ఆదివాసీ సంక్షేమ పరిషత్
చింతూరు పెన్ పవర్
మంగళవారం నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం చింతూరు itda ప్రాంగణం లో నిర్వహించడం జరిగింది . ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం లో ఆదివాసీ నిరోద్యోగులకు తీవ్రా అన్యాయం జరుగుతుంది ఆవేదన వ్యక్త పరిచారు . ఆదివాసీల కోసం, ఆదివాసీ ఉత్పత్తుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జీసీసీ లో కూడా తాత్కాలిక ఉద్యోగాలు గిరిజనేతరులకే అధికారులు కట్టబెడుతున్నారని అన్నారు . చింతూరు itda పరిధిలో కొన్ని వేళా మంది డిగ్రీ పీజీ లు చేసి నిరుద్యోగులుగా కాళిగా ఉన్నారని . అటువంటి వారికి ఉద్యోగాలు కల్పించకుండా బయట నుండి వలసలు వచ్చి ఏజెన్సీ లో తిష్ట వేసిన గిరిజనేతరులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు . ఆదివాసీ నిరోద్యోగులు అంత రేపు itda చింతూరుకి రావాలని అయన పిలుపునిచ్చారు . ఆదివాసీ లకోసం ఆదివాసీ నిధులతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు , సంస్థలు అన్ని గిరిజనేతరులకు ఉద్యోగ ఉపాధిలు కల్పించి స్థానిక ఆదివాసీ లను గాలికి వదిలేస్తున్నారని అన్నారు . ఇప్పటికే ఏజెన్సీ వ్యాపారాలు అన్ని గిరిజనేతరుల పరమైయ్యాయి .1/70 చట్టం ఉన్న లేనట్లు గానే ఉంది అని అన్నారు . కార్యాలయాలు లో దరఖాస్తులు పెట్టి పెట్టి అలిసిపోవడమే అవుతుంది తప్ప ఒక్క సమస్య పై పరిస్కారం లేదని అన్నారు . ఆదివాసీలకు న్యాయం చేయని , ఉపాధి ఇవ్వలేని అధికారులు కార్యాలయాలు ఎందుకని ప్రశ్నించారు . ఆదివాసీలు ఉద్యోగాలు కావాలంటే 100 రకాల అర్హతలు ఆడుతారు . గిరిజనేతరులని పెట్టుకోవడానికి ఏనిబంధనలు ఉండవు , ఏ అర్హతలు ఉండవు. దీన్ని బట్టి చుస్తే ఆదివాసీల పై అధికారుల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందొ అర్ధం చేసుకోవచ్చని విమర్శించారు . కార్యక్రమం లో కరం దుర్గ రావు , సీతారామయ్య పోడియం రాజు ,సోడె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.