Followers

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సిపిఎం ధర్నా.

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సిపిఎం ధర్నా..




దేవరాపల్లి - పెన్ పవర్...


స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వెంటనే ఆపాలని రైతువ్యతి రేఖాచట్టాలను రద్దు చేయాలని పెంచిన పోట్రోలు డీజిల్ గ్యాస్ ధరలును వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ అద్వర్యంలో దేవరాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్సన తెలిపారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. డి,వెంకన్న మండల కార్యదర్శి సిహెచ్ రాజు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజలు జీవన పరిస్తితులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు దేశంలో ఇంతటి దౌర్బగ్యపు పరిస్తుతులు ఎప్పుడు రాలేదని అన్నారు 15 రోజులు పాటు రోజు పెట్రోలు డీజల్ ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన మొదలు అవ్వగా 54 రోజుల్లో 25 సార్లు పెరడం గమనార్హం ర్గమన్నారు ధరలు పెరుదల వలన వాహణ దార్లుకు ధరలు బారం పెరిగి పోవడంతో రావాణాచార్జి లు నిత్యవసర వస్తువులు ధరలు వీపరితంగా పెరిపోతున్నాయని తెలిపారు సంక్షేమ పథకాలు స్కీములు పేరుతో  రాష్ట్రంలోను దేశంలో ప్రజలు ద్రుష్టిని అటువైపు మళ్ళీంచి పాలకులు ధరలు పెంచుకుంటూ  పోతున్నారని ప్రజలు ఇది గ్రహించకుండ సంక్షేమ పథకాలు స్కీములు మోజులో పడి పాలకులు సేష్టలు ప్రజలు గ్రహించడం లేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగుదల వలన నిత్యావసర వస్తువులు ధరలు రోజుకోలాగ పెరిపోతున్నాయని అన్నారు పేద మద్యతరగతి ప్రజలు రోజు కూలీలు తెచ్చుకున్నవారి కూలీలు యెక్క పరిస్థితి మరి దారునమన్నారు ఇటువంటి దుష్ట పాలన అంతమొందిచ్చడానికి ప్రజలు చైతన్య వంతులై ఆందోళనలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ లోపల బైట గోంతుచించ్చుకోని అరుస్తారని అదికారంలోకి వచ్చిన తరువాత నోరు మేదపడం లెదన్నారు దీనివలన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని న్నారు ప్రభుత్వ రంగసంస్థ లు అన్ని ప్రవేటీకరణ చేయక తప్పదని దేశప్రదాని నిసుగ్గుగాప్రకటించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా 16 రోజులు నుండి ఆందోళన చేస్తున్న కేంధ్రప్రభుత్వం పట్టించుకోకుండా మరోప్రక్క ప్రవేటీకరణ తప్పదని చేప్పడం కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిందని అన్నారు  దీనిపై పాలకులకు తగిన గునపాఠం చేప్పాలని పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగస్థలు ప్రవేటీకరణ నుఅపాలని డిమాండ్ చేసారు ,ఈకార్యక్రమంలో కె అప్పన్న మామిడి దేముడు జె ఈశ్వరావు పి అప్పలరాజు సిహెచ్ దేముడు ఇరట ఈశ్వరావు వెంకటమణ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తా: బండి సంజయ్

 త్వరలో కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తా: బండి సంజయ్



 

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

ఎంపీగా కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించాడని ఆరోపణ

స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడి

బీజేపీ అధిష్ఠానం అనుమతితో బట్టబయలు చేస్తానని వ్యాఖ్యలు

 

 స్టేట్  పోలిటికల్ బ్యూరో హైదరాబాద్ , పెన్ పవర్

 

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ త్వరలో సీఎం కేసీఆర్ కు సంబంధించిన సంచలన విషయాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు. నాడు ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం భయటపెడతానని వెల్లడించారు. తాను చెప్పబోయేది ముమ్మాటికీ పార్లమెంటును కుదిపేసే అంశం అవుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

సన్ స్ట్రోక్..?

 

సన్ స్ట్రోక్..?



 

కొడుకు రూపంలో ఆ ఎమ్మెల్యేకి కొండంత కష్టం వచ్చిందా ...?

కుమారుడిపై నమోదైన కేసుతో ఇబ్బందుల్లో పడ్డారా?

గిరిజనుడిపై దాడి చేయడంతో విజయ్‌పై కేసు!

డిసెంబర్‌తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై ఖమ్మం టీఆర్‌ఎస్‌ నేతల కన్ను!

 

బ్యూరో రిపోర్ట్ ఖమ్మం , పెన్ పవర్

 

ఆ ప్రజాప్రతినిధికి సన్‌ స్ట్రోక్‌ తగిలింది. పదవీకాలం గడువు సమీపిస్తున్న సమయంలో ఎదురైన హఠాత్‌ పరిణామం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెగ టెన్షన్‌ పడుతున్నారట. ఖమ్మం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన ఆ నాయకుడు ఎవరో.. ఏంటో  ఓ లుక్కేయండి...

 

 బాలసాని లక్ష్మీనారాయణ. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన బాలసాని గత మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు ఊహించని ఇబ్బందుల్లో పడ్డారు. కుమారుడి రూపంలో వచ్చిన కష్టం తలచుకుని తెగు దిగులు చెందుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ పదవీ కాలం గడువు దగ్గర పడుతుండటంతో.. మళ్లీ పొడిగింపు కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళనలో ఉన్నారట బాలసాని.  బాలసాని రాజకీయ నేతే కాదు.. కాంట్రాక్టర్‌ కూడా. భద్రాచలం ఏరియాలోని ఇసుక ర్యాంపుల్లో ఆయన చెప్పిందే వేదమని టాక్‌. ఈ వ్యవహారాలన్నీ బాలసాని కుమారుడు విజయ్‌ పర్యవేక్షణలో ఉంటాయని చెబుతారు. అదే ఇప్పుడు వివాదంగా మారిందట. కూసుమంచి మండలంలోని కొక్యాతండాలో రోడ్డుపనుల్లో ఉన్న ఒక గిరిజనుడిపై విజయ్‌ దాడి చేయడం దుమారం రేపింది. సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో విజయ్‌పై కేసు పెట్టక తప్పలేదు. అదీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో మరింత రచ్చ అయింది. తండ్రి అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. మంత్రి పువ్వాడ అజయ్‌ ఆశీసులు ఉన్నా.. కుమారుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో బాలసానికి దిక్కుతోచడం లేదట. కేసు కాకుండా  ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని సమాచారం. ఇప్పుడీ కేసే తన రాజకీయ భవిష్యత్‌కు ఎక్కడ ఎసరొస్తుందోనని ఆందోళన చెందుతున్నారట.  బాలసాని గతంలో టీడీపీలో ఉండేవారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గంలో ఉండటంతో డీసీ ఎమ్ ఎస్ , డీ సీ సీ బీ  ఛైర్మన్‌ పదవులు వరించాయి. చివరకు టీడీపీలోనే ఎమ్మెల్సీ అయ్యారు. తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో ఆయన్ని అనుసరించారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఆశీసులతో మరోసారి ఆ పదవి చేపట్టారు. 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడంతో.. మంత్రి పువ్వాడ అజయ్‌ శిబిరంలో చేరారు బాలసాని. ఈ ఏడాది డిసెంబర్‌తో తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోతుంది. ఆ పదవిని మరోసారి పొడిగించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇలాంటి సమయంలో సన్‌ స్ట్రోక్‌ తగలడంతో బాలసానికి మైండ్‌ బ్లాంక్‌ అయిందట.  మూడు దశాబ్దాలుగా ఖమ్మం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు బాలసాని. అనేక మంది పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పించారు. ఈ సమయంలో అవేమీ అక్కరకు రాలేదని కుమారుడు విజయ్‌పై నమోదైన కేసును తలచుకుని ఆయన కుమిలిపోతున్నారట. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుపై ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చాలా మంది కన్ను పడింది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. బాలసాని అలాంటి అడ్డంకులను అధిగమించే పనిలో ఉండగా.. ఎదురైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు మనశ్శాంతిని దూరం చేసిందట. అధికార పార్టీలోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. మరి.. ఈ గండాన్ని బాలసాని ఎలా అధిగమిస్తారో చూడాలి.

వామనరావు దంపతుల హత్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు?: ఉత్త‌మ్‌


వామనరావు దంపతుల హత్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు?: ఉత్త‌మ్‌

 

గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు

సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి

దళితుడి లాకప్ డెత్‌పై వామనరావు కేసు వేశారు 

చివ‌ర‌కు వారే ప్రాణాలు కోల్పోయారన్న శ‌్రీధ‌ర్ బాబు

 

 స్టేట్ పోలిటికల్ బ్యూరో హైదరాబాద్ , పెన్ పవర్

 

ఓ కేసులో హైకోర్టులో పిటిష‌న్‌ వేసినందుకే లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల‌ను దారుణంగా చంపార‌ని కాంగ్రెస్ తెలంగాణ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే, ఈ కేసులో పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయ‌న ఆరోపించారు. 

శుక్రవారం  గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు లాయర్ దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం కాంగ్రెస్ నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఈ ఘ‌ట‌న‌పై కేసీఆర్ ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ కేసులో పుట్టా మధుకు స్థానిక పోలీసు కమిషనర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ప్రభుత్వంపై త‌మకు నమ్మకం లేదని, కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడని ఆయ‌న చెప్పారు. ఈ కేసులో  నేరుగా కోర్టు ద్వారానే విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ఈ విష‌యంపై తాము సీజేఐతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశామని వివ‌రించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు మీడియాతో మాట్లాడుతూ...  లాయర్ దంప‌తుల‌ హత్య  దురదృష్టకరమని అన్నారు. శీలం రంగయ్య అనే దళితుడి లాకప్ డెత్‌పై లాయ‌ర్ వామన‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారని ఆయ‌న వివ‌రించారు. లాక‌ప్ డెత్‌పై స్థానిక పోలీసు కమిషనర్ పట్టించుకోవడం లేదని వారు చెప్పార‌ని, కాబ‌ట్టి దీన్ని కోర్టు పట్టించుకోవాలని కోరారని శ్రీధ‌ర్ బాబు అన్నారు. చివ‌ర‌కు, లాయ‌ర్లూ ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు. ఈ కేసును నీరుగార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


భాగ్యనగరిలో మారిపోతున్న పార్కింగ్ రూల్స్... కొత్త నిబంధనలు ఇవి!

 భాగ్యనగరిలో మారిపోతున్న పార్కింగ్ రూల్స్... కొత్త నిబంధనలు ఇవి!



మళ్లీ పెరిగిపోయిన పార్కింగ్ దందా

గత నాలుగు నెలలుగా ఫిర్యాదుల వెల్లువ

కొత్త రూల్స్ జారీ చేసిన జీహెచ్ఎంసీ

 

 బ్యూరో రిపోర్ట్ హైదరాబాద్ , పెన్ పవర్

హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా పెరిగిపోయిన వాహనాల పార్కింగ్ దందాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోమారు చర్యలకు ఉపక్రమించింది. ఎటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయరాదని మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సర్కారు, తొలి రోజుల్లో పక్కాగానే అమలు చేసినా, క్రమంగా అదే దందా తిరిగి ప్రారంభమైంది.ఇటీవల కరోనా మహమ్మారి కట్టడి నిమిత్తం అమలు చేసిన లాక్ డౌన్ కూడా పార్కింగ్ దందా తిరిగి వేళ్లూనుకునేందుకు సహకరించింది. గడచిన నాలుగైదు నెలలుగా పార్కింగ్ ఫిర్యాదులు పెరగడంతో బల్దియా పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) విభాగం చర్యలు ప్రారంభించింది.వాహనాల పార్కింగ్ నిబంధనలను వెలువరిస్తూ, అధిక ఫీజు వసూలు చేస్తే, ఆ ఆధారాన్ని ఫోటో తీసి ఆన్ లైన్ లో ఈవీడీఎం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ కు పంపాలని అధికారులు సూచించారు. ఇక నగరంలోని మాల్స్, మల్టీ ప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు, సినిమా హాల్స్ కు నేటి నుంచి పార్కింగ్ నిబంధనలతో కూడిన నోటీసులను అధికారులు పంపనున్నారు. తాజా నిబంధనల ప్రకారం, ఎక్కడైనా, ఎప్పుడైనా 30 నిమిషాల వరకు ఎలాంటి పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు వీల్లేదు. ఆపై గంట వ్యవధిలో మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా షాపింగ్ చేసినట్టు బిల్లు చూపించినా పార్కింగ్ చార్జీ ఉండదు. బిల్లు లేకుంటే మాత్రం నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఇక గంటకన్నా ఎక్కువ సమయాన్ని పార్కింగ్ లో ఉంచిన వారు మూవీ టిక్కెట్ ‌ను చూపించాలి. ఈ ధర పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. ఒకవేళ నిర్ణీత పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువగా ఉంటే మాత్రం ఫీజును చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.  ఇక అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్‌ టిక్కెట్లను ముద్రించాలని, వాటిపై పార్కింగ్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరని అధికారులు తేల్చి చెప్పారు. పార్కింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్‌ టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని, అయితే దానిపై ఫీజు వసూలు చేస్తే 'పెయిడ్' అని, వసూలు చేయకుంటే 'ఎగ్జెంప్టెడ్' అన్న స్టాంపు తప్పనిసరని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం నుంచి నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని, లేకుంటే రూ. 50 వేల జరిమానా కట్టాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.

విద్యుత్ సమస్యలపై స్పందించిన మంత్రి

 విద్యుత్ సమస్యలపై స్పందించిన మంత్రి 




వనపర్తి , పెన్ పవర్

వనపర్తి పట్టణంలోని 30 వా వార్డులో విద్యుత్తు సమస్యలపై మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వినతి పత్రం సమర్పించారు. స్పందించిన మంత్రి  హుట హుటిన విద్యుత్ డి.ఇ., ఏ.డి.ఇ., ఏ.ఇ.లను వార్డు లో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించడంతో ఉదయం డి.ఇ. నరేంద్ర కుమార్, ఎ. ఇ. రాజా గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలసి 30 వ వార్డు లో ఉన్న జంగిడిపూరం,ఐజయ్యకాలనీ, సాయినగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలను కాలినడకన మొత్తం తిరిగి వార్డులో లెలకొన్న విద్యుత్తు సమస్యలను తెలుసుకున్నారు.  లోఓల్టేజ్, నుతన లైన్ల ఏర్పాటు నూతన ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించారు. డి.ఇ. సానుకూలంగా స్పందించి వెంటనే తీరుస్తానని చెప్పడం జరిగిందని, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, డి.ఇ. నరేందర్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

గుంటూరు మేయర్ పీఠంపై జనసేన కన్ను...

 

గుంటూరు మేయర్ పీఠంపై జనసేన కన్ను...

 

బ్యూరో రిపోర్ట్  గుంటూరు , పెన్ పవర్

 

ఏపీలో మార్చి 10 వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  14 వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.  ఇక ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి.  దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ పిటిషన్లను కొట్టివేసింది. ఎస్ఈసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.  ఇక ఇదిలా ఉంటె, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి జనసేన పార్టీ పావులు కదుపుతున్నది.   ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయినా, జనసేన పార్టీ మెరుగైన ఓటు షేరింగ్ ను సాధించింది.  ఎలాగో బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో మరింత మెరుగ్గా ప్రచారం చేసి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను పార్టీ అన్వేషిస్తోంది.  గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని, మేయర్ పదవి జనసేన పార్టీకి సొంతం చేసుకుంటుందని జనసేన నేత బోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.  వైసీపీ ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని, వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా విజయం తమదే అని అన్నారు.  అభివృద్ధి కావాలో, వైసీపీ ఇస్తున్న తాయిలాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...