Followers

మహా శివరాత్రి జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి

 మహా శివరాత్రి జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి 


సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలి

మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలి

పార్కింగ్ స్థలంలో లెవెలింగ్ చేయించాలి

ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే తో కలిసి తిప్పాపూర్ బస్టాండ్, పార్కింగ్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్

భక్తులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా  (పెన్ పవర్)/

                   దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా లోనీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మార్చి నెల 10,11,12 తేదీలలో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా సంబంధిత అధికారులు జాతర నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్   కృష్ణ భాస్కర్, ఎస్పీ  రాహుల్ హెగ్డే లు ఆదేశించారు.

మంగళవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతం, గుడి చెరువు శివారులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరచాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. గుడి చెరువు శివారులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని లెవెలింగ్ చేయించాలని సూచించారు. అక్కడ ఉన్నటువంటి బావి లో ఉన్న మురుగు నీటిని సిల్టింగ్ మోటార్ల ద్వారా లిఫ్టింగ్ చేయించాలని ఆదేశించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం 80 తాత్కాలిక బాతింగ్ షవర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఫైర్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మాక్ డ్రిల్స్ గురించి ఆరా తీశారు.

జాతరకు ముందుగానే సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లు ఆదేశించారు. 

ఈ సందర్శనలో అసిస్టెంట్ కలెక్టర్  రిజ్వాన్ భాషా షేక్, డీఎస్పీ  చంద్రకాంత్, ఆర్డీఓ   శ్రీనివాస రావు, మున్సిపల్ కమీషనర్  శ్యామ్ సుందర్ రావు, ఆలయ ఈఓ  కృష్ణ ప్రసాద్, డిపో మేనేజర్  భూపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మాభూమి మాకు ఇవ్వాలి నారాయణ పూర్ ర్తెతుల అవేదనా


మాభూమి మాకు ఇవ్వాలి నారాయణ పూర్ ర్తెతుల అవేదనా

వికారాబాద్  పెన్ పవర్ 

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణ పూర్

 భూదాన్ భూమిని గ్రామ రైతులకు ఇవ్వాలని గ్రామ సర్పంచి ,సీపీఐ, గ్రామస్తుల ఆధ్వర్యంలో  తహశీల్దార్  కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నారాయణ పూర్ గ్రామపంచాయతీ లోగల సర్వే నం  143 144 145 లోగల భూమి ముప్తె రెండు ఎకరాల ఇరవై రెండు గుంటల  భూమిని అప్పటి భూస్వామి అయిన భేనూరి చంద్రప్ప భూదాన్ బోర్డుకి దానం ఇవ్వడం జరిగింది కానీ చంద్రప్ప వారసులు సం,2005-2006 లో రైతులకు మాయమాటలు చెప్పి పహానిలలో మార్పులు చేసి పట్టా చేసుకోవడం జరిగింది  అప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి

అధికారుల అలిసిపోయారు. కానీ గత రెండు సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ చొరవతో మరియు కొంతమంది  వ్యక్తుల సాయంతో భూదాన్ భూమిని ప్రభుత్వ అధికారులు భూదాన్ భూమిలో రెవెన్యూశాఖ అధికారులు బోర్డు పథడం జరిగింది  ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు సుగుణ స్టీల్ కంపెనీ మూసివేసి అట్టి భూములను  నిరుపేద పాత రైతులకు పట్టాలు  ఈవాల్సిందిగా తహశీల్దార్  కి మెమోరాండం ఇవ్వడం జరిగింది . 



   



వాసవీ మాతాకు లక్ష కుంకుమార్చన

 వాసవీ మాతాకు లక్ష కుంకుమార్చన               

పెన్ పవర్  కందుకూరు

 కందుకూరు పొట్టి శ్రీరాముల బజార్ లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా వాసవిఅమ్మవారికి పూజారులు బాలయ్య,రాజా స్వాముల ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి పూలతో కన్నులపండుగగా అలంకారం చేశారు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం. మండపారాధన, కలశ స్థాపన, వాసవి కన్యకా పరమేశ్వరి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ఆర్యవైశ్య మహిళలు లలితా సహస్ర నామ పారాయణం చేశారు. తరువాత మూలమంత్ర హోమం చండీ హోమం వాసవి కన్యకా పరమేశ్వరి హోమం పూర్ణాహుతి,మహా నైవేద్యం మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరిగింది. రేపు శివ ఉదయం 10 గంటలకు పార్వతి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసెంట్ కొత్త వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సూర్య టెక్ సంస్థకు 101మంది ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంపిక

 సూర్య టెక్ సంస్థకు 101మంది  ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులు ఎంపిక

 గండేపల్లి పెన్ పవర్


గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో ఆదిత్య పాలిటెక్నిక్ విద్యార్థులకు సూర్య టెక్ సొల్యూషన్ హైదరాబాద్ సంస్థకు చెందిన మానవ వనరుల విభాగం ప్రతినిధి బృందం  నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 101మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని   ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడుతూ తమ సూర్య టెక్ సొల్యూషన్ హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగాల నియామకం కొరకు అవసరమైన నైపుణ్యం గల విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు గాను ఆదిత్యలో ఇంటర్వ్యూలు నిర్వహించి  వ్రాతపరీక్ష ,మౌఖిక పరీక్షలు,గ్రూప్ డిస్కషన్ తదితర పరీక్షలు నిర్వహించి అందు ప్రతిభ కనబరిచిన 101మంది   ఇఇఇ, మెకానికల్, మరియు ఇ.సి.ఇ, బ్రాంచ్ లకు చెందిన (పురుషులు) విద్యార్థులను ప్రాంగణ ఎంపిక ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పాత్రాలను అందివ్వడం జరిగిందని,వీరికి వార్షిక వేతనం 2.40 లక్షలు లభిస్తుందని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డా. నల్లమిల్లి శేషారెడ్డి,  క్యాంపస్ డైరెక్టర్ డా.ఎం.శ్రీనివాసరెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ . ఎస్.టి.వి.ఎస్.కుమార్, డీన్. ఎ.వి.మాధవరావు,  తదితరులు అభినందించారు.

ప్రత్యర్థులకు ఎదురు నిలిచి గెలిచిన గబ్బర్ సింగ్

 ప్రత్యర్థులకు ఎదురు నిలిచి గెలిచిన గబ్బర్ సింగ్ 

పెన్ పవర్ ఆత్రేయపురం

కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ స్థానిక ఎన్నికలు మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారాడు తన ప్రత్యర్ధులుకు  అవకాశం ఇవ్వకుండా అతడే ఒక సైన్యం ల  ముందుండి ఆత్రేయపురం  పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని  వాడివేడిగా జరిగింది .అధికార పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ 10 వార్డునెంబర్లు కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ కేవలం 4 వార్డునెంబర్లు కైవసం చేసుకుంది. అయితే అధికారం మాదే అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు  అనుకునే రీతిలో ఆశలు తారుమారయ్యాయి. వైయస్సార్ పార్టీ వార్డు అభ్యర్థులకు ప్రజలు ఓటేసి విజయం చేకూర్చిన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) బలపరిచిన గేడ్డం సుధా 443 ఓట్ల మెజార్టీతో  ప్రజలు గెలిపించి తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయోత్సవం నిర్వహించి సంబరాల్లో మునిగితేలారు. ప్రజలు అడుగడుగునా పూలదండలు వేస్తూ నీరాజనాలు పటీ స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయించారు. సర్పంచ్ అభ్యర్థి గేడ్డం సుధా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరాజు గబ్బర్ సింగ్ నాయకత్వంలో విజయం చేకూర్చిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని గ్రామ అభివృద్ధికి మరింతగా తోడ్పడి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అన్నారు. అలాగే గబ్బర్ సింగ్ వెంకటరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి పని చేయిస్తానని ఆయన అన్నారు.

గోకవరం లో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

 గోకవరం లో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

గోకవరం పెన్ పవర్ 

భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గోకవరం మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం భక్తి శ్రద్ధలతో ఏకాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని గోకవరం లో గల ఆర్టీసీ కాంప్లెక్స్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోని కామరాజుపేట లోని వేణుగోపాలస్వామి ఆలయం లోనూ మల్లవరం లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో,గుమ్మల్ల దొడ్డి లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలోనూ, అచ్చుతాపురం లోని పల్లపు వీధిలో గల శ్రీరామ్ ఆలయంలోనూ దేవతామూర్తులకు భజన సమాజాలతో భజనలు అభిషేకాలు స్వామివారి కి కల్యాణాన్ని నిర్వహించారు. రంప యర్రంపాలెం గ్రామ శివారులో గల పాండవుల కొండపైకి గ్రామస్తులు చేరుకునే పాలు పొంగించి కుని సూర్యనమస్కారాలు చేయడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏకాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు.

మాతృభాష తల్లి వంటిది

 మాతృభాష తల్లి వంటిది

పెన్ పవర్  ఆత్రేయపురం 

ఆత్రేయపురం మండలం ర్యాలీ  గ్రామంలో మ్యాజిక్ ఫ్యామిలీ శ్యామ్ జాదు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాటినం మెజీషియన్ వీక్ 2021లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫైనల్ కథలపోటీలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌభాగ్య గ్రూపు అధినేత చిన్నం  చంద్రారెడ్డి మాట్లాడుతూ మాతృ భాష తల్లి వంటిది దాన్ని ఆశ్రద్ధ చేసే మానవ మనుగడకు ముప్పు అని చెప్పడం జరిగింది విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు శ్యామ్ జాదు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆస్ట్రేలియా ఇండియా దేశాల నుండి 158 మంది పాల్గొన్నారు 18 మందిని ఫైనల్కు ఎందుకు చేశామని వీరికి భారత టాలెంట్ బెస్ట్ స్టోరీ టైల్లర్  అవార్డు ను  ప్రధానం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మోహిత్ ఈ కార్యక్రమంలో మోహిత్ అన్నపూర్ణ తేజశ్రీ  రుషిత్  తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...