Followers

చిలకగెడ్డలో 6 లక్షలు విలువైన గంధపు చెక్కలు పట్టివేత



 చిలకగెడ్డలో 6 లక్షలు విలువైన గంధపు చెక్కలు పట్టివేత

ఏజెన్సీ నుంచి బెంగళూరుకు రవాణా

పెన్ పవర్, బ్యూరో (విశాఖపట్నం)

 విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరుకు  అక్రమంగా రవాణా అవుతున్న  గంధపు చెక్కలను అటవీశాఖ అధికారులు  వారం పట్టుకున్నారు. బెంగళూరుకు  చెందిన వ్యక్తితో పాటు విశాఖపట్నంకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. జిల్లాలోని అనంతగిరి  రేంజ్  అటవీశాఖ అధికారి  దుర్గాప్రసాద్  అందించిన సమాచారం మేరకు చిలకల గడ్డ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా  గూడ్స్ వ్యానులో 36 బస్తాలు కనిపించాయి. వాటిని సోదా చేయగా  గంధపు చెక్కలుగా గుర్తించారు.వాటిని స్వాధీనం చేసుకుని తూకం వేయగా  840 కిలోలు బరువు వచ్చింది. ఈ గంధపు చెక్కలు మార్కెట్ విలువ ఆరు లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పాడేరు పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన గంధపు చెక్కలను  బెంగళూరుకి రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ వాహనం డ్రైవర్ అబ్దుల్ సలీం  అంగీకరించాడు. ఏజెన్సీలో గంధపుచెక్కల సేకరించడానికి  సహకరించిన విశాఖపట్నం లోని గోపాలపట్నం కు చెందిన  మహంతి గోపాలరావును  డ్రైవర్ అబ్దుల్ సలీంని  అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అటవీ సంపద అక్రమ రవాణా నేరమని  అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

బొగ్గు గని కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు


 బొగ్గు గని కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

మందమర్రి/ పెన్ పవర్ :

బొగ్గు గని కార్మికులకు ఆదాయపన్ను రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తున్నాయని సిఐటియు నాయకులు ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బొగ్గు గని కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంటులో స్పష్టం చేయగా, ఆదాయపు పన్ను రద్దు కోసం గతంలో తీర్మానం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో గల వేజ్ బోర్డు ఒప్పందం ప్రకారం సింగరేణిలో కార్మికులకు అలవెన్సులపై ఆదాయపు పన్ను రద్దు అమలు చేసేలా యాజమాన్యాన్ని ఆదేశించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పై తన వైఖరి తెలియపరచకుండా, సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నందని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ, కొత్త బొగ్గు బ్లాకులు రాకుండా వేలంపాట  పేరుతో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం తగ్గించి, కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి, మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు ఏ శ్రీనివాస్, వి ఐలయ్య, సంజీవ్, ప్రవీణ్, రాజమల్లు, అరిఫ్, సింగ్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం

 జోరుగా కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం

లక్షెట్టిపెట్/పెన్ పవర్

మున్సిపాలిటి పరిధిలోని ఇటిక్యాల సత్యసాయి నగర్ లో గురువారం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు యువనాయకుడు విజిత్ రావు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ ఒక్కరికీ ఏదో రూపంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటిల్లి పాది లబ్ది పొందే లా చేసాడన్నారు.రైతులకు రైతు బంధు,రైతు బీమా ఎకరాలు ఐదు వేలు ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణాలక్ష్మి అని లక్ష రూపాయలకు పైగా నగదుతో పాటు రెండు వేలు మూడు వేల ఫించన్లను అందజేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు.ప్రతీ ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఋణపడి ఉండాలని సభ్యత్వం తీసుకున్నా ప్రతీ ఒక్కరూ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపి రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంను అధరించేలా చూడలన్నారు. అనంతరం ప్రజలకు సభ్యత్వన్ని అందజేశారు.సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ప్రమాధబీమా కూడా ఉంట్టుందన్నారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య,వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ చెర్మాన్ సంధ్య జగన్మోహన్ రెడ్డి కౌన్స్లర్లు గడికొప్పుల ఉమాదేవి కిరణ్,సురేష్ నాయక్,చతరాజు రాజన్న,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

రెల్లివీధిలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశి గారు. .

రెల్లివీధిలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ నగర అధ్యక్షులు వంశి గారు. . 

 పెన్ పవర్ న్యూస్ విశాఖపట్నం 


ఈరోజు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెళ్లివీధి పరిసర ప్రాంతాల్లో గడప గడప కు వెళ్లి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. వంశీగారు రాకతో రెళ్లివీధి యువత, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో ఒక్కసారిగా వీధిలో సంబరాలు మొదలై  అడుగడుగునా పులా వర్షం కురిపించారు. జై జగన్ , జై వంశి అంటూ నినాదాలతో ప్రచార హోరు కొనసాగింది. కార్యక్రమంలో వంశి గారు మాట్లాడుతూ రెల్లివీధి వైసీపీ కంచుకోట అని, గత ఎన్నికలలో అందరూ ఫ్యాన్ గుర్తకు ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ mla నాగార్జున గారు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధు గారు ,వార్డ్ వైసీపీ నాయకులు, కుల పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు.

జైహింద్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ

 జైహింద్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ


పెన్ పవర్  రౌతులపూడి

జైహింద్ హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ, శ్రీ సూర్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. గత రెండు సంవత్సరముల నుండి రౌతులపూడి మరియు పరిసర ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి జైహింద్ హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ వారు ఎన్నోసహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంస్థ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో రక్త కొరతను దృష్టిలో పెట్టుకొని అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో ఈనెల 27వ తారీకు శనివారం నాడు హై స్కూల్ రోడ్ లో గల శ్రీ పి వి ఆర్ ఎం సరస్వతి స్కూల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కావున ఆరోగ్యవంతమైన యువతీ యువకులు పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేయవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమపై అవగాహన కల్పించుట కొరకు ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు.

పంచాయతీలో అడుగుపెట్టిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు

 పంచాయతీలో అడుగుపెట్టిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుమెంబర్లు


తాళ్ళపూడి  పెన్ పవర్

పెద్దేవం పంచాయతీ లో  అఖండ మెజారిటీతో గెలిచిన సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్  తోట రామకృష్ణ, వార్డ్ మెంబర్లు గురువారం ముహూర్తం ప్రకారం పంచాయతీ లో అడుగుపెట్టి,  వారి యొక్క కుర్చీలలో కూర్చోవడం జరిగింది.  అంగరంగ వైభవంగా వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇంతటి అఖండ విజయాన్ని ఎన్నడూ లేని విధంగా అందించిన గ్రామాల ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చెప్పింది చెప్పినట్టుగా ఒకటొకటిగా  చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, గ్రామ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననీ , గ్రామాన్ని ప్రధానమంత్రి దగ్గర అవార్డు పొందేలా తీర్చిదిద్దుతానని తోట మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ రంగనాయకమ్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు నరాలశెట్టి వీర వెంకటరావు, మానేపల్లి గోవిందరాజు, గెడ్డం గాంధీ, మైలవరపు రాధాకృష్ణ, నల్లాకుల వేణు, యండపల్లి కృష్ణార్జునులు, వేము రామారావు, కోడి గంగారావు, నా మన వెంకటేశ్వరరావు, నామన వీర వెంకట్రావు, సిర్రా గంగారావు , జొన్నకూటి పోసిరాజు,కొలిశెట్టి నాగేశ్వరరావు, ఓ.అశోక్, కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ వల్లభశెట్టి గంగాధర శ్రీనివాసరావు, కొవ్వూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కంఠంమని రమేష్, తాళ్ళపూడి మండలం వైసిపి ప్రెసిడెంట్ కుంటముక్కల కేశవనారాయణ, తాళ్ళపూడి మండలం వైసిపి నాయకులు పోసిన శ్రీకృష్ణ దేవరాయలు,  యెల్లిన శివ రామకృష్ణ, గనిశెట్టి బంగార్రాజు, నక్కా చిట్టిబాబు, గోలి అన్నవరం, కొమ్మిరెడ్డి పరశురామారావు, శీర్ల బ్రహ్మానందం,  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జర్నలిస్టు ల డైరీ ఆవిష్కరణ


 తెలంగాణ జర్నలిస్టు డైరీ ఆవిష్కరణ

    వికారాబాద్ జిల్లా: పెన్ పవర్: 

 తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాట్  డైరీ ని ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బీయ్యనీ. మనోహర్ రెడ్డి   చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరంఅయనామాట్లాడుతు సమాజంలో విలేకర్ల పాత్ర చాలా మంచిదని ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారని ఇలా సమాజ సేవ చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు  తెలియ పరుస్తూ ప్రభుత్వం కూడా వీరి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఘనపూర్ రాఘవేంద్ర గౌడ్ మరియు నాయకులు చంద్రమోహన్ శివుడు వేముల రఘు లింగ జొతీ తదీతరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...