Followers

ఎన్నికల విధుల్లో సేవాతత్పరులకు ప్రశంసలు, అభినందనలు - ఎస్పీ బి.రాజకుమారి

 ఎన్నికల విధుల్లో సేవాతత్పరులకు ప్రశంసలు, అభినందనలు - ఎస్పీ బి.రాజకుమారి

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 13, 17 మరియు 21 వ తేదీలలో జరిగిన మూడు విడతల పంచాయితీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు రాజ్యాంగ బద్దమైన తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొనుటలో మానవతాదృక్పదం, సేవా భావంతో సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి జిల్లా పోలీసుకార్యాలయంలో ఫిబ్రవరి 25, గురువారం నాడు ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నడు లేని విధంగా శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. అందరూ సమిష్టిగా పని చేయడం వల్లనే రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు మరియు ప్రజలు, అన్ని వర్గాల నుండి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు లభించిందన్నారు. ఇదే విధమైన స్ఫూర్తిని, సమిష్టిగా పని చేసే విధానాన్నిమున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కూడా చూపించి,జిల్లాకు మరింత మంచి పేరు తేవాలన్నారు. మూడు విడతలుగా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకొనుటలో అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులు తమవంతు సహాయ, సహకారాలను అందించారన్నారు. వృద్ధులను, దివ్యాంగులను తమ చేతులతోను, కుర్చీలో కూర్చుండ బెట్టుకొని మోస్తూ, పోలింగు కేంద్రాల వద్దకు చేర్చడం, ఓటు వేసిన తరువాత వారిని తిరిగి వాహనాల వరకు చేర్చడం వలన ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగించిందన్నారు. పోలీసులంటే తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించే వారే కాదు మానవత్వం, సేవా భావంతో వ్యవహరించే మన స్నేహితులన్న భావనను ప్రజల్లో కలిగించి నందుకు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సేవా భావంతో, మానవత్వంతో పని చేసిన పోలీసు అధికారులను,సిబ్బందికి జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.ప్రశంసా పత్రాలు పొందిన అధికారుల్లో ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, గజపతినగరం సిఐ డి. రమేష్, కొత్తవలస సిఐ జి.గోవందరావు,జామి ఎస్ఐ ఎస్. సుదర్శన్, సాలూరు పట్టణ ఎస్ఐ షేక్ ఫకృద్దీన్, బలిజిపేట ఎస్ఐ ఎ.నరేష్, కంట్రోల్ రూం ఎస్ఐ ఎ.మహేశ్వరరాజు, విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు, గజపతినగరం ప్రొబేషనరీ ఎస్ఐ నసీమా బేగం మరియు సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, ఎస్టీఎఫ్, సంగార్డు విభాగాలకు చెందిన వివిధ కేడర్లకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ. సుభాష్, సిసిఎస్ డిఎస్పీ జె. పాపారావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీలు ఆర్. శ్రీనివాసరావు, పి. రామారావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐలు జి.రాంబాబు, ఎన్. శ్రీనివాసరావు, రుద్రశేఖర్,డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేని, సాలూరు సిఐ అప్పలనాయుడు, బొబ్బిలి సీఐ కె.కేశవరావు, గజపతినగరం సిఐ డి.రమేష్, కొత్తవలస సిఐజి.గోవిందరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వద్దు. వ్యాక్సిన్ వినియోగించుకోండి. జిల్లా ఎస్పి కృష్ణారావు

 కోవిడ్ వ్యాక్సిన్ పై  అపోహలు వద్దు. వ్యాక్సిన్  వినియోగించుకోండి. జిల్లా ఎస్పి  కృష్ణారావు

పెన్ పవర్, బ్యూరో (విశాఖపట్నం)

 కోవిడ్ వ్యాక్సిన్  పై అపోహలు వద్దని  వ్యాక్సిన్ ను  అందరూ సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్  బొడ్డేపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన కైలాసగిరి   ఆర్మీడ్ రిజర్వ్ లో  కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ  కోవిడ్ వ్వాక్సన్ వల్ల  సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని  ప్రచారం జోరుగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల  అక్కడక్కడ మృతి చెందుతున్నారని  వస్తున్న వదంతులను నమ్మొద్దు అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు మేరకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందన్నారు. మొదటి విడత వేసుకున్న ఉద్యోగులు సకాలంలో రెండో విడత కూడా వేయించుకోవాలని సూచించారు. వైద్యుల పర్యవేక్షణలోనే కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారని తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అన్నారు. జిల్లాలోని  పోలీస్ అధికారులు  సిబ్బంది తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. తాను  కూడా  వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందని   ఎస్పి కృష్ణారావు  పోలీసులకు భరోసా ఇచ్చారు.

అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం

 అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం

గోకవరం, పెన్ పవర్  

మండలంలోని ఇటికాల పల్లి శివారు గోపాలపురం గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి.కరెంటు షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమై కోమలి సత్తిబాబు, షేక్ లక్ష్మీదేవికి చెందిన కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియవచ్చింది. అగ్నిప్రమాదంలో ఇంటిలో ఉన్న  ఫ్రిడ్జ్, బీరువా, రెండు బైకులు, గ్యాస్ స్టవ్, కుట్టు మిషను, డబుల్ కాట్ మంచం, కర్రల కోసే మిషన్, బంగారం వెండి వస్తువులు తదితర సామాగ్రిని పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద బాధితులను ఇటికాయల పల్లి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిగా గళ్ళాకృష్ణ పరామర్శించారు .

ఎంవిపి కాలనీ 18వ వార్డు బీజేపీ కార్యాలయనకు ఎమ్మెల్సీ మాధవ సుడి గాలి పర్యటన


 ఎంవిపి కాలనీ 18వ వార్డు బీజేపీ కార్యాలయనకు ఎమ్మెల్సీ మాధవ సుడి గాలి పర్యటన

విశాఖ తూర్పు   పెన్ పవర్

 ఎంవిపి కాలనీ 18వ వార్డు బిజెపి కార్యాలయమునకు ఎమ్మెల్సీ మాధవ్ సందర్శించడం జరిగింది.ఆయన వార్డు లో వున్న బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ సైనికుల్లా పనిచేయాలని అప్పుడే విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నారు ఆయన రాకతో  వార్డులో నూతనోత్సాహం నెలకొంది అందరూ పట్టుదలతో కృషి తో పనిచేయాలని   సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది 18వ వార్డు గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అన్నారు   బిజెపి వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాలే ఆమె గెలుపునకు నంది అన్నారు ఆమె విద్యావంతురాలు ప్రముఖ సీనియర్ న్యాయవాది అవ్వటo వల్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కొనియాడారు ఈ కార్యక్రమములో వార్డ్ అధ్యక్షులు శ్యామ్ కుమార్ ,బాబ్జి, సుబ్రమణ్యం, శేఖర్,రామా,లీలావతి,యశోద, శ్యామల,లలిత,జ్యోతి, సునీత నూకరాజు పాల్కొంటం జరిగింది.

19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గ పోటీచేస్తున్న దేవర సునంద దేవికి.... బి ఫారం అందజేత


19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గ పోటీచేస్తున్న దేవర సునంద దేవికి.... బి ఫారం అందజేత

మహారాణి పేట, పెన్ పవర్

నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవర సునంద దేవికి ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ సాకే శైలజానాథ్ సూచన మేరకు నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జి.ఏ.నారాయణ రావు చేతుల మీదగా 19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని గ పోటీచేస్తున్న దేవర సునంద దేవికి బి ఫారం అందజేశారు. ఈ సందర్భంగా సునందాదేవి మాట్లాడుతూ ఓటర్లు  ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నగర సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి తెడ్డు రామదాసు తదితరులు పాల్గొన్నారు.

పెగడపల్లిలో సిసి కెమెరాలు ప్రారంభించిన జైపూర్ ఎస్ఐ

 పెగడపల్లిలో  సిసి కెమెరాలు ప్రారంభించిన జైపూర్ ఎస్ఐ


మంచిర్యాల బ్యూరో/  పెన్ పవర్

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి  గ్రామంలో, నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కిరాణం షాప్ యజమాని ప్రశాంత్  సహకారంతో గ్రామములో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ  మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రశాంత్ నీ అభినందించారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామల సర్పంచ్, గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని,  ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.సీసీ కెమెరాల ద్వారా జైపూర్ డివిజన్లో ఎన్నో కీలకమైన కేసులు చేదించామన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ  పెగడపల్లి మండల ప్రజా ప్రతినిధులు  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్ పై దాడి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంగన్వాడీ టీచర్ పై దాడి   దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఆందోళన

పరవాడ, పెన్ పవర్

మండలం లో గల ముత్యాలమ్మ పాలెం లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్ ముత్యాల రాణి అదే గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కక్ష కట్టి దౌర్జన్యం చేయడం పట్ల ఈరోజు పరవాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ హెల్పర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేషు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు బి ఎల్ ఓ విధులు నిర్వహిస్తే దీనిని తప్పుగా చూపించి రెండో వైసిపి వర్గానికి చెందిన వారు అంగన్వాడి సెంటర్ లో ప్రవేశించి దౌర్జన్యం చేయడం వారి కుటుంబ సభ్యులను భయ బ్రాoతులకు గురిచేయడం అన్యాయమన్నారు వెంటనే దాడి చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి నాయకులు ఇష్టానుసారంగా రెచ్చిపోయి స్కీమ్ వర్కర్ల పై దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు సీపీకి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగులకు రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం తాసిల్దార్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు కే రమణ, సిహెచ్ దేవి, వి వి రమణమ్మ, పార్వతి, వరలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు తాసిల్దార్ ఈ ఫిర్యాదుపై పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందని మరోసారి పోలీస్ అధికారుల దృష్టికి ఫిర్యాదును పంపించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...