Followers

ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా...

ఆదర్సవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా..



24వ వార్డు వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్ 

నర్సీపట్నం, పెన్ పవర్ 

24 వ వార్డు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఏక శివ ప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ పరిమితమైన అనుచరగణంతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలో ఉన్నా,  లేకపోయినా తమ కష్ట సుఖాలలో అందుబాటులో ఉండే శివప్రసాద్ ను వార్డు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. వార్డు అభివృద్ధి కోసం శివప్రసాద్ ను గెలిపించుకుంటామని వార్డు పెద్దలు, యువకులు మద్దతు  ఇస్తున్నారు. విద్యావేత్త, వార్డు సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు అవసరం ఎంతైనా ఉందని శివప్రసాద్ ను  ఆశీర్వదిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డు మొత్తం ఎల్ఈడీ లైట్లు వేయిస్తానని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూస్తానని, ఇంటింటికి కొళాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని, మున్సిపాలిటీలోనే 24వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో సిమెంట్ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.  ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజల నుండి సహకారం లభిస్తుండటంతో శివప్రసాద్ ప్రచారంలో జోష్ పెరిగింది.


ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన ఎంసీడబ్ల్యుఏ సంఘం సభ్యులు..

 ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను కలిసిన ఎంసీడబ్ల్యుఏ సంఘం సభ్యులు...

జీడిమెట్ల,పెన్ పవర్


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం హరిజన వాడ మాదిగ చైత్యన సంక్షేమ సంఘం ( ఎంసీడబ్ల్యుఏ ) మూడవ సారి ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను
మరియు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ను సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ జి.బల్ రామ్, జనరల్ సెక్రెటరీ యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ మరియు బస్తీ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.

సోవాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం

సోవాలమ్మ ఆలయం వద్ద భారీ అన్నదానం




 జగ్గంపేట పెన్ పవర్

  తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం లోనీ జగ్గంపేట గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి రోడ్ లో గల శ్రీ సోమాలమ్మ తల్లిఅమ్మతల్లి ఆలయం వద్ద  మంగళవారం బీమన సూరిబాబు  అండ్ బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులు సహాయంతో  భారీ అన్నదానం నిర్వహించారు ఈ అన్న ప్రసాదం స్వీకరించేందుకు పాల్గొన్నారు  ఈ కార్యక్రమంలో శ్రీ సావాలమ్మ తల్లి గుడి వద్ద పూజ చేసిన వేద పండితులతో  అమ్మవారిని దర్శించుకున్నారు.   పార్టీ నాయకుల    ఈ కార్యక్రమంలో జగ్గంపేట  వైసిపి నాయకులు ఉప సర్పంచ్  బండారు  రాజా.  పెద్దాడ రాజబాబు భీమన సూరిబాబు బ్రదర్స్  కుటుంబ సభ్యులు   పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడతా - పోసిన వీరేంద్ర కుమార్..

 ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడతా - పోసిన వీరేంద్ర కుమార్...




గండేపల్లి పెన్ పవర్

గండేపల్లి గ్రామంలో  మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు పెనుగాడి సూరిబాబు అధ్యక్షతన ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పోసిన వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఫోటోగ్రాఫర్లు ఎంతో నష్టపోయారని వారిని ప్రభుత్వం అన్ని  విధాలుగానూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారి సంక్షేమానికి కృషి చేయడానికి అన్ని విధాల అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలో ఏ ఒక్క పేద ఫోటోగ్రాఫర్ మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అనేక  ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం  వెంటనే డబ్బులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.  జిల్లా సహాయ నిధికి కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు . అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  బి. కోటేశ్వరరావు, నా మాన భాస్కర్, కోనే శ్రీను , రమణ, అప్పారావు , రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. 

నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలి...

 నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలి...



జగ్గంపేట పెన్ పవర్

 నీటిని వినియోగించే ప్రతీ ఒక్కరూ  పొదుపుగా వాడాలని , నీటిని ఆవశ్యకతను తెలుసుకోవాలని నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఎస్. కీర్తన పేర్కొన్నారు . స్థానిక నెహ్రూ యువకేంద్ర  ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలకు మరియు నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లకు భారత ప్రభుత్వ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వారు క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ (డో మ) ఏపిడి జీ. రమేష్ మాట్లాడుతూ వర్షాధార నీరును పొదుపు చేస్తూ దానికోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు ఈ ప్రచారం కింద, చెక్ డ్యామ్‌లు, నీటి పెంపకం గుంటలు, పైకప్పు RWHS మొదలైనవి చేయడానికి డ్రైవ్‌లు;  ఆక్రమణల తొలగింపు మరియు ట్యాంకుల నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి వాటిని తొలగించడం;  పరీవాహక ప్రాంతాల నుండి నీటిని తీసుకువచ్చే ఛానెళ్లలోని అడ్డంకులను తొలగించడం;  మెట్ల-బావులకు మరమ్మతులు చేయడం మరియు నీటిలో తిరిగి నీటిని ఉంచడానికి పనికిరాని బోర్-బావులు మరియు ఉపయోగించని బావులను ఉపయోగించడం వంటివి ప్రజల చురుకైన భాగస్వామ్యంతో చేపట్టాలి.

ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ

 ప్రతి విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉండాలి -డా. సి.హెచ్.మురళీకృష్ణ




   





 గండేపల్లి పెన్ పవర్

 గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణంలో  గల ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల  మొదటి సంవత్సర  లో చేరిన  విద్యార్థులకు విద్య ప్రాముఖ్యాన్ని గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రచయిత మనోవికాస శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ డా.సి.హెచ్.మురళీకృష్ణ మాట్లాడుతూ పాలిటెక్నిక్ పట్టా  తో పాటు మంచి సంస్థలో ఉద్యోగంతో విద్యార్థి బయటకు రావాలంటే ఆంగ్లభాషపై పట్టు  వినూత్నంగా ఆలోచించడం, నూతన ఆలోచనలతో రాణించిన వారే తమ లక్ష్యాలను సాధించడం  సాధ్యం అని అన్నారు. విద్య అంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడం అని.. నేర్చుకున్న విద్య ను అభ్యసించడం ఆచరణలో పెడితే విద్యార్థులు మున్ముందుకు సాగుతూ ఉన్నతస్థాయి కి చేరుకుంటారని అన్నారు.ప్రతివిషయంపై అవగాహన కలిగి ఉండాలని ఆకలింపుచేసుకని అర్ధంకాని అంశాలను ఉపాధ్యాయుల నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నిరంతరాయంగా నేర్చుకుంటూ తెలియని విషయాలు తెలుసుకోవడానికి సిగ్గు మొహమాటం లేకుండా ఉండటమే మంచి విద్యార్ధి లక్షణం అని ఈ మూడు సంవత్సరాల పాటు నేర్పిన విద్య మీ జీవిత కాలాన్ని ప్రభావం చూపుతుంది అని అన్నారు.ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్.కుమార్,డీన్.ఎ.వి.మాధవరావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్" పై సదస్సు

  ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్"  పై  సదస్సు




  గండేపల్లి పెన్ పవర్

  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ నందుస్టాక్ మార్కెట్   పై వర్చువల్ మోడ్ లో అవగాహనా సదస్సు  నిర్వహించినట్లు డైరెక్టర్ డా. ఎన్.సుగుణారెడ్డి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో షైన్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్వాహకులు "శ్రీహర్ష"గారు  ఆన్ లైన్ ద్వారా విద్యార్థులలో అవగాహనా కల్పించినట్లు ఆమె  తెలియజేసారు. ఈ సందర్భంగా శ్రీ హర్ష ఆన్ లైన్ ద్వారాసదస్సులో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూఅభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందువరుసలో ఉందని,అలాగే దేశంలో పెట్టుబడిదారులు అత్యధికులు స్టాక్ మార్కెట్ నందు పెట్టుబడులు పెడుతున్నారని,తద్వారా వారు మెరుగైన లాభాలను పొందుతున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె విధానం స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు క్షుణ్ణంగా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా  వివరించారు. మనదేశ స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన బి.ఎస్.ఇ,(బొంబాయిస్టాక్ ఎక్స్చేంజి)మరియు ఎన్.ఎస్.ఇ,(నేషనల్ స్టాక్ఎక్స్చేంజి)లలోవాటాదారులు వాటాలను కొనుగోలు మరియు అమ్మకం పద్దతులను గురించి వివరించారు. విద్యార్థులు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు(ఇన్వెస్ట్) మరియు అమ్మకం ద్వారా లాభాలు (రిటర్న్స్)ఆర్జించడం ఎలా అనే  విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డా. సుగునా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధి పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని అందుకే ఆదిత్య విద్యార్థి సర్వతో ముఖాభివృద్దికి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. విజ్ఞాదాయకంగా జరిగిన  ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.డి.ఆస్ధాశర్మ, డా. ఎన్.విశాలాక్షి,  ఉపాధ్యాయ సిబ్బంది, బి.బి.ఏ,మరియు ఎం.బి.ఏ విద్యార్థులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...