డివిజన్ 12 మండలాల్లో 1039 ఉపాధ్యాయ ఓట్లు...ఆర్డీవో ఎస్. మల్లిబాబు
తూర్పుగోదావరి,పెన్ పవర్
తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దాపురం డివిజన్ లో 12 మండలాలకు 1039 మంది ఉపాధ్యాయులు ఓటును నమోదు చేసుకున్నారని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలిపారు. మంగళవారం ఆర్డీఓ ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల14 వ తేదీన నిర్వహించబడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పనులు శరవేగంతో జిల్లా కలెక్టర్ అదేశాలు మేరకు జరుగుతున్నాయని తెలిపారు. డివిజన్ లో 1039 మంది ఉపాద్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రం మండలానికి ఒకటి చొ పున్న 12 పోలింగ్ కేంద్రాలు యెర్పాటు చేసినట్లు తెలిపారు.11 కేంద్రాలను ఎంపిడిఓ ఆఫీస్ లోను, రంగంపేట మాత్రం తాసీల్ధార్ ఆఫీస్ నందు ఏర్పాటు చేశామని తెలిపారు.1039 మంది ఓటర్లలో 709 మంది పురుషులు,330 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. తుని లో అత్యధిక ఓటర్లు 241 మంది కలిగి ఉండగా, రంగంపేటలో అత్యల్పంగా ఓటర్లు 21 మంది వున్నారని పేర్కొన్నారు. ఉపాద్యాయులు, భారత రాజ్యాంగం అనుమంతిచిన భాషలో అంకెలు ఉపయోగించి ఓటు వెయ్యలని తెలిపారు. అదే విధంగా వైలెట్ స్కెచ్ పెన్ తో మాత్రమే అంకెలు వేయాలని తెలిపారు.ఈ నెల 14 న ఉదయం 8 గంటల నుండి మధ్యా నం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మార్చి17న కాకినాడ జేఎన్టీయూ లో కౌటింగ్ పక్రియ జరుగుతుందని అన్నారు.డివిజినలోని ఎన్నికలకు సంభందించి 25 బ్యాలెట్ బాక్సలు, సిద్ధం చేశామని,3 రూట్లు,మూడు జోన్లు, గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు రూట్ అధికారులు, 3 సెక్టార్ అధికారులు ,3 బస్సులు అదేవిధంగా 3 ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్స్ , ఉంటాయని చెప్పారు. సిసి కెమెరాల పర్యవేక్షణలోపోలింగ్ పక్రియ జరుగుతుందని అన్నారు . ఓటు కలిగిన ప్రతి ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ కోరారు.