Followers

పాచి పెంట శాంతకుమారి కి నందీ అవార్డు ..

 పాచి పెంట శాంతకుమారి కి నందీ అవార్డు (భాషా సాంస్కృతిక శాఖ)




అరకు, పెన్ పవర్

ఫిలాంత్రోఫిక్ ఇంటర్నేషనల్  సొసైటీ  డాక్టర్  అద్దంకి యోనరాజ వ్యవస్థాపకులు  వారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏట నిర్వహించే గోదావరి నంది పురష్కరాలు శనివారం ఆనం రోటరీ హాల్ వై జంక్షన్ రాజమహేంద్రవరం వద్ద ఫిలాంత్రోఫిక్ సొసైటీ ద్వారా  వంగపండు ఉష  చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) వారు చేతుల మీదుగా నందీ అవార్డు. బి.ఆర్ అంబేద్కర్ సేవాట్రస్ట్ సేవలను గుర్తించి వ్యవస్థాపకురాలు  పాచి పెంట శాంతకుమారి అరకు వేలి కి రాష్ట్ర స్థాయి లో  నంది పురస్కారాలు అవార్డు దక్కడం అభినందనలు.అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకోవాలని కోరుచున్నాను అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం..

 ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం..

సురభి వాణీదేవిని గెలిపించి పీవీ నర్సింహరావుకి సముచిత గౌరవం ఇద్దాం...

నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే...

దుండిగల్,పెన్ పవర్




కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. సురభి వాణీదేవి నరనరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయిందని, ఇప్పటికే వాణి దేవి విద్యాసంస్థలను స్థాపించి విద్యాపరంగా ఎన్నో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రాడ్యుయేట్ల సమస్యలను దగ్గర్నుండి చూసిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేసే అవకాశం ఉందని అన్నారు. వాణీ దేవిని అభ్య‌ర్థిగా ప్రకటించిన వెంటనే ఇతర పార్టీలకు బయం పట్టుకుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎలాగైనా విమర్శలు చేయాలనే ఆలోచనలో విపక్షాలు పడ్డాయని అన్నారు. వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆలోచనతో ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రోజూ పెట్రోల్ ధరలు పెంచుతూ, ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ బ‌డ్జెట్ కేటాయింపులు చేస్తూ, తెలంగాణ‌కు బడ్జెట్‌లో మొండి చేయి చూపించిన బిజెపికి గుణపాఠంగా జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు దేశానికి రోల్ మోడ‌ల్‌ అని అన్నారు. వారు గలిస్తే బాస్ లు ఢిల్లీలో ఉంటారని, మనం గెలిస్తే మనకు మనమే బాస్ అన్నారు. ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ కనుక మన అభ్యర్థి వాణీ దేవి గారిని గెలిపించి పీవీ నర్సింహరావు గారికి సముచిత గౌరవం ఇద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన




విజయనగరం,పెన్ పవర్ 

 తెలుగుదేశం పార్టీతోనే సుభిక్షమైన పాలన సాధ్యమవుతుందని విజయనగరం టీడీపీఇన్ ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 38వ డివిజన్ లో , సాయంత్రం 39, 41వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ విజయనగరం అభివృద్ది చెందాలన్నా, పన్నుల భారం తగ్గాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం పట్టణంలో అభివృద్ది జరిగిందన్నారు.వైకాపా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కార్పొరేషన్  కి ప్రత్యేకమైన నిధులు తీసుకురాలేకపోయారన్నారు.జనరల్ నిధులను పూర్తిగా ఖర్చుచేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు.ఒక త్రాగునీటి ప్రాజెక్టును కూడా .కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాలు పట్టణానికి తీసుకురాలేకపోయాయన్నారు.కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన వాటర్ స్కీమ్లు ద్వారానే పట్టణంలో త్రాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. తాటిపూడిలో నీరు లేనప్పుడు ఆదుకున్న గడిగెడ్డ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయకుండా ఆ స్కీమ్ ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో సంక్షేమ పధకాలు ఇస్తున్నారని, ఎవరి జోబులోని సొమ్ము కాదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఓటు వేయలేదని అర్హులకు పధకాలు రద్దు చేస్తే, వారి తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి తిరిగి పధకాలను అందజేస్తామన్నారు. వైకాపా అక్రమ చర్యలకు సహకరిస్తున్న అధికారులను న్యాయస్థానంలో నిలబెడతామన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న వాలంటీర్ల వివరాలను, ఆదారాలను అధికారులకు, ఎన్నికల సంఘానికి పంపించి వారిపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు మేయర్ అభ్యర్థి కంది శమంతకమణి, 38వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బొబ్బాది ఉషశ్విని, 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కొర్నాన రాజ్యలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అభ్యర్థి అనురాధా బేగం,పార్టీ నాయకులు బొబ్బాది త్రినాథ్, బొబ్బాది విజయలక్ష్మి, విజ్ఞపు ప్రసాద్, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం...

పట్టణ  ప్రజలకు మెరుగైన ఆరోగ్యం...



పెన్ పవర్, విజయనగరం

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలన్న సంకల్పంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించి, అందుకు కావలసిన భవనాలు, మౌలిక సదుపాయాలు సమకూర్చారని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నారు. శనివారం నాడు కోలగట్ల నివాసంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో ప్రస్తుత ఉద్యోగ సిబ్బందిని కొనసాగించవలసిందిగా కోరుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి  గౌరవనీయులు విజయనగరం శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం అందజేశారు. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన రిక్రూట్మెంట్ లో ముందుగా గత కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నా మాకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన ఖాళీలను కొత్తవారికి ఎంపిక చేయాలని కోరారు. ఈ విషయమై కోలగట్ల సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య (UPHC) సిబ్బంది ఎస్ గణపతి (డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్),ఎం రమేష్ బాబు (సెక్రెటరీ),ఏ సంజీవ్ (జాయింట్ సెక్రెటరీ),ఎం విజయమ్మ (మెంబర్),తో పాటు సి.ఓ లు, ఏ.యన్.ఎం లు, ల్యాబ్ టెక్నీషియన్ లు, జి.ఎన్.ఎం లు, క్లీనింగ్ అసిస్టెంట్లు, వాచ్ మెన్ లు, స్వీపర్లు పాల్గొన్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో కౌన్సిలర్ శంకర్ నాయక్..

 సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో కౌన్సిలర్ శంకర్ నాయక్..

ప్రభుత్వ ఆదేశాలతోనే 27వార్డులో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు.. కమీషనర్ జ్యోతి..

దుండిగల్,పెన్ పవర్




బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 27వ వార్డు పరిధిలోని దుందిగల్ తాండ-1లో ఘనంగా నిర్వహించారు.. ఈవేడుకలను దుండిగల్ మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి ప్రభుత్వం తరఫున.. ప్రభుత్వ ఆదేశానుసారం జయంతి వేడుకలు తామే ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమీషనర్ జ్యోతి తెలిపారు.. స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆలయ పూజారి వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో మరియు వరంగల్ జిల్లా ప్రధాన స్వామిజీ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో భోగ్ బండర్, అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారాల సాంప్రదాయిక పద్దతిలో కమీషనర్ జ్యోతికి తలపాగ చుట్టి.. హోమం వద్ద అగ్నిహోత్రునికి నెయ్యితో కమీషనర్ అభిషేకం చేశారు..సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ కు కమీషనర్ నివాళులు అర్పించారు.. స్థానిక బంజారా మహిళలు కూడా జయంతి వేడుకలలో పాల్గొన్నారు.. తాండావాసులయ అతిధులను సత్కరించారు.. ముఖ్య అతిథిగా విచ్చేసిన 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ చౌహన్ సేవాలాల్ మహరాజ్ కు నివాళులు అర్పించారు.. ప్రభుత్వం తరుపున జిల్లా అడిట్ ఆఫీసర్ కొంగు వెంకటేష్, నాయకులు భీమ్ సింగ్ నాయక్, రవీందర్ నాయక్, మహేందర్ నాయక్, అమర్ సింగ్ లాల్ సింగ్ నాయక్, విజయ్ నాయక్, బాబులాల్ నాయక్ రాకేష్ నాయక్, బాబు నాయక్, రాములు నాయక్, మరియు తాండ పెద్దలు మహిళా మణులు ఈ భోగ్ బండర్ కార్యక్రమంలో పాల్గొన్నారు..

పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు

 పార్వతీపురం వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు



పార్వతిపురం,పెన్ పవర్ 

పార్వతిపురం నియోజకవర్గ కేంద్రంలో గల ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, విజయనగరం జిల్లా ఏమ్ఎల్సి పెనుమత్స సురేష్ బాబు మరియు విజయనగరం జిల్లా వైసీపీ సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ గారు, విజయనగరం జిల్లా డిసిసిబి చైర్మన్ మరిశర్ల తులసి తదితర ముఖ్య అతిదిలును గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు సాదరంగా ఆహ్వానించడం జరిగినది. అందరూ కార్యాలయంలో కాసేపు ముచ్చటించి త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించి అన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులను అఖండ విజయం చేకురేవిదంగా కృషి చేయాలని పార్టీ ముఖ్య నాయకులుకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, వైసీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయు అభ్యర్థులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ భర్తీ చేయాలి...

గిరిజన సంఘం డిమాండ్

 పెన్ పవర్, విశాఖపట్నం

కొత్త కోట ప్రదమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషన్ పోస్ట్ ను తక్షణం భర్తీ చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్   సాధన కమిటీ ఆధ్వర్యంలో కొత్తకోట పి.హెచ్.సి వద్దా ధర్నా జరిగింది. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట పీహెచ్ సీ  పరిధిలో 10 పంచాయతీలు, 28 గిరిజన గ్రామాలు 30 వేల జనాభా కు వైద్య సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు.వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంది   ప్రభుత్వం.  వాస్తవానికి ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయవలసి ఉంది,  అలాగే ప్రతి శనివారం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం కొత్తకోట పి.హెచ్.సి ఏర్పాటు చేశారు, ఇక ల్యాబ్ విషయం కు   వస్తే ల్యాబ్ టెక్నీషియన్ లేరని, వైద్యం చేసి పంపిస్తున్నారని,పరీక్షలు మాత్రం ప్రైవేట్ లాబ్ లలో  చేయంచుకోమని  అలా చేసుకుంటే చేయాలంటే వందల రూపాయలు ఖర్చవుతుందని,ఈ పి హెచ్ సి.ప్రధానంగా టి అర్జాపురం. చీమలపాడు గ్రామాల్లో... గిరిజనులు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు బారిన పడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో గిరిజనుల వద్ద డబ్బు లేకపోవడంతో. వస్తువులు తాకట్టు పెట్టుకుని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద పరీక్షలు నిర్ణయించుకుంటున్నారు.  వాస్తవానికి ఆరోగ్య కమిటీ ఎంపీడీవో అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి. ఈ సమావేశంలో హాస్పిటల్ యొక్క స్టాప్. ఇటువంటి సౌకర్యం ఉండాలని చర్చించి ఆస్పత్రి అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టాలి. నేటికీ మూడు సంవత్సరాలు అవుతున్న ప్రత్యేక అధికారులు పరిపాలనలో ఈ ఆస్పిటల్ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేషెంట్లు మంచినీరు తాగాలంటే  గ్లాసులు కూడా లేవు. తక్షణమే జిల్లా వైద్య అధికారులు స్పందించి రెండు వారాల్లోగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు గిరిజనసంఘం మండల అధ్యక్షులు సిహెచ్ శంకర్రావు. సిహెచ్ రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...