గిరిజన జాగృతి వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి బాల కోటయ్య కు సన్మానము
పెన్ పవర్ ఉలవపాడు
గిరిజన జాగృతి వేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి బాల కోటయ్య కు సన్మానము
పెన్ పవర్ ఉలవపాడు
వాడపల్లి వెంకన్న కు మొక్కుబడులు తీర్చుకుంటున్న భక్తులు
పెన్ పవర్ ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం వాడ పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు పద్మావతి సమేత వాడపల్లి గ్రామం లో కొలువై ఉన్నాడు ఈ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు కోరుకున్న కోరికలు తీర్చే వెంకన్నకు ఈరోజు ఒక భక్తులు రావులపాలెం గ్రామానికి చెందిన మల్లిడి ఆంజనేయులు రెడ్డి తులాభారం వేయించుకున్నారు ఈ తులాభారం లో 85 కేజీలు బెల్లంతో వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి తీసుకోవడం జరిగినది అనంతరం ఆ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులును మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్
పెన్ పవర్ ఆత్రేయపురం
అధికారమివ్వండి ... అభివృద్ది చేసి చూపిస్తా
24వ వార్డులో వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్
నర్సీపట్నం పెన్ పవర్
నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకా శివప్రసాద్ , తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సహజంగా సౌమ్యుడు, పట్టభద్రుడైన ఏకా శివప్రసాద్ కు వార్డులో మంచి పేరుంది. కరోనా వంటి కష్టకాలంలో పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు, గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే అండదండలతో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వార్డు అవసరాలకోసం చిన్న చిన్న పనులు, తన సొంత నిధులతో పూర్తి చేస్తూ, వార్డు ప్రజల మన్ననలు పొందుతూ వచ్చారు. ప్రస్తుతం 24వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకా శివప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే అండదండలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని భరోసా ఇస్తున్నారు. వార్డు సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, ఒక్క అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సహకారంతో వార్డు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని శివప్రసాద్ హామీ ఇస్తున్నారు.
ఆత్రేయపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆత్రేయపురం మండలంలో ఉన్న 17 గ్రాముల గాను పంచాయతీ ఎన్నికలు జరగగా అందులో పది గ్రామపంచాయతీలో వైసీపీ కైవసం చేసుకుంది మిగతా 7 గ్రామపంచాయతీలో తెలుగుదేశం కైవసం చేసుకోగా మండలంలో ఆత్రేయపురం గ్రామపంచాయతీ హోరాహోరి జరిగిన ఎన్నికల్లో 14 వార్డ్ నెంబర్ గాను పది వార్డులను వైసిపి కైవసం చేసుకుంది తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ కేవలం నాలుగు వార్డుల్లో సత్తా చాటుకుని సర్పంచ్ అభ్యర్థిని గడ్డం సుధా 443 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది గబ్బర్ సింగ్ చేసిన కృషికి ఫలితముగా ఆత్రేయపురం గ్రామ ప్రజలు గబ్బర్ సింగ్ బలపరిచిన అభ్యర్థిని పంచాయతీ సర్పంచ్ గా గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశంఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అమలాపురం పార్లమెంటు అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ల దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగినది.
రెండు ఇళ్లలో దొంగతనం 40 వేల నగదు 12.5 సవర్ల బంగారం అపహరణ
సి సి కెమెరాలో దొంగల దృశ్యాలు..
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ
పెన్ పవర్ కందుకూరు
దొంగలు రెండు ఇళ్లలో ఒకేరోజు దొంగతనం చేసి 40 వేల నగదు 12.5 సవర్ల బంగారాన్ని అపహరించిన సంఘటన పట్టణంలోని సాయి నగర్ లో జరిగింది. ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనానికి ప్రయత్నించి రెండు ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సాయి నగర్ లో ఈదర వెంకటస్వామి ఫంక్షన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా సోమవారం రాత్రి గోడదూకి తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి అందులో ఉన్న 20 వేల నగదు, రెండున్నర సవర్ల బంగారాన్ని అపహరించినట్లు తెలిపారు. అలాగే సాయినగర్ లోనే దిండికుర్తి నారాయణ కుటుంబ సభ్యులు పెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వెళ్లి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 10 సవర బంగారం, 20వేల నగదు అపహరించినట్లు వాపోయారు. నారాయణ ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉండటం ఎదురుగా నూతన ఇల్లు నిర్మిస్తూ ఉండడం దొంగలకు బాగా కలిసి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టణంలో రెక్కీ నిర్వహించి అదును చూసి కోవూరు రోడ్డు లోని సాయి నగర్ లోని ఇళ్ళలో ఈ పనికి తెగబడ్డారని పిస్తుంది. అక్కడే ఓ ఇంట్లో దొంగతనం చేయబోయి విఫలయత్నం చెందారు. అయితే ఆ ఇంట్లో సి సి కెమెరాలు ఉండటంతో దొంగలు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళే దృశ్యాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయ్ కుమార్, పట్టణ ఎస్ఐ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకొని ఇళ్లను పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం క్లూస్ టీం ను పిలిపించి వేలిముద్ర ఆధారాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించినట్లు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో ఎవరైనా ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పురపోరులో రెబల్స్ జోరు
ఐదు వార్డులో వైసిపి రెబల్స్
నాయకుల తాయిలాలు, లొంగని స్వతంత్రులు
నర్సీపట్నం, పెన్ పవర్
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ వ్యవహారం తలనొప్పిగా మారింది. సహజంగా అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీలోనూ కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కొన్ని వార్డుల్లో రెబల్ అభ్యర్థులను బుజ్జగించి, తన దారికి తెచ్చుకున్నారు. అయితే ఇంకా కొన్ని వార్డుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఎమ్మెల్యే , పార్టీలో సీనియర్లు ఎంత నచ్చజెప్పినా మాట వినడం లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి పార్టీకి అండగా ఉంటామని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చొరవ చూపి ఆరో వార్డులో మళ్ళ గణేష్ , 12 వార్డులో దాసును తన దారికి తెచ్చుకున్నారు. అయితే 1, 2 వార్డులలో మాకిరెడ్డి అప్పారావు దంపతులు, మూడవ వార్డులో మామిడి శ్రీనివాసరావు, 14 వ వార్డులో వర్రే శ్రీనివాసరావు, 15 వార్డులో పెద్దిరెడ్ల శ్రీనివాసరావు స్వతంత్రులుగా బరిలో కొనసాగుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పుర పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీకి స్వతంత్రులే అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...