Followers
పిల్లలకు మాస్కులు పంపిణీ...
చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం
చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం
గోకవరం పెన్ పవర్
గోకవరంమండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక పాతగుబ్బలమ్మవారి గుడివీధి లో చిన్ననాటిస్నేహితుల సమక్షంలో ఘనసన్మానంనిర్వహించడం జరిగింది రంపచోడవరం క్లస్టర్ లో S E B హెడ్ కానిస్టేబుల్ గా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్న అరసాల రాజేంద్రప్రసాద్ నకు ప్రభుత్వం వారు రంప విశ్వభూషన్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది జిల్లా ప్రధమ పౌరుడు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకొనుటవలన అది తెలుసుకొనిన చిన్న నాటి స్నేహితులు ఉద్యోగాల పరంగా ఆయా పట్టణాలలో గ్రామా లలో స్థిరపడిన వీరు పెరిగినటు వంటి పాతగుబ్బలమ్మవారి గుడివీధి లో ఘనమైన సత్కారం రాజేంద్రప్రసాద్ నకు చేసియున్నారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొంటు చిన్న నాటి స్మతులను పదిమందికి చెబుతూ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు డిపార్ట్మెంట్ లో తాను చేసిన సర్వీస్ ను మెచ్చుకొంటు ఈ అవార్డ్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని మన కలయిక అపురూపమని ఎన్నటికీ విడిపోము అని ఉద్వేగభరితులై తెలియచెప్పారు ఈ కార్యక్రమంలో పెరువలి చిన్నారావు పిల్లి చిరంజీవి గోలి బాబ్జి పెరువలి మోహనరావు గోన్నూరి లాజర్ చిగురుపల్లి రాజు చింతాటి అప్పారావు గంపల భజని అరసాల జూన్ ప్రసాద్ పెరువలి దొరబాబు మోర్త చిట్టిబాబు మరియు అధికస్థాయిలో పెద్దలు మహిళలు పాల్గొనియున్నారు.
విశాఖలో జనసేనాని ప్రచారం
విశాఖలో జనసేనాని ప్రచారం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో పర్యటించాలని పవన్ నిర్ణయం
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
పార్టీ గుర్తులపై ఎన్నికలు
ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందన్న విశాఖ ప్రాంత నేతలు
సమ్మతించిన జనసేనాని
రెండ్రోజుల్లో తేదీ ఖరారు
విశాఖపట్నం, పెన్ పవర్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున విశాఖలో కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీ లోపు తన పర్యటన ఉండొచ్చని పవన్ తెలిపారు. మరో రెండ్రోజుల్లో పర్యటన తేదీ ప్రకటిస్తానని వివరించారు.ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన ఉనికిని చాటుకోవడం పవన్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో మరింత బలంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి తగిన సమయం అని అన్నారు.కొన్నిరోజుల కిందట పవన్ విశాఖ ప్రాంత జనసేన ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి పవన్ వస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడగా, పవన్ అందుకు సానుకూలంగా స్పందించారు.
ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి
ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి
ఏరియా జిఎం చింతల శ్రీనివాస్
కళ్యాణిఖని,పెన్ పవర్
మందమర్రి ఏరియాలో ఫిబ్రవరి మాసంలో 59 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.ఫిబ్రవరి మాసంలో ఏరియాలోని కేకే-1 గని 100శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 72శాతం,ఆర్కే 1ఎ గని 91శాతం,కాసిపేట గని 52శాతం,కాసిపేట-2 గని 15శాతం,శాంతిఖని గని 48శాతం,కేకే ఓసిపి 114శాతం, ఆర్కే ఓసిపి 21శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.ఫిబ్రవరి నెలలో అండర్ గ్రౌండ్ గనుల ద్వారా 53 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 61 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అధికంగా 2.75 లక్షల టన్నుల నెలవారీ ఉత్పత్తి,11462 టన్నుల రోజువారీ ఉత్పత్తిని సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా ఫిబ్రవరి నెలలో 2.04 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా, రైలు మార్గం ద్వారా 48 రేకులకు గాను 1.94 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు,18.17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన వివరించారు.2020-21ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియా వార్షిక లక్ష్యంలో 47శాతం సాధించగా,17.15లక్షల టన్నులు బొగ్గును రవాణా చేసినట్లు, రైలు మార్గం ద్వారా 409 రేకులకు గాను 16.35లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి,205.83లక్షల క్యూబిక్ మీటర్ల ఓబిని వెలికితీసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,డిజిఎం(ఐఇడి) రాజన్న,డివైపిఎం శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
శివారెడ్డి పల్లిలో క్రకెట్ట టోర్నమెంట్ ను ప్రారంభించిన రామ్మోహన్ రెడ్డి
శివారెడ్డి పల్లిలో క్రకెట్ట టోర్నమెంట్ ను ప్రారంభించిన రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా, పెన్ పెన్ పవర్
అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాతృమూర్తి స్వర్గీయ సుకన్య దేవి మెమోరియల్ క్రికెట్ టౌర్నమెంట్ ను దోమ మండలం శివరెడ్డిపల్లి గ్రామంలో మొదటి క్రికెట్ మ్యాచును టాస్ వేసి ప్రారంభించిన రామ్మోహన్ రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మాఅమ్మ నన్ను చాల బాగ చూసుకొనేదని అమ్మ ప్రేమను మించింది ఏది లేదు..మా అమ్మ అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధను కలిగించింది. ఈ రోజు వారి పేరుమీద సర్పంచ్ నరేందర్ రెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకం, గ్రామీణ క్రీడాకారులు ఇలాంటి క్రీడా అవకాశాల్ని వ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, రామచంద్ర రెడ్డి,తమన్నగారి అనంత రెడ్డి, యాదవ రెడ్డి, శాంతు, బాల్ రెడ్డి, సర్పంచ్ అశోక్ రెడ్డి,హన్మంతు ముదిరాజ్, ఎరగడ పల్లి కృష్ణ,హైమద్, శ్రీకాంత్ రెడ్డి, ఆంజనేయులు,జగన్, అక్బర్, సర్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..
ట్రాలీల బంద్ విజయవంతం
ట్రాలీల బంద్ విజయవంతం
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగినందుకు పట్టణంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టినా త్రీ,ఫోర్ విల్ ట్రాలీల బంద్ సోమవారం విజయవంతం అయ్యింది. ట్రాలీల డ్రైవర్లు ఓనర్లు తమ వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.కరీంనగర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీ అనంతరం వాహన డ్రైవర్లు ఓనర్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్లు ఓనర్లు వెంకటేష్ గౌడ్,సుధాకర్, నగేష్,రమేష్,రఫిక్ మరికొంత మంది డ్రైవర్లు ఓనర్లు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
మందమర్రి, పెన్ పవర్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల వద్ద పన్నులు వసూలు చేస్తూ వారిని ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారని, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మందమర్రి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేడి రాజు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజువారి వచ్చే రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల సంపాదనతో చాలీచాలని జీవితం గడుపుతూ ఆటోడ్రైవర్లు ఇంటి అద్దెలు, కరెంట్, వాటర్ బిల్లులు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్య పరిస్థితులు చూసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని, దీనికి తోడు లాక్ డౌన్ వలన ఆగిపోయిన ఆటో కిస్తీలు కట్టలేక,దినదినం ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు, ఆటో స్పేర్ పార్ట్స్ ధరల పెరుగుదలతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి మార్చి 5న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగిందని బంద్ కు ప్రజలందరూ మద్దతు తెలిపి ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాల్సిందిగా కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి,ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన ధరలను తగ్గించి,పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆటోడ్రైవర్లకు ఇచ్చినట్లు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.పర్మిట్ పూర్తయిన పాత ఆటోలను గుర్తించి వాటి స్థానంలో కొత్త ఆటోలను ఇచ్చి ఆదుకోవాలని, ఫైనాన్స్ వేధింపులను అరికట్టి, బ్యాంకులలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్లు సహజంగా చనిపోతే 15 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 25లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా అన్ని జిల్లా,పట్టణ,మండల కేంద్రాలలో ఆటో నగర్ లు ఏర్పాటు చేసి,ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిర్వహించు జిల్లా వ్యాప్త బంద్ కు జిల్లాలోని ఆటో డ్రైవర్లు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి, స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, కోశాధికారి ఎండి షరీఫ్, ప్రచార కార్యదర్శి దాసరి రాజ్ కుమార్, కార్యదర్శి బొల్లు రవి,ఆటోడ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...