Followers

37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 37వా వార్డు పర్యటనలో టి.డి.పి కార్పొరేటర్  అభ్యర్ధి... భంగారి రవి శంకర్

 మహారాణి పేట, పెన్ పవర్

శనివారం జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత అద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం

 జోరుగా సాగుతున్న అలుపన కనకరెడ్డి ప్రచారం




మహారాణి పేట, పెన్ పవర్

శనివారం సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు లో శాసనసభ్యులు,వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేట్ అభ్యర్థి, అలుపన కనకరెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది, సాగుతున్న సమయంలో  ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఆరా తీస్తున్న కనకరెడ్డి అంతేకాక నాకు ఒకసారి కార్పొరేటర్గా అవకాశం ఇవ్వండి ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి  అడుగుతున్నా కనకరెడ్డి నేను నాయకుడుని కాదు మీ సేవకుడిని అంటూ ప్రచారంలో పాల్గొన్న అలుపన కనక రెడ్డీ.

వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి..

 వ్యవసాయ బావిలో పడి  యువకుడు మృతి..



వి.మాడుగుల,పెన్ పవర్

  మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు శనివారం ఉదయం వ్యవసాయ బావిలో పడి  మృతి చెందాడు. మాడుగుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్  రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పర్రె అర్జున్ రావు( 30)కి  గత కొంతకాలంగా మతిస్తిమితం లేదని ఇల్లు విడిచి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో  పొలాల వైపు పరిగెత్తుకుంటూ  వెళ్తుండగా  అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. శవ పంచనామా జరిపించి పోస్టుమార్టం కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామారావు తెలిపారు.

సత్యవేడులో మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు ..

 సత్యవేడులో  మద్యం షాపుల వద్దే యదేచ్ఛగా బార్లు 



 ప్రేక్షక పాత్ర వహిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ అధికారులు 

పెన్ పవర్ న్యూస్ సత్యవేడు

చిత్తూరు జిల్లా సత్యవేడు డివిజన్ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద యదేచ్చగా అక్రమ బార్లు నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి .ఆంధ్ర ప్రదేశ్ ను మద్య రహిత రాష్ట్రం గా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రైవేటు గుప్పిట్లో ఉన్న మద్యం షాపులను సర్కారు స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది .ఇందుకు అనుగుణంగా ప్రతి ఏడాది 20 శాతం మేర మద్యం షాపులను కుదిస్తూ వీటి నిర్వహణ బాధ్యతలను బేవరేజ్ కార్పొరేషన్ సంస్థకు అప్పగించడం జరిగింది . దీంతోపాటు మద్యం షాపుల వద్ద మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించింది . అనధికార బార్లు మద్యం షాపుల వద్ద ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది .  సత్యవేడు డివిజన్ పరిధిలోని పలు సర్కారు మద్యం షాపుల వద్ద యదేచ్ఛగా అక్రమ బార్లు నడుస్తోంది .ఈ డివిజన్ పరిధిలోని సత్యవేడు ,వరదయ్యపాలెం ,నాగలాపురం , పిచ్చాటూరు మండలాలలో దాదాపు 24 మద్యం షాపులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి .ఇందులో భాగంగా సత్యవేడు పట్టణంలో ఐదు మద్యం షాపులు , దాసుకుప్పంలో నాలుగు మద్యం షాపులు , పెద్దఈటిపాకం ఎస్టి కాలనీ ,పాలగుంట , అప్పయ్యపాల్యం తదితర ప్రాంతాల్లో సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి . అయితే సత్యవేడు పట్టణంలో రోడ్డు కు ముందు మద్యం షాపులు నడుస్తుండగా వెనుక వైపు బార్లు కొనసాగుతున్నాయి . టెంకాయ కీతుల షెడ్లలో కూర్చొని మద్యం ప్రియులు మద్యాన్ని సేవించడం సర్వసాధారణమైపోయింది .అలాగే దాసు కుప్పం ప్రాంతంలో రోడ్డు ముందు పలు టిఫిన్ సెంటర్లో మద్యం బార్లు నడుస్తుండగా వెనుక వైపు సర్కారు మద్యం షాపులు కొనసాగుతున్నాయి .మద్యం షాపుల వద్ద విచ్చలవిడిగా బార్లు కొనసాగుతున్న సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది . పైగా చట్టానికి తూట్లు పొడిచే విధంగా మద్యం షాపుల వద్ద బార్లు కొనసాగుతున్న సంబంధిత సత్యవేడు డివిజన్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర శెట్టితిరుపతయ్య  ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది .మద్యం షాపుల వద్ద తాత్కాలిక మద్యం బార్లు నడిపిస్తున్న కొందరు వ్యాపారస్తులతో బేవరేజ్ ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు అయ్యారేమొన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి .ఇప్పటికైనా సంబంధిత బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి మద్యం షాపుల వద్ద అనధికారికంగా కొనసాగుతున్న మద్యం బార్లను నిర్మూలించడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి

ఉత్తర నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న.. వి.విజయసాయిరెడ్డి 




విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉత్తర నియోజకవర్గం లో  53,54,55,42 వార్డులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,  ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు మరియు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ముందుగా  మురళీనగర్ లో  ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం  ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు  దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార సీడీని ఆవిష్కరించారు  అనంతరం. 53 వార్డు శివనగర్, 54 వార్డు మర్రిపాలెం, జ్యోతి నగర, నలంద నగర్, గజపతినగర్, 55 వార్డు గాంధీనగర్, తిక్కవాని పాలెం, ధర్మానగర్, తాటిచెట్ల పాలెం, 42 వార్డు రైల్వే న్యూ కొలనీ, నందగిరి నగర్, రెల్లి వీధి ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ పర్యటన లో ఆ యా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించారు.వాటిలో కొన్ని వెంటనే చేయుటకు హామీ ఇచ్చారు. కొన్ని సంబంధించిన శాఖ లతో మాట్లాడి పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, లోక్ సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి, వరుదు కల్యాణి, మాధవి వర్మ, మాజీ వుడా చైర్మన్ రవి రాజు,  మిలినియం శ్రీధర్ రెడ్డి వార్డు సీనియర్ నాయకులు , మహిళలు, కార్యకర్తలు వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం...

  సింహాచలం దేవస్థానం ఈవోగా సూర్యకళ నియామకం



  సింహాచలం, పెన్ పవర్ ...

   శ్రీ  వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  దేవస్థానం ( సింహాచలం) ఈవోగా ఎం. వి  సూర్య కళను  నియమిస్తూ ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది.  విశాఖ  జాతీయ హైవే నెంబర్ 16 కు  భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సూర్య కళని,   రెవెన్యూ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా...  నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాసు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో విశాఖ జెసి 2 గా  పని చేసిన విషయం తెలిసిందే.  కాగా  సింహాచలం దేవస్థానం పరిధిలో భూకబ్జాలు,  ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి, అనేక  సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అలాగే  గతంలో పనిచేసిన ఈ వో లు అవినీతి పరులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దేవస్థానం పరిధిలో భూములు అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని,  ప్రజాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య కళ నియామకం ప్రత్యేకత సంతరించుకుంది. అందులో జరుగుతున్న అవినీతి అక్రమాలకు...   ఆమె అడ్డుకట్ట వేస్తారని  భక్తుల విశ్వాసి స్తున్నారు.

తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

 తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫౌండేషన్స్ డే .

తొర్రూర్ ,పెన్ పవర్.


  ప్రపంచ ఫౌండేషన్స్ డే ని పురస్కరించుకుని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్యూచర్  స్టార్స్ ఫౌండేషన్  వాలంటీర్స్ ఆధ్వర్యంలో మహుబూబాద్ జిల్లా తొర్రూర్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనాధ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు నిరుపేదలకు నిత్యావసర వస్తువులుపంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ స్టార్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రుద్రారపు  మహేష్ జనరల్ సెక్రటరీ ఆర్కే, జె  అశోక్  వైస్ ప్రెసిడెంట్  మురళి కృష్ణ, జాయింట్ సెక్రటరీ రుద్రారపు  సురేష్,మరియు వాలంటీర్స్ అరుణ్,తుర్పాటి శేఖర్, రా కేష్ మధు  డి. శీను , ఏ మహేష్  ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ,కాసుల శ్రీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు స్కూలు ప్రధానోపాధ్యాయులు పి శ్రీను బాబు,, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రావు , అలీ, వినోద్ రెడ్డి  ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...