి శ్రీ వెంకటేశ్వర రావు కనకారావు శెనగల సత్యనారాయణ రెడ్డి రవి దేవి భాను ఆలయ అర్చకుల తో పాటు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ బాబురావు  పోలీస్ సిబ్బంది దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని సూచించిన మండలం వి. వో వరప్రసాద్

 మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని సూచించిన మండలం వి. వో వరప్రసాద్



ఆత్రేయపురం,పెన్ పవర్

   ఆత్రేయపురం మండలం లొల్ల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం అంశాలను మండల వి వో వరప్రసాద్ పరిశీలించారు అలాగే మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని సూచించారు  మెనూలో సూచించినట్లు  విద్యార్థులకు వారానికి రెండు దినములు కోడిగుడ్డును వేయడం జరుగుతుంది   పాడినవి కోడిగుడ్లు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు అందించకుండా వాటిని తొలగించి వాటి స్థానంలో సరఫరాధరుల నుండి మంచివి తీసుకోవాలని సూచించారు ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు ఐ. ఎమ్. ఎమ్. ఎస్  ఆన్లైన్ ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని కోరారు రోజువారి మెనూ తప్పనిసరిగా పాటించాలని అన్నారు పాఠశాల మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ రోజు భోజనం అనంతరం అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎ. ఎన్. ఎమ్. ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న డి వార్మింగ్ డే   నులి పురుగు నియంత్రణ మాత్రలు కార్యక్రమం పరిశీలించారు.

తెలుగుదేశంపార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్ లకు అభినందన సభ

 తెలుగుదేశంపార్టీ తరపున విజయం సాధించిన సర్పంచ్  లకు అభినందన సభ

పెన్ పవర్,ఆలమూరు 

    కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం కొత్తపేటలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో  రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, టిడిపి అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి పాల్గొని విజేతలను ఘనంగా సన్మానించి  అభినందించారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆలమూరు మండలం కలవచర్ల గ్రామం సర్పంచ్ గా విజయం సాధించిన  వడ్డి వెంకన్నను దుశ్శలవాల, పూల మాలలుతో సత్కరించి సన్మానించారు అలాగే పలు గ్రామాల్లో ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.

18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

ఎం.పి రాజ్యసభ సభ్యులు జి.వి. ఎల్ నరసింహారావు పిలుపు

పెన్ పవర్,విశాఖపట్నం

యం. వి.పి కాలనీ తూర్పు నియోజక వర్గ బిజెపి కార్యకర్తల సమావేశం జామి ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమమునకు ఎం.పి  రాజ్యసభ సభ్యులు  జి వి యల్ నరసింహ రావు పాల్కొంటo జరిగింది 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి ని అత్యధిక మెజారిటీ తో గేలిపించలని కార్యకర్తలను కోరారు   ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని చూసి ఓటు వెయ్యండి...బీజేపీ ... గత 6 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి చేసిన విశేష కృషిని చూసి రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కోరారు.   ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి బీజేపీ కి ప్రాతినిధ్యం లేకపోయినా ప్రక్క రాష్ట్రాలనుంచి రాజ్యసభకి ఎన్నికై, పార్లమెంటులో రాష్ట్ర సమష్యల పట్ల పొరాడుతున్నామని, తమ శ్రమను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను ఆదరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు ధన రాజకీయాలు, భ్రమ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర సమష్యల పరిస్కారంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖకు, రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్త్తున్న మన్నరు  విశాఖపట్నాన్ని దేశంలోనే మొదటి స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. విశాఖపట్నంలో వైద్యపరికరాలను తయారీచేసే మెడ్టెక్ పార్క్ స్థాపించారన్నారు. 500కోట్ల రూపాయాలతో 350 పడకల సూపర్ స్పెషలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నా మన్నారు. విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గాగుర్తించి అభివృద్ధి చేస్తున్నా మన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము, జనసేన తో కల్సి విశాఖలోని 98 వార్డుల్లో పోటీచేస్తున్నా మన్నారు. విశాఖ స్టీల్ నుసమర్ధ వంతంగా నడిపి లాభాల్లోకి తీసుకు రావడం కోసమే ప్రయివేటు కు అప్పగించాలనే విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో . రామా,లీలావతి,శ్యామ్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ రవీంద్ర రెడ్డితదితరులు పాల్గొన్నారు.



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...