Followers

పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు...

 పాడేరు ఐటిడిఏ కాలనీలో తాగునీటి కష్టాలు..



పైపు లైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం

మంచి నీటి కోసం ఆదివాసీ మహిళల అవస్థలు

తక్షణమేతాగు నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ డిమాండ్

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

  పాడేరు ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీటి సమస్యతో ఆదివాసీ మహిళలు అల్లాడుతున్న  అధికారులు పట్టించుకో లేదని సిపిఐ డివిజన్ కార్యదర్శి రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పేరుకే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్, మరియు గ్రావిటీ పైపులైన్లు. ప్రజలకు మంచి నీరు అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని మండి పడ్డాడు. ఇది ఎక్కడో మారు మూల కాదు పాడేరు ఐటీడీఏ వెనకాల ఉన్న  వీధి లో ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా  ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇది మన ఐటీడీఏ తీరని వాక్యనించారు. పాడేరు మండలం పాడేరు ఐ.టి.డి.ఎ కు ఆనుకుని ఉన్న ఐటీడీఏ రేకుల కొలనీలో మంచినీళ్ల సౌకర్యం లేక కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక నానా అవస్థలు పడుతున్న. అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గమని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు: వారు మాట్లాడుతూ ఐటీడీఏకు ఆమడ దూరంలో లేని ఐటీడీఏ వెనకాల ఉన్న  ఐటీడీఏ రేకుల కొలనీ గ్రామం మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పత్రికల్లో ప్రకటనలు  వచ్చిన కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గం వారన్నారు ఐటీడీఏ వెనకాల ఉన్న వీధిలోనే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎలా ఉంటుందో కూడా చెప్పనవసరం లేదని ,వారు అన్నారు పాడేరు పట్టణంలో  పేరుకే పెద్ద  ఆర్డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ మరియు గ్రేట్ పైప్ లైన్లు అలంకార ప్రాయం తప్ప ప్రజలకు మంచినీరు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మహిళలతో పెద్ద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్

గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్




 పెన్ పవర్  న్యూస్ విశాఖపట్నం సీటీ

  21 వార్డ్ పరిధిలో గల కోటక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఆయా పరిధిలో గల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి తగు సూచనలు చేస్తూ, వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ,   ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. విశాఖలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేయుటకు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి  ప్రణాళిక సిద్ధం చేసారని అన్నారు.  అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు చేరుటకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డ్ లో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పొలంబడి కార్యక్రమం

 పొలంబడి కార్యక్రమం



తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి మండలంలో తాళ్ళపూడి  గ్రామం రైతులకు శనివారం ఆత్మా తాళ్ళపూడి వారి సౌజన్యంతో వరిలో సమగ్రమైన సస్యరక్షణ, వ్యవసాయ, ఉద్యాన ప్రభుత్వ పథకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిoచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ-పంట నమోదు, రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన ఇన్పుట్స్ సప్లై, డా.వైయస్సార్ పొలంబడి, కస్టమ్ హైరింగ్ సెంటర్స్, కౌలురైతులకు బ్యాంక్ రుణాలు మొదలగు అంశాలను మండల వ్యవసాయ అధికారిణి జి.రుచిత వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నక్కా చిట్టిబాబు, ఉపసర్పంచ్ జి.వి.వి.సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు ఆనంద్, రేవతి, తాళ్ళపూడి పంచాయతీ సెక్రెటరీ వీరన్న, కుకునూరు సెక్రెటరీ యస్.శ్రీను, మరియు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం

 దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం కార్పొరేటర్ అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం




దాబా గార్డెన్స్ విశాఖపట్నం పెన్ పవర్ న్యూస్ 

విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన VJF ప్రెస్ క్లబ్ డాబా గార్డెన్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పర్వీన్ బాబీ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో 85 శాతం పంచాయతీలను గెలుచుకొని, పల్లె ప్రజల అభిమానాన్ని చురగొన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామని త్వరలో జరగబోయే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా తమ అంచనా ప్రకారం పంచాయితీ ఫలితాలు కన్నా ఎక్కువ శాతం సీట్లు సాధించి, అన్ని మేయర్ పదవులను ఆదిష్టిఇస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజారంజక సంస్కరణలే అని అన్నారు. ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలు అమలు చేసి వారి అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ అనతి కాలంలోనే 100శాతం  ముస్లింల అభిమానాన్ని చూరగొన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అన్నారు. జీవీఎంసీ ఎలక్షన్ దృష్ట 98 వార్డులకు గాను 75 వార్డులలో నామినేషన్ ఒక కొలిక్కి వచ్చిందని మిగతా 25 వార్డులలో నామినేషన్ వేయవలసి ఉందని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీ ఎన్నికలలో సీటు కేటాయించిన రెండు సీట్లను గెలిపించుకోవడం తోపాటు, ఇతర వార్డులలో కూడా తమ వంతు కృషి గా ప్రచారం చేసి, అఖండ పార్టీ అభ్యర్థులు మెజార్టీ సాధించడం కోసం తాము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. 75 వార్డులకు గాను కొంతమందికి బీఫామ్ ఇచ్చారని కొన్ని వార్డులలో అభ్యర్థులు యొక్క వార్డులలో ప్రాధాన్యం ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి కాదా ఇతర కారణాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న గుర్తింపుతో సేవా కార్యక్రమాలను చేస్తున్నవారిని ఆరా తీసి సెలెక్ట్ చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నాను అని అన్నారు. అందులో భాగంగా దక్షిణ నియోజకవర్గం లో 35 వేల నుండి 45 వేల మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని ఇవ్వకపోవడం శోచనీయం. దీనిలో భాగంగా 3000 జనాభాతో ముస్లింలు 39 వ వార్డు లో రెండో స్థానంలో ఉన్నారని గత ఎన్నికలలో వీరు అధికంగా ప్రభావం చూపించారు. ప్రతిసారి ఒకే వర్గానికి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ ఈ సారి కి తప్పనిసరిగా ముస్లింలకు ఆ సీటు కేటాయించాలని అభ్యర్థిస్తున్నాము. పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి మా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల పరిశీలన గడువు ముగిసినప్పటికీ ఉపసంహరణ ఇంకా గడువు ఉన్నందున ముస్లిం అభ్యర్థి దక్షిణ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న వార్డులలో అవకాశం  కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోప్రార్వీన్ భాబీ, రేష్మ, సీమ, నాజమా, రుబినా ఖాతున్, ఖాతీజ, మెహెరావున్నిసా, రెహానా, నగ్మా,  పాల్గొన్నారు.

వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు  




విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు 

విజయనగరం,పెన్ పవర్

 వైకాపా నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం 16వ డివిజన్, సాయంత్రం 22, 23, 24 డివిజన్లలోని పలు ప్రాంతాల్లో అదితి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. అదితి గజపతిరాజు ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ఆదాయాలు పడిపోయి ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి దిక్కుతోచని స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. అలాగే ఆస్తి విలువ ఆదారంగా మున్సిపల్ పన్నులను పెంచుతూ ప్రభుత్వం జీవోలను జారీ చేయడం దుర్మార్గమన్నారు. గత ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హెూదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నిండా ముంచేసారని విమర్శించారు. మద్యాపాన నిషేదం అంటూ మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నాశిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. సంక్షేమ పధకాల డబ్బులన్నీ తిరిగి బ్రాందీ షాపులకే వస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పట్టణంలో కొళాయిలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం జరిగిందని, మళ్లీ టీడీపీకే ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అభ్యర్ధి పురుషోత్తం అనురాధ, 22వ డివిజన్, మేయర్ అభ్యర్ధి కంది శమంతకమణి, 23వ డివిజన్ అభ్యర్ధి పతంగి విజయకృష్ణ, 24వ డివిజన్ అభ్యర్ధి గొల్లకోటి హారిక, పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పార్టీ నాయకులు ఉండ్రాళ్ల వెంకటప్పారావు, విజ్జపు ప్రసాద్, గొల్లకోటి గురునాథ్, కంది మురళీ నాయుడు, ఉండ్రాళ్ల రాజేష్, గొల్లకోటి శివ, పట్టణానికి చెందిన

పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కలమడుగులో ప్రారంబమైన నరనారాయణస్వామి జాతర

కలమడుగులో ప్రారంబమైన నరనారాయణస్వామి జాతర

మంచిర్యాల బ్యూరో , పెన్ పవర్


 జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలోని శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవం అంగరంగ వైబవంగా ప్రారంబం అయింది. శుక్రవారం రోజున మండలంలోని కలమడుగు గ్రామంలోని అతి పురాతన దేవాలయం శ్రీ నరనారాయణస్వామి దేవాలయం వార్షికోత్సవ జాతర కార్యక్రమాలు ఆలయకమిటీ ఆద్వర్యంలో పురోహితులు కాకేర నర్సయ్యశర్మ కాకేర రాజనరేంద్రేశర్మ లు ప్రారంబించారు. ఈ సందర్బంగా ఈ రోజు మహిళలు కుంకుమ పూజలు జరిగాయి.136 మండి మహిళలు ఈ కుంకుమ పూజలలో పాల్గొన్నారు. అదేవిదంగా ఉదయం నుండే పూజారులు దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో శ్రీహరి మౌనస్వామి  గ్రామ సర్పంచ్ కార్తీకరావు  ఆలయకమిటీ సబ్యులు నర్సగౌడ్ అంజగౌడ్ గోపాల్ రావు శంకరయ్య ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ వి కె షిప్పింగ్ కార్మికుల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి....సి.ఐ.టి.యూ

 ఎస్ వి కె షిప్పింగ్ కార్మికుల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి....సి.ఐ.టి.యూ




మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ వంశీ క్రిష్ణ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 13 మంది కార్మికులను తొలగించారు ఆ కార్మికులు విధుల్లో పెట్టుకోమని లేబర్ కమిషనర్ ఆర్డర్ కూడా ఇచ్చారు అయినా సరే వంశీకృష్ణ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు కార్మికులే సక్రమంగ చూడని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఏలా రకంగా ఆదేశిస్తారు. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి లేనిపక్షంలో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి లేకపోతే ఆయన పోటీ చేసే వార్డు లోకి వచ్చి ప్రచారం చేస్తామని హెచ్చరించారు అలాగే పనిచేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇంకా ఇవ్వట్లేదు పి.యఫ్ కూడా కట్టలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అ ధర్నా జరిగింది ఈ ధర్నాలో సిఐటియు నగర కార్యదర్శి డి.అప్పలరాజు, రాము,రమణ, గురువులు, సాంబ సింహాచలం,బి.జగన్ తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...