Followers

ఏజెన్సీ లో ఆదివాసీ నిరోద్యోగులకు అన్యాయం



ఏజెన్సీ లో ఆదివాసీ నిరోద్యోగులకు అన్యాయం  

 ఆదివాసీ సంక్షేమ పరిషత్   

చింతూరు పెన్ పవర్


మంగళవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అత్యవసర  సమావేశం చింతూరు itda ప్రాంగణం లో నిర్వహించడం జరిగింది . ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం లో ఆదివాసీ నిరోద్యోగులకు తీవ్రా అన్యాయం  జరుగుతుంది ఆవేదన వ్యక్త పరిచారు . ఆదివాసీల కోసం, ఆదివాసీ ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు  చేసిన జీసీసీ లో కూడా తాత్కాలిక  ఉద్యోగాలు  గిరిజనేతరులకే  అధికారులు కట్టబెడుతున్నారని  అన్నారు .  చింతూరు itda పరిధిలో కొన్ని వేళా మంది డిగ్రీ పీజీ లు చేసి నిరుద్యోగులుగా కాళిగా ఉన్నారని . అటువంటి వారికి ఉద్యోగాలు కల్పించకుండా  బయట నుండి వలసలు వచ్చి ఏజెన్సీ లో తిష్ట వేసిన గిరిజనేతరులకు కట్టబెట్టడం  ఎంతవరకు  సమంజసం అన్నారు . ఆదివాసీ నిరోద్యోగులు అంత రేపు itda చింతూరుకి  రావాలని అయన పిలుపునిచ్చారు . ఆదివాసీ లకోసం ఆదివాసీ నిధులతో  ఏర్పాటు చేసిన కార్యాలయాలు , సంస్థలు అన్ని  గిరిజనేతరులకు ఉద్యోగ ఉపాధిలు  కల్పించి  స్థానిక ఆదివాసీ లను గాలికి  వదిలేస్తున్నారని  అన్నారు . ఇప్పటికే ఏజెన్సీ  వ్యాపారాలు అన్ని గిరిజనేతరుల పరమైయ్యాయి .1/70  చట్టం ఉన్న లేనట్లు  గానే ఉంది అని అన్నారు . కార్యాలయాలు లో దరఖాస్తులు  పెట్టి పెట్టి అలిసిపోవడమే  అవుతుంది తప్ప ఒక్క సమస్య పై పరిస్కారం  లేదని అన్నారు . ఆదివాసీలకు న్యాయం చేయని , ఉపాధి ఇవ్వలేని  అధికారులు కార్యాలయాలు ఎందుకని  ప్రశ్నించారు . ఆదివాసీలు ఉద్యోగాలు కావాలంటే 100 రకాల  అర్హతలు  ఆడుతారు  . గిరిజనేతరులని పెట్టుకోవడానికి  ఏనిబంధనలు ఉండవు , ఏ అర్హతలు  ఉండవు. దీన్ని బట్టి చుస్తే ఆదివాసీల పై అధికారుల చిత్తశుద్ధి  ఏమాత్రం ఉందొ అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు . కార్యక్రమం లో కరం దుర్గ రావు , సీతారామయ్య పోడియం రాజు ,సోడె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్దులను గెలిపించండి

 ప్రజాసమస్యలపై  నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్దులను గెలిపించండి

సిపిఎం విస్తృత స్ధాయి సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజశేఖర్ పిలుపు

పెద్దాపురం పెన్ పవర్ 

నీతిగా, నిజాయితీగా, ప్రజల కోసం నిరంతరం పని చేసే సిపిఎం అభ్యర్దులను పెద్దాపురం మున్సిపాల్టికి పంపించాలని సిపిఎం తూర్పుగొదావరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్.రాజశేఖర్ పిలుపునిచ్చారు. సిపిఎం మండల విస్తృత సమావేశం కేదారి నాగు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజశేఖర్ ముఖ్యఅతిధిగా పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం మున్సిపాల్టిలో ప్రజల సమస్యలపై గొంతెత్తే సిపిఎం నాయకులను కౌన్సిల్ సబ్యులుగా ఎన్నుకొనే వారసత్వం ఉందని అన్నారు. ఆ వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని కోరారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించే నాయకులను మనం ఎన్నుకుంటే మంచిదని కోరారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి ప్రజల నెత్తిన భారాలు మెాపుతున్నారని అన్నారు. ఒకపక్క గ్యాస, మరోపక్క డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుతున్నారన్నారు. పట్టణంలో నిర్మించిన అపార్ట్ మెంట్ లను లబ్దిదారులకు ఇవ్వకుండా అవస్ధలకు గురి చేస్తున్నారని అన్నారు. 14 వ వార్డు సిపిఎం అభ్యర్ది రొంగల సుబ్బలక్ష్మీ, 15 వ వార్డు సిపిఎం అభ్యర్ది యాసలపు అనంత లక్ష్మీ, 18 వ వార్డు సిపిఎం అభ్యర్ది కూనిరెడ్డి అరుణ, 21 వ సిపిఎం అభ్యర్ది నీలపాల సూరిబాబు ను గెలిపించాలని విజ్ఞాప్తి చేసారు. ఈ సమావేశంలో సిరపురపు శ్రీనివాస్, కూనిరెడ్డి అప్పన్న, డి.కృష్ణ, ఆర్.వీర్రాజు, గడిగట్ల సత్తిబాబు, సత్యవతి, జి.పెంటయ్య, దాకమర్రి ఏడుకొండలు, నెక్కల నరసింహమూర్తి తదితరులు పాల్గోన్నారు.

వెంకన్న నిత్య అన్నదానానికి1,00,116/- విరాళం

 వెంకన్న నిత్య అన్నదానానికి1,00,116/- విరాళం

 పెన్ పవర్  ఆత్రేయపురం 

 ఆత్రేయపురం మండలం వాడ పల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానానికి వచ్చిన భక్తులు అ స్వామివారి  అష్టోత్రం పూజలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన పూసపూడి రామ్ ప్రసాద్ మంగమణి  దంపతులు  1,00,116/- రూపాయలు విరాళం ఇచ్చినారు దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ పుణ్య దంపతులుకు  ఆ స్వామివారి చిత్రపటాని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎన్నికల ప్రత్యేక అధికారి బుల్లి రాజు

 ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎన్నికల ప్రత్యేక అధికారి బుల్లి  రాజు

పెన్ పవర్ ఆత్రేయపురం

ఆత్రేయపురం మండలం లో జరిగిన  గ్రామ పంచాయతీ ఎన్నికలు  మీ అందరి సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించామని ఈ ఎన్నికల ద్వారా ప్రపంచంలో అతిపెద్ద కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలో సేవలు అందించే గొప్ప అవకాశం పొందిన ఆత్రేయపురం మండలం లో 17 గ్రామాల పంచాయతీ ఎన్నికల్లో  194 వార్డులకు  నూతనంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో నిష్పక్షపాతంగా ప్రజామన్నాను పొందేలా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆత్రేయపురం మండలం ఎన్నికల ప్రత్యేక అధికారి కె.బుల్లి రాజు ఎంపీడీవో నాతిబుజ్జి  తాహసిల్దార్ ఎమ్.  రామకృష్ణ తెలిపారు  ఈ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అమలాపురం సబ్ కలెక్టర్ హిమన్ష్ కౌశిక్  ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణలో ఎంతో కష్టపడి పనిచేసే విధంగా పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్ జోనల్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది పోలీసులు రెవెన్యూ విద్యాశాఖ అధికారులు సిబ్బందికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేయడం జరిగినది

వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతి లేదు

 వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతి లేదు 

రాజన్న సిరిసిల్ల బ్యూరో /పెన్ పవర్

మండలం లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతించబోమని తాసిల్దార్ గోడల పై సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. మహిళలు ఉద్యోగులు హుందాతనం గా ఉంటారని ఇక్కడికి వచ్చే ఫిర్యాదుదారులు క్రమశిక్షణ పాటించాలని తహసిల్దార్ శ్రీకాంత్ తెలిపారు క్రమేపీ కొంతమంది యువకులు చెడ్డీలు వేసుకొని ఇష్టానుసారం పద్ధతులు పాటించకుండా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళ ఉద్యోగులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఇలాగే వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఉద్యోగులు హెచ్చరిక చేశారు. ఉద్యోగులపై అసభ్యంగా మాట్లాడిన అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించిన వారిపై 186, 189,353 సెక్షన్ ల పై చర్యలు తీసుకోబడతాయని అన్నారు ఒకవేళ రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించబడుతుందని అన్నారు.

బడుల పున‌‌‌‌‌‌ః స్వాగతిస్తున్నాం

 బడుల పున‌‌‌‌‌‌ః స్వాగతిస్తున్నాం        

 నారయణపేట - పెన్ పవర్

    రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభించడానన్ని స్వాగతిస్తున్నామని కరోనా నిబంధనలు పాటించేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని బీసీ సేన  ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల అశోక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏబీవీపీ పూర్వ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రవితేజ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని  సూచించారు. అడ్డాకుల మండలం లోని  పొన్నకల్ గ్రామంలో  జిల్లా పరిషత్ స్కూల్ లో సందర్శించిన అనంతరం విద్యార్థులను అడిగి

 మౌలిక వసతులపై ఆరా తీశారు

 కరోన నిబంధనలు పాటిస్తూ, తరచూ చేతులు సబ్బుతో కడుకుని

 ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారికి

 సూచించారు, పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం

 పరిశుభ్రంగా ఉండేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయుల కు  ఆయన సూచించారు.

శభాష్ నాయకులు సర్పంచ్, ఉపసర్పంచ్

 శభాష్ నాయకులు సర్పంచ్, ఉపసర్పంచ్

తాళ్ళపూడి  పెన్ పవర్

పెద్దేవం గ్రామంలో సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, ఉపసర్పంచ్ తోట రామకృష్ణ గ్రామాభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు. 6 వ వార్డులోని కచ్చా డ్రైన్ పారిశుద్ధ్య కార్మికుల తో పాటుగా సర్పంచ్, ఉపసర్పంచ్ కూడా శుభ్రం చేసి, అందులో ఉన్న చెత్త చెదారాలను తీయడం  జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన మాగ్రామాల ప్రజల కోసం పెద్దేవం పంచాయతీని అన్నివిధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు నరాలశెట్టి వీర వెంకట్రావు, మైలవరపు రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...