Followers

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ


 ముఖ్యమంత్రి  సహాయనిది చెక్కులు పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా /  పెన్ పవర్;

గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామంలో బుధవారం తెలంగాణావప్రభుత్వంవపేదవారికీఎప్పుడువఅండగావఉంటుంది తెలంగాణా ప్రభుత్వం  అందించిన ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కులు ముగ్గురికి సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీకి  ముఖ్య అతిథిగా గంభీరావుపేట మండల   సెస్ డైరక్టర్ దేవేందర్ యాదవ్ , ఆధ్వర్యంలో  సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు , ఈరవేణి  మల్లయ్య కు  28000/- రూపాయలు, ఇరవెని.మల్లయ్య,  చెక్కు,బాల్ రెడ్డి  27500/- రూపాయలు, బి  భారతమ్మ 39000/-రూపాయలుచెక్కులు అందజేయడం జరిగింది..

ఈ కార్యక్రమం లో సిరిగిరివచంద్రమౌళి దమ్మన్నపేట్ తెరాస గ్రామశాఖ అధ్యక్షుడుకొత్తింటిహన్మంతరెడ్డియూత్చఅధ్యక్షులు అన్నoశేఖర్ గౌడ్, నర్సయ్య , రాజిరెడ్డి , దేవయ్య ,ధర్మా రావు ,వేణు , రాజిరెడ్డి, రాజు  టీఆర్ఎస్  సీనియర్  నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమ తెలంగాణా  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదములుతెలియజేశారు.…

డ్రైనేజీలు పూడికతీత దుర్గంధం వెదజల్లుతోంది... దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి... పట్టీపట్టనట్లు అధికారులు

 డ్రైనేజీలు పూడికతీత దుర్గంధం వెదజల్లుతోంది... దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి...పట్టీపట్టనట్లు అధికారులు


పెన్ పవర్ ఉలవపాడు 

మండల కేంద్రమైన ఉలవపాడు లోని డ్రైనేజీ లోని పూడికతీత ను తొలగించటం మానివేశారు. మురుగు కుళ్ళిదుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయి. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీనికి తోడుగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా చిన్నపిల్లలు వృద్ధులకు దద్దుర్లు వచ్చి రోగాల  పాలవుతున్నారు. ఉలవపాడు గ్రామం లోని ప్రతీ చోట డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయి. ఇప్పటికైనా పట్టించుకుని డ్రైనేజీ లో పూడిక తొలగించి. దోమల నివారణ కై దోమల మందు పిచికారి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జోరుగా సభ్యత్వ నమోదు

 జోరుగా  సభ్యత్వ నమోదు 

200 మందికి  టీఆర్ ఎస్ పార్టీ  సభ్యత్వ నమోదు 

రాజన్న సిరిసిల్ల జిల్లా / పెన్ పవర్ 


గంభీరావుపేట మండలం  నర్మాల గ్రామం లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు జోరుగా  సాగింది కార్యక్రమం లో బుధవారం  పేదల కు  కల్యాణలక్ష్మి , సీఎం ఆర్ ఎఫ్, రైతు  బందు ,   ఎన్నో  పథకాలు  తీసుకొని వచ్చింది నర్మాలగ్రామం  లో అందుకే  జోరుగా  సభ్యత్వం  గ్రామ ప్రజలు, యువతలు రైతులు గ్రామ ప్రజలు ఎంతో ఉత్సహంగా పార్టీ  సభ్యత్వం 200 మంది సభ్యత్వంనమోదు చేసుకొని రిసిప్ట్ తీసుకోవడం జరిగింది  

ఈ కార్యక్రమం లో  జడ్పీకోప్షేన్ అహ్మద్  నర్మాలగ్రామశాఖఅధ్యక్షుడు ఎడబోయిన రత్నాకర్ ,గంభీరావుపేటమండల  ఆర్ బి ఎస్అధ్యక్షుడు ధ్యానబోయినరాజేందర్ , ఆర్ ఆంజనేయులు, డి స్వామి అల్వాల  రాజు ,  టీఆర్ఎస్ నాయకులు ప్రజలుపాలకవర్గసభ్యులుతదితరులు పాల్గొన్నారు.

60యేండ్ల నేపంతో తొలగించే మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బందికి 10లక్షలు చెల్లించాలి..

 60యేండ్ల నేపంతో తొలగించే మున్సిపల్ కాంట్రాక్టు సిబ్బందికి 10లక్షలు చెల్లించాలి.. 

పర్మినెంట్ మున్సిపల్ సిబ్బందికి పిఆర్పీ వెంటనే ప్రకటించాలి.. 

పెండింగ్లో ఉన్న యూనీఫాం కుట్టుగూలి సొమ్ము చెల్లించాలి..

మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్/పెన్ పవర్;



మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బందిని 60 ఏళ్ళు దాటిన వారిని విధులకు వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం సరికాదని తొలగించే ముందు వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అక్రమంగా తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పర్మినెంట్ మున్సిపల్ సిబ్బందికి పిఆర్పీ వెంటనే ప్రకటించి చెల్లించాలని పెండింగ్లో ఉన్న యూనీఫాం కుట్టుగూలి సొమ్ము చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.యేసురత్నం, మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా బుధవారం లిబర్టీ ట్యాంక్ బండ్ ఏరియాలో గల జి.హెచ్.యం.సి హెడ్ ఆఫీస్ వద్ద స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయంలో గుద్దల. యాదయ్య అధ్యక్షతన ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం పలు జిల్లాల ముఖ్యుల సమావేశం జరిగింది. అనంతరం పురపాలక శాఖ మంత్రి కే.టి.ఆర్, (ఓ.యస్.డి) మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ (ఓ.యస్.డి) సి.రాధా, తెలంగాణ రాష్ట్ర కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యన్. సత్యనారాయణ లకు ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అనంతరం కె.యేసురత్నం , మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా పనిచేసిన మున్సిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను అద్దాంతరంగా వయసు మాలిన నేపంతో తొలగించే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలి కరోనా, మరియు అధిక వర్షాలు అనావృష్టి లాంటి విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ రంగంలో పనిచేయించుకునే ప్రభుత్వానికి ఉద్యోగ కార్మిక సిబ్బంది వయస్సు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళు అంటూ సేవలు మరువలేనివి అని పోగడిన పాలకులు మాటలకు అర్ధం పర్ధం లేదని అన్నారు. ధర్మాసనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా చెవిటోడిముందు శంఖం ఉదిన సందంగా వ్యవహరించడం సరికాదని ఎంత కాలం ఈ వెట్టిచాకిరి బానిస బతుకులు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చేప్పిన మాటలు నీటిమీద బుడగలులాంటివని కార్మిక వర్గం అర్ధం చేసుకుందని ఇప్పటికైనా మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మిక సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా చాలిచాలని వేతనాలతో బ్రతుకులీడుస్తూ పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, లేదా 11వ పీఆర్సీ అమలు చేసి కనీస వేతనం నెలకు రూ. 21 వేలుగా నిర్ణయించి చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక వర్గం మరో మారు ఉద్యయ బాట పటడారని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి పిఆర్పీ ప్రకటించడంలో అలసత్వం విడనాడి వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పర్మినెంట్ ఉద్యోగ సిబ్బందికి రావాల్సిన యూనిఫాం కుట్టుగూలి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పురపాలక సంఘాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెంచాలని కొత్తగా పంచాయతీల నుండి అప్ గ్రేడ్ అయిన మున్సిపాల్టీ, పురపాలక సంఘాలలో పనిచేసి స్కేలు జీతాలు పొందినవారిని

స్పెషల్ గ్రేడ్- సిబ్బందిగా గుర్తించి స్కేలు జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త పాత మున్సిపాలిటీలు, కార్ఫోరేషన్లు, పురపాలక సంఘాల్లో ఉద్యోగ కార్మిక సిబ్బంది తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో దసలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో అధికారులకు వినతి పత్రాలు అందజేసిన వారిలో ఏఐటీయూసీ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు కె. జయచంద్ర, కార్యవర్గ సభ్యులు ముడి మార్టిన్, నాయకులు రాయపుడి శ్రీనివాస్,బి. శ్రీను, గోపాల్, కె.కుమార్,విజయ,ఉషయ్య, నర్సింహులు, జి.అశోక్, కిరణ్,చంటి, నాగరాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహారదీక్ష..

 విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహారదీక్ష..

పెన్ పవర్/మహబూబాబాద్;

విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ


తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ టిఏస్ఇఇ యూనియన్ 327 ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులకు బుధవారం రిలే నిరాహారదీక్ష ను చేపట్టారు. . ఈ సంధ ర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరారు. విద్యుత్ కార్మికుల పలు డిమాండ్లు ....ఆర్టిజన్ ఉద్యోగులకు ఎ.పి.యస్.ఇ.బి. సర్వీసు రూల్స్ వర్తింప చేయాలి,మరియు ఆర్జిజన్ల పర్సనల్ పేను బేసిక్ పే లో కలపాలని,విద్యుత్ సంస్థలో 01.02.1999 నుండి 31.08.2004 సంవత్సరం వరకు ఉద్యోగంలో చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి,మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులందరిని (అన్మాన్డ్ వర్కర్స్, స్పాట్ బిల్లర్స్ బిల్ కలెక్టర్స్ యస్.పి.యమ్ వర్కర్స్ మరియు స్టోర్లో పని చేసే హమాలీలను) ఆర్టిజన్లుగా గుర్తించాలి. అన్ని సబ్ స్టేషన్లకు వాచ్ మెన్లను నియమించాలి.

ఫీల్డ్ లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు టి.ఎ బిల్స్ ఇవ్వాలి మరియు ఆర్టిజన్లను సొంత జిల్లాలకు బదిలీలు చేయాలి సబ్ స్టేషన్లలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ ను తేది. 29-07-2017 గా నిర్ణయించాలి.రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించువైద్య సదుపాయాలన్ని ఆర్టిజన్ కార్మికులకు వర్తింపచేయాలి అలాగే ఆర్టిజన్ల కాంట్రాక్ట్ సర్వీసును గ్రాట్యూటికి కలుపాలి.2006-07లో జె.యల్.యం నోటిఫికేషన్ ప్రకారం క్వాలిఫై అయిన అభ్యర్థులందరికి కామన్ జడ్జిమెంట్ ప్రకారం జె.యల్.యం ఉద్యోగాలు కల్పించాలి జెన్‌కోలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు క్వార్టర్స్ సదుపాయము మరియు జెన్కో అసుపత్రులలో వైద్య సదుపాయము కల్పించాలి. ప్రైవేట్ కేసులలోసస్పెండ్ అయిన ఆర్టిజన్లను వెంటనే విధులలోకి తీసుకోవాలి మరియు సస్పెండ్ అయిన తేది నుండి సబ్ స్టెన్సివ్ అలవెన్లు ఇవ్వాలి. 2011లో రిక్రూట్‌మెంట్ అయిన జూనియర్ లైన్ మెన్ లకు జాయినింగ్ తేది నుండి పేపిక్సేషన్ ఎరియర్స్ ఇవ్వాలని..

ఎన్పీడీసీఎల్ జేఎల్ఎంకు ట్రాన్స్ఫర్ కు అవకాశం కల్పించాలని,విద్యుత్ కార్మికులకు, ఉద్యోగులకు కోటి రూపాయల జనరల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.. సీనియర్ ఫోర్ మెన్ పోస్టు మరియు లైన్ ఇన్స్పెక్టర్. లైన్మెన్,సీనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.విద్యుత్ ఉద్యోగులు మరియు ఆర్టిజన్ కార్మికులకు పరిమితి లేని వైద్యసదుపాయం కల్పించాలన్నారు. సమస్యల సాధన కొరకు ఫిబ్రవరి 24,25 తేదీలలో రిలే నిరాహార దీక్షలు, హైదరాబాదులోని ఎస్పీడీసీఎల్ ముందు మార్చి 2న నిరసన,వరంగల్ లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు మార్చి 5 న ధర్నా కార్యక్రమం, మార్చి 18న హైదరాబాదులోని విద్యుత్ సౌధా ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో సంఘ బాధ్యులు పాల్గోన్నారు.

ఉప్పరపల్లి లో ఘనంగా లింగమంతుల జాతర:హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్.

 ఉప్పరపల్లి లో ఘనంగా లింగమంతుల జాతర:హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్. 

మహబూబాబాద్/పెన్ పవర్;


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం లో బుధవారం లింగమంతుల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా యాదవ కులస్తులు తమ ఇంటి నుంచి బోనాలు ఎత్తుకుని ఆలయ ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోళ్లను యాటలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు, జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, దామర కొండ ప్రవీణ్ కుమార్, సర్పంచులు సారయ్య బట్టి శ్రీను సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు

హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 మహబూబాబాద్ ,పెన్ పవర్ ;

పెంచిన హమాలీ రేట్లను అమలు చేయకుండా ప్రభుత్వం హమాలీల శ్రమను దోచుకుంటోందని ఏఐటీయూసీ మండల కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం ఎదురుగా ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కళ్లు, చెవులు ,నోరు మూసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ దారిద్ర్య  రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం ను సకాలంలో చేర్చేందుకు హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు హమాలీలకు పెరగాల్సి ఉండగా గత సంవత్సరం నవంబర్ రెండున నూతన రేట్ల   విషయమై సివిల్ సప్లై అధికారులు మరియు యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించి ఎగుమతి దిగుమతి క్వింటా ఒక్కంటికి 18 రూపాయలనుండి23 రూపాయల వరకు పెంచి ఆమోదం తెలిపారన్నారు.పెంచి నాలుగునెలలు అవుతున్నా నేటికీ అమలు చేయడంలో గానీ,జీవోను విడుదల చేయడం లో  ప్రభుత్వం మరియు సివిల్ సప్లయ్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హమాలీలు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఒప్పందం ప్రకారం నూతన రేట్లు అమలు చేసేదాకా  నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రేట్లు దేనికి సరిపోవని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని ,హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనివ్వవ, గత ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ సౌకర్యం తక్షణమే  కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వడ్డెబోయిన లక్ష్మీనర్సయ్య, బుక్యా వీరన్న,నరముల యాకయ్య ,  యాకూబ్ రెడ్డి , సూరారెడ్డి, రాజు' శ్రీను , భిక్షపతి, వెంకన్న,మాణిక్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...