యువతి అదృశ్యం.. కేసు నమోదు
పెన్ పవర్, రౌతులపూడి
రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామానికి చెందిన పసగడుగుల కృష్ణబాబు కుమార్తె శ్రావణ జ్యోతి వయసు 20 సంవత్సరములు గుమ్మరేగుల గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి నెల 25వ తారీకు ఉదయం 10 గంటలకు విధి నిర్వహణ కొరకు గ్రామ సచివాలయానికి తన ఇంటి వద్ద నుండి బయలుదేరి వెళ్ళింది. అదే రోజు ఉదయం పదకొండున్నర గంటలకు సచివాలయ సిబ్బంది యువతి తండ్రి కృష్ణ బాబు కి ఫోన్చేసి మీ అమ్మాయి డ్యూటీకి రాలేదని తెలిపారు. దీనితో కంగారుపడిన తండ్రి, కుటుంబ సభ్యులు గ్రామంలోని, ఇతర బంధువుల ఇళ్ళ వద్ద వెతికారు. అయినా యువతి ఆసూకీ లభించకపోవడంతో కోటనందూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్య ఘటనపై ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ ఎం. అశోక్ తెలిపారు.