Followers

శ్రీ అంకమ్మ తల్లి జీర్ణోద్ధరణ కు వితరణ


 శ్రీ అంకమ్మ తల్లి జీర్ణోద్ధరణ కు వితరణ                         

 పెన్ పవర్, కందుకూరు

పట్టణంలోని వెలసియున్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం జీర్ణోర్ధరణకు అనంతసాగరం గ్రామానికి చెందిన నలమోలు చెన్నారెడ్డి  ధర్మపత్ని ధనమ్మ 10,116 రూపాయలు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో కమిటీ సభ్యులు వెంకటరెడ్డి  కి అందజేశారు. ఇప్పటివరకు దాతలు ఇచ్చిన వివరాలు మొత్తం ఒక కోటి 50 లక్షల 79 వేల 558 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి రమణారెడ్డి  తదితరులు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ కి 70 స్థానాలు పైనే వస్తాయి-మళ్ళ సురేంద్ర

 తెలుగుదేశం పార్టీ కి 70 స్థానాలు పైనే వస్తాయి-మళ్ళ సురేంద్ర

  పెన్ పవర్ , అనకాపల్లి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మళ్ళ సురేంద్ర, బి ఎస్ ఏం కే  జోగి నాయుడు, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ లో , సావు కారులుని, గుమస్తా సంఘం వారిని, కార్మిక సంఘం వారిని, కలాసి సంఘం వారిని, మహిళ సంఘం వారిని, కలిసి అందరినీ కూడా 80,81 తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని , మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వలన విసుగు చెంది ఉన్నారని, మళ్లీ పూర్వ వైభవం రావాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే అందరికీ అందుబాటులో ఉండి ఈ 2 వార్డు లు అభివృద్ధి చేస్తామని, అలాగే పట్టణం లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని విశాఖపట్నంలో  మెజారిటీ స్థానాలు 70 స్థానాలు పైనే తెలుగుదేశం పార్టీ గెలుచుకొని మేయర్ పీఠం దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుద్ధ నాగేశ్వర రావు, బుద్ధ శ్రీనివాస్ రావు,  దాడి కోటి, విల్లూరి మాధవ్, దొడ్డి సూరి అప్పారావు, పల్లం నాయుడు, పీలా నూక రాజు, దాడి పరదేశి నాయుడు, పెదకం శెట్టి వెంకట రావు, విల్లురీ రమణ బాబు, బుద్ధ భువనేశ్వర్ రావు, సత్తి బాబు, తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరివనం వేయడానికి శ్మశానవాటిక స్థలం, ఎండుచేపల ప్లాట్ పారాలే పర్యాటక అధికారులకు కనిపించాయా .... గంటా నూకరాజు


కొబ్బరివనం వేయడానికి శ్మశానవాటిక స్థలం,  ఎండుచేపల ప్లాట్ పారాలే  పర్యాటక అధికారులకు కనిపించాయా .... గంటా నూకరాజు

భీమిలి, పెన్ పవర్

భీమిలి జోన్ లో జలగెడ్డ  శ్మశానవాటిక మరియు మత్స్యకారులు ఎండు చేపలు ఎండబెట్టే ప్లాట్ ఫారాలు దగ్గర  పర్యాటక శాఖ కొబ్బరివనం  అని మరొకటి అని సదును చేస్తే  భీమిలి పరిసర ప్రాంత వాసులు శవాలను ఎక్కడ పూడుస్తారని అధికారులను   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు  ప్రశ్నించారు.ఎగువపేట, బోయవీధి, గొల్లవీధి పరిసర ప్రాంత వాసులు  ఎన్నో ఏళ్లుగా  ఎస్.ఓ.ఎస్.ఎదురుగా ఉన్న సముద్రం తీరం  స్థలాన్ని స్మశానవాటికగా  ఉపయోగిస్తున్నారని,  చాలామంది  శ్మశానవాటిను దేవాలయంగా భావిస్తారని,అలాంటి స్థలంలో  కొబ్బరివనం అని ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.పర్యాటకశాఖ కళ్ళు.మూసుకొని ఉందా అని అన్నారు. కొబ్బరివనం వేయడానికి శ్మశానవాటిక స్థలం,  ఎండుచేపల ప్లాట్ పారాలే  పర్యాటక అధికారులకు కనిపించాయా అని అన్నారు.  మరి భీమిలి పరిసర ప్రాంతాలలో ఉంటున్న వారు శ్మశానవాటికను ఎక్కడ పెట్టుకోవాలని అన్నారు.ఈవిషయమై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించకపోతే  ఎలా అని ప్రశ్నించారు. జలగెడ్డ శ్మశానవాటిక, మత్స్యకారులు చేపలు ఎండబెట్టే ప్లాట్ పారాలు గత  ప్రభుత్వాల  హయాంలో నిర్మాణం అయ్యాయని అన్నారు.ఎండు చేపల ప్లాట్ పారాలు  మత్స్యకారులకు  ఎంతో ఉపయోగకరంగా ఉండేవని అన్నారు.కానీ నేడు కొబ్బరివనం అని ఎండు చేపల ప్లాట్ పారాలు తొలగించడం,  మత్స్యకారుల యొక్క శ్మశానవాటికను తొలగించాలని  చూస్తుంటే,మత్స్యకారులను తీరంలో లేకుండా చేయాలనే తలంపు ఈ ప్రభుత్వం పెట్టుకుందేమోనని గంటా నూకరాజు  విమర్శించారు.   ఏ సందర్భంలో అయినా మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు.ఎన్నో తరాలుగా ఉన్నటువంటి జలగెడ్డ శ్మశానవాటిక స్థలంలో  పర్యాటక  ప్రాంతం  కొబ్బరివనం ఏర్పాటు చేయాలనే తలంపు ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదని  అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలని  గంటా నూకరాజు అధికారులకు సూచించారు.

వై.ఎస్.ఆర్.సి పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ వలసలు

 వై.ఎస్.ఆర్.సి పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ వలసలు

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల పాత 11 వార్డు కొత్త 14, 24, వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొంప ధర్మరావు మరియు వారి అనుచరులు  కలిసి ఈరోజు నగర వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె.రాజు  ఆధ్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  సమక్షంలో  వీరికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు, ఎం.వి ఎల్.వి.సత్యనారాయణ, వుడా మాజీ చైర్మన్ రవి రాజు గారు,సీనియర్ నాయకులు భరణికాన రామారావు 14వార్డ్ అభ్యర్థి కె. అనిల్ కుమార్ రాజు,పాకలపాటి అప్పల నరసింహ రాజు (బాక్సర్ రాజు ) 24వార్డ్ అభ్యర్థిని సాడి పద్మ రెడ్డి, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ "మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డు" కు ఎంపిక

డాక్టర్. చెన్నా గౌరీ శంకర్ "మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డు" కు ఎంపిక

విశాఖ తూర్పు, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిన్న వాల్తేర్ లోని రెల్లి వీధి గ్రామ అధ్యక్షుడు,  ప్రముఖ జర్నలిస్టు డాక్టర్. చెన్నా గౌరీశంకర్ ప్రతిష్ఠాత్మకమైన "మన తెలుగు తేజం జాతీయస్థాయి అవార్డు" కు ఎంపికయ్యారు. త్వరలో  హైదరాబాద్ నగరంలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా  సినీ రాజకీయ, ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నామని మన తెలుగు తేజం సంస్థ అవార్డుల కమిటీ కన్వీనర్ పీ.వీ. రమణ గుప్తా ఒక  ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన  15 పివి అభిమాన సంఘాల పర్యవేక్షణలో 12 రంగాలకు చెందిన నిష్ణాతులకు, ప్రముఖులకు వారి సేవలను గుర్తించి మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డులను అందిస్తున్నామని పి.వి. రమణ గుప్తా పేర్కొన్నారు.ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం, చిన్న వాల్తేర్ కు చెందిన డాక్టర్. చెన్న గౌరీ శంకర్ విద్య, పత్రికా రంగాలలో చేస్తున్న  కృషిని అభినందిస్తూ "మన తెలుగు తేజం జాతీయస్థాాయి అవార్డుకు" ఎంపిక చేసినట్లు అవార్డుల కమిటీ కన్వీనర్ పి.వి.రమణ గుప్తా పేర్కొన్నారు. డాక్టర్. చెన్న గౌరీశంకర్ "మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డుకు" ఎంపిక కావడం పట్ల పలువురు స్పందిస్తూ ప్రతిభ ఉన్నవారికి అవార్డులు రావడం ఎంతో సంతోషించదగ్గ  విషయమని తెలిపారు.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో


ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

విశాఖపట్నం, పెన్ పవర్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఏఐటీయూసీ, సీఐటీయూ ఇఫ్టూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దిలపాలెం జాతీయ రహదారిపై రాస్తారోకో  అడ్డుకున్న పోలీసులు..ఉద్యమకారులు అరెస్ట్.. భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్ ,వంట గ్యాస్ ధరల ను తగ్గించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక సంఘాలు  శుక్రవారం మద్దిలపాలెం కూడలిలో సీపీఐ సీపీఎం ,కార్మిక,రైతు సంఘాలు పిలుపుమేరకు రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ,సీపీఎం జిల్లా కార్యదర్సులు బాలేపల్లి వెంకటరమణ, కె లోకనాధం, ఎం పైడిరాజు, ఆర్ కె ఎస్ వి కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద సామాన్య మధ్యతరగతి ప్రజల పైన పెను భారం మోపిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడం, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు చేయడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చి ఆదాని, అంబానీలకు కట్ట బెట్టలని చూస్తుందని మండిపడ్డారు పెంచిన ధరలు తగ్గించాలని స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగంలో నడిపించాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి   బస్సులు అడ్డంగా కూర్చొని ధర్నా నిర్వహించారు పోలీసులు సిపిఐ సీపీఎం ఇఫ్టూ నాయకులు బి వెంకటరమణ, కె లోకనాధం, ఎం పైడిరాజు, ఆర్ కె ఎస్ వి కుమార్ జి వామనమూర్తి, అమర్ మన్మధరావు, కుమారి, టి వి రావు,నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు లను అరెస్టు చేసిఎం వి పి పోలీస్ స్టేషన్ కు తరలించారు మోడీ ప్రభుత్వం గద్దె దిగే వరకు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు.

ఔట్ గేట్లో వంశి గారి ఎన్నికల ప్రచారంలో ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు, యువత..

ఔట్ గేట్లో వంశి గారి ఎన్నికల ప్రచారంలో ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు, యువత.. 

 పెన్ పవర్  విశాఖపట్నం 


 ఈరోజు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఔట్ గేట్ డౌన్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడప కు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ, విశాఖ మరింత అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు వెదజల్లుతూ , మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికి, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వంశి గారు మాట్లాడుతూ వార్డ్ ను మోడల్ వార్డ్ గా తీర్చిదిద్దే బాధ్యత తనదని అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చాల్లన్నది తమ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో  స్థానిక యువత, వైసీపీ నాయకులు, ఔట్ గేట్ పెద్దలు పాల్గొన్నారు...`

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...