60యేండ్ల నేపంతో తొలగించే మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బందికి 10లక్షలు చెల్లించాలి..
పర్మినెంట్ మున్సిపల్ సిబ్బందికి పిఆర్పీ వెంటనే ప్రకటించాలి..
పెండింగ్లో ఉన్న యూనీఫాం కుట్టుగూలి సొమ్ము చెల్లించాలి..
మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్/పెన్ పవర్;
మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బందిని 60 ఏళ్ళు దాటిన వారిని విధులకు వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సరికాదని తొలగించే ముందు వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అక్రమంగా తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పర్మినెంట్ మున్సిపల్ సిబ్బందికి పిఆర్పీ వెంటనే ప్రకటించి చెల్లించాలని పెండింగ్లో ఉన్న యూనీఫాం కుట్టుగూలి సొమ్ము చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.యేసురత్నం, మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బుధవారం లిబర్టీ ట్యాంక్ బండ్ ఏరియాలో గల జి.హెచ్.యం.సి హెడ్ ఆఫీస్ వద్ద స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయంలో గుద్దల. యాదయ్య అధ్యక్షతన ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం పలు జిల్లాల ముఖ్యుల సమావేశం జరిగింది. అనంతరం పురపాలక శాఖ మంత్రి కే.టి.ఆర్, (ఓ.యస్.డి) మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (ఓ.యస్.డి) సి.రాధా, తెలంగాణ రాష్ట్ర కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యన్. సత్యనారాయణ లకు ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అనంతరం కె.యేసురత్నం , మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా పనిచేసిన మున్సిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను అద్దాంతరంగా వయసు మాలిన నేపంతో తొలగించే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి కరోనా, మరియు అధిక వర్షాలు అనావృష్టి లాంటి విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ రంగంలో పనిచేయించుకునే ప్రభుత్వానికి ఉద్యోగ కార్మిక సిబ్బంది వయస్సు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళు అంటూ సేవలు మరువలేనివి అని పోగడిన పాలకులు మాటలకు అర్ధం పర్ధం లేదని అన్నారు. ధర్మాసనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా చెవిటోడిముందు శంఖం ఉదిన సందంగా వ్యవహరించడం సరికాదని ఎంత కాలం ఈ వెట్టిచాకిరి బానిస బతుకులు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చేప్పిన మాటలు నీటిమీద బుడగలులాంటివని కార్మిక వర్గం అర్ధం చేసుకుందని ఇప్పటికైనా మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మిక సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా చాలిచాలని వేతనాలతో బ్రతుకులీడుస్తూ పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, లేదా 11వ పీఆర్సీ అమలు చేసి కనీస వేతనం నెలకు రూ. 21 వేలుగా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక వర్గం మరో మారు ఉద్యయ బాట పటడారని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి పిఆర్పీ ప్రకటించడంలో అలసత్వం విడనాడి వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పర్మినెంట్ ఉద్యోగ సిబ్బందికి రావాల్సిన యూనిఫాం కుట్టుగూలి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పురపాలక సంఘాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాలని కొత్తగా పంచాయతీల నుండి అప్ గ్రేడ్ అయిన మున్సిపాల్టీ, పురపాలక సంఘాలలో పనిచేసి స్కేలు జీతాలు పొందినవారిని
స్పెషల్ గ్రేడ్- సిబ్బందిగా గుర్తించి స్కేలు జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త పాత మున్సిపాలిటీలు, కార్ఫోరేషన్లు, పురపాలక సంఘాల్లో ఉద్యోగ కార్మిక సిబ్బంది తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో దసలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన వారిలో ఏఐటీయూసీ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు కె. జయచంద్ర, కార్యవర్గ సభ్యులు ముడి మార్టిన్, నాయకులు రాయపుడి శ్రీనివాస్,బి. శ్రీను, గోపాల్, కె.కుమార్,విజయ,ఉషయ్య, నర్సింహులు, జి.అశోక్, కిరణ్,చంటి, నాగరాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.