Followers

స్వాభిమాన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

స్వాభిమాన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

గూడెం కోత్తవీధి పెన్ పవర్ 

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు మల్కన్ గిరి జిల్లా చిత్రకొండ స్వాభిమాన్ అటవీ ప్రాంతంలోని హంటల్ గుడ లో బీఎస్ ఎఫ్ బలగాలు గాలింపు చేపట్టగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు, నిఘా వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు, చిత్రకొండ బ్లాక్ హంటల్ గుడ అటవీ ప్రాంతంలో కదలిబంద గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిన బ్యాంక్ ను స్వాధీనం చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్న బ్యాంక్ లో రెండు ప్రెషర్ మైన్స్, ఒకటి టిఫిన్ బాంబు మరియు ఇతర వస్తువులు బీఎస్ ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు, ఘటనా స్థలానికి బీఎస్ ఎఫ్ బాంబు స్క్వాడ్ బృందాలు వచ్చి బాంబును బయటకు తీసి పేల్చివేశారు,గత కొన్ని రోజులుగా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు స్వాబిమాన్ అటవీ ప్రాంతంలోని బీఎస్ ఎఫ్ బలగాలు మావోయిస్టు ప్రణాళికలను వివిధ సమయాల్లో అడ్డుకునేందుకు బీఎస్ ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు, ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన జోనల్ కమిషనర్


 మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలిపిన జోనల్ కమిషనర్


కూకట్ పల్లి/పెన్ పవర్

ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన మేయర్ మేయర్ గధ్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలక్ష్మి లను కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత సోమవారం తన సిబ్బందితో కలిసి మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు..‌ కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని పలు సర్కిల్‌లలో కుత్బుల్లాపూర్ ఉపకమీషనర్‌ మంగతాయారు.. గాజులరామారం ఉపకమీషనర్ రవీందర్ కుమార్..మరియు జోనల్ కార్యాలయం సిబ్బంది తదితరులు మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు..

ఘనంగా పివి జయంతి వేడుకలు

ఘనంగా పివి జయంతి వేడుకలు

కూకట్ పల్లి, పెన్ పవర్

కె.పి.హెచ్.బి కాలని మూడోపేజ్ కట్టావారి సేవాకేంద్రం వద్ద సోమవారం భారత మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి వేడుకలను నిర్వహించారు. మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు పీవీ నరసింహ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని ఈసంవత్సరమంతా శతజయంతి ఉత్సవాలుగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునివ్వటం యావత్ భారతజాతికే గర్వకారణమని, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగు వాడు పీవీ నరసింహారావని, ఆయన బహు భాషావేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందరని, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారని, తన యొక్క రాజకీయ జీవితాన్ని 1938లో మొదలుపెట్టి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపారని, ఎమ్మెల్యే స్ధాయి నుంచి కేంద్ర క్యాబినెట్ లో అనేక పదవులను అలంకరించి ప్రధానమంత్రి స్థానానికి ఎదిగారని, అలాంటి మహోన్నత వ్యక్తి మన తెలుగు వాడు కావడం, అందునా తెలంగాణ ముద్ధు బిడ్డ కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమములో గుర్నాధరావు, కొల్లా శంకర్, పిడికిటి గోపాల్ చౌదరి, కొండూరు నారాయణ రాజు, ఎస్ రఘురామ్, రామసహాయం బుచ్చిరెడ్డి, క్రిస్టోఫర్, శ్రీనివాస్, లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.




 

సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా

 సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా.

 సబ్ డి ఎఫ్ ఓ ని తప్పుదారి పట్టించిన ఫారెస్ట్ సిబ్బంది

 స్మగ్లర్లకు  సహకరిస్తున్న పెందుర్తి సెక్షన్ ఆఫీసర్..

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

 విశాఖ నగరానికి చేరువలో ఉన్న సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు  ఏజెన్సీ నుండి  విలువైన కలపను తెచ్చి  స్థానికంగా నిల్వచేసి బిల్డర్లకు సామ్మిల్లులకు సరఫరా చేస్తున్నారు. స్మగ్లర్లు భారీఎత్తున కలప వ్యాపారం చేయడానికి  స్థానిక ఫారెస్ట్ అధికారులు  పుష్కలంగా సహకరిస్తున్నారు. కలప పొరపాటున  ఎక్కడైనా పట్టుబడితే  స్మగ్లర్లను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆఖరికి అధికారుల ఆదేశాలను సైతం  పెడచెవిన పెట్టి  తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అటవీ సంరక్షణ  కలప రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం నియమించిన అటవీశాఖ సిబ్బంది  స్మగ్లర్ల కాసులకు ఫిదా అయి  బాధ్యతలకు చెదలు  పట్టిస్తున్నారు. దీనికి 2 రోజుల క్రితం సబ్బవరం లో జరిగిన సంఘటనలు  అవినీతికి అద్దం పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే  సత్యనారాయణ సామిల్లు లో  భారీగా టేకు కలప ఉందన్న సమాచారం  అందుకున్న స్క్వాడ్ డి ఎఫ్ ఓ  పెందుర్తి సెక్షన్ ఆఫీసర్ సుధీర్ కి  కలప స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సామిల్లుకు పెళ్లి చూసి రావడం జరిగింది.  ఆ కలప ఏమైందో  తెలియడం లేదు.

 కానీ వాస్తవానికి అక్కడ ఉన్న కలప ప్రత్యక్షుల కంటి దృష్టి నుండి  చెరిగిపోలేదు.   మొక్కుబడిగా తీసుకువెళ్ళిన కలపకు ఇంతవరకు మెజర్మెంట్స్  పూర్తి కాలేదంటే   అక్కడ ఫారెస్ట్ ఉద్యోగుల పనితనం  అర్థమవుతుంది. ఈ సంఘటన జరిగిన మూడో రోజున  సబ్బవరం అనకాపల్లి రోడ్డులోని హీరో షోరూం ప్రక్కన శ్రీ మహాలక్ష్మి టైల్స్ షాపు ఎదురు సందులో తొమ్మిదో ఇల్లు పక్కన భారీ ఎత్తున టేకు కలప   సెక్స్తార్పాలిన్  కప్పి ఉంచారు.  ఈ కలప నిల్వపై సమగ్ర సమాచారం  సబ్ డి ఎఫ్  ధర్మ రక్షిత్ కు గురువారం సాయంత్రం  చేరింది. శుక్రవారం ఉదయం పెందుర్తి సెక్షన్ ఆఫీసర్ సుధీర్ కు కలపను పట్టుకో వలసిందిగా ఆయన ఆదేశించారు. నిల్వ ఉన్న కలపను చూసి  స్మగ్లర్ కు సహకరించాలనే ఉద్దేశంతో  ఇది హుదూద్ తుఫాన్ లో కలపని. కలప యజమాని శ్రీను  తమతో మాట్లాడతాడని  వెళ్ళిన ఫారెస్ట్ సిబ్బంది  అధికారికి సమాచారం  ఇవ్వడం జరిగింది. అధికారి తిరిగి ప్రశ్నించడంతో  గత్యంతరం లేక మరుసటి రోజు శనివారం  తప్పని పరిస్థితుల్లో  వెళ్లి  చెత్తాచెదారం లాంటి కలపను  వ్యానులో ఎక్కించు కు వెళ్లారు. వీరు అక్కడికి వెళ్ళే సమయానికే  విలువైన నాణ్యమైన కలప మాయం అయిపోయింది. ఇది జగమెరిగిన సత్యం ఫారెస్ట్ సిబ్బంది  వ్యానులో తరలించు  వెళ్తున్నా  కలప ను చూసి  ప్రత్యక్ష సాక్షులు నోరెళ్లబెట్టారు. ఇదిలా ఉండగా దేవరాపల్లి నుంచి ఇటీవల వచ్చిన  వేగిస కలప  లోడు కూడా  ఆకస్మాత్తుగా మాయమైపోయింది. స్థానికంగా  జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతున్న సెక్షన్ ఆఫీసర్  బీట్ ఆఫీసర్ కు  తెలీకపోవడం విడ్డూరం. జిల్లా అధికారి  అప్రమత్తం చేసిన వీరు స్మగ్లర్లకు మద్దతు  పలుకుతున్నారు.

సబ్బవరంకి కలప ఎక్కడనుండి చేరుతుంది

  అనంతగిరి  దేవరాపల్లి  తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి  టేకు  గన్న రా  వేగిస  ఆనేమ్  వంటి విలువైన కలపను నరికించి వాహనాల ద్వారా సబ్బవరం కి చేరుస్తున్నారు. ఇక్కడ సామిల్లు ల్లో  తగిన సైజులు కటింగ్ చేసి  నగరంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అపార్ట్మెంట్లు ఫర్నిచర్ యూనిట్లు   ఇతరత్రా అవసరాలకు ఆర్డర్లపై సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మహానగరంలో ఎక్కడ ఎటువంటి నిర్మాణం జరిగిన  ఇక్కడ నుంచే  కలప చేరవేస్తున్నారు. సబ్బవరం కి చెందిన  శ్రీను  అనే వ్యక్తి ఈ కలప అక్రమ రవాణాకు  సూత్రధారి అని అటవీ శాఖ సిబ్బందికి తెలుసు  కానీ  ఎంత విలువైన కలప పెద్ద మొత్తంలో తెచ్చిన  సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.  ఈ స్మగ్లింగ్ పై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి  చూడాల్సిందే.. 

     స్మగ్లర్ పై  చర్యలు తీసుకుంటాం.

 సబ్బవరం లో భారీగా కలప స్మగ్లింగ్ పై  ఫారెస్ట్ కన్సర్వేటర్  మోహన్ రావు ని  ప్రస్తావించగా  కలప అక్రమ రవాణా  తన దృష్టికి వచ్చిందని. విచారణ జరిపించి  కలప స్మగ్లర్  మరియు సహకరించిన వారిపై కూడా  చర్యలు తీసుకుంటామని తెలిపారు.

న్యాయవాదులు వామన్ రావు నాగమణి లను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

 న్యాయవాదులు వామన్ రావు నాగమణి లను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి



మందమర్రి పెన్ పవర్ :


హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను మంథని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్ట మధు అతని గుండాలు కుంట శీను, చిరంజీవి, బిట్టు శీను పట్టపగలు అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేయడాన్ని ఎమ్మార్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా అందిస్తుందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వాసాల సంపత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న అటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదులు కీలకంగా ఉద్యమిస్తే ఇవాళ న్యాయవాదులకు ఎలాంటి ప్రాణ రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇందుకు కారణం కెసిఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి దొడ్డి దారిన ముఖ్యమంత్రి అయినా కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ముఠాలను తయారు చేసుకొని భూకబ్జాలు ఇసుక మాఫియా సెటిల్మెంట్లు చేస్తూ వాళ్ల సొంత ప్రయోజనాల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే మంథని ఏరియాలో పుట్ట మధు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఒక దళిత మాదిగ యువకుడు పుట్ట మధు బంధువులు అమ్మాయిని ప్రేమించినందుకు అతని ఇంట్లో నుంచి బయటకు పిలిచి అతి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తెలిపారు. అదేవిధంగా మంథని ఏరియాలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఎదురు చెప్పిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ, అడ్డగోలుగా ఇసుక మాఫియా కొనసాగిస్తు, 2019 ఎన్నికల సమయంలో ఈసీకి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్లో పుట్ట మధు ఆస్తులను తక్కువగా చూపిస్తే వీటన్నిటి మీద వామన్ రావు అతని భార్య నాగమణి హైకోర్టులో పిటిషన్ ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుట్ట మధు ఆస్తులు 900 కోట్లు ఉన్నట్లు సేకరించి హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇదంతా తలనొప్పిగా మారిన వామన్ రావు కుటుంబాన్ని అంతమొందించాలని పథకం ప్రకారమే కుంట శీను, చిరంజీవి, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీను అందరికీ పురమాయించి పరోక్షంగా ఈ హత్యలకు కారణమయ్యారని తెలిపారు. పుట్ట మధును కస్టడీలోకి తీసుకొని  విచారణ చేయాలని, అతని టిఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జెడ్పి చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించాలని హత్య చేసినటువంటి దుండగులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ కేసును సీబీఐతో ఇన్వైట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండలం ఇంచార్జ్ వాసాల సంపత్, పట్టణ ఇంచార్జ్ సంగి రవి, గిన్నారపు రవి, మిట్టపల్లి బాబు, సప్పిడి శ్రీనివాస్, నల్లాల తిరుపతి, వికలాంగుల హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్షులు మూలకాల రాజేంద్రప్రసాద్, పూసాల రమేష్, సుంక శీను, పులిపాక కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్ 


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. కూన శ్రీశైలం గౌడ్.


కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నాను

గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను

2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందాను

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేసాను.

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైంది. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వచ్చారు, దీనికి ఉదాహరణ దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైంది. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం,  పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని,ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చానని, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా టీఅర్ఎస్పై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వచ్చానని అన్నారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు..



2009 కొత్తగా పునర్విభజనలో ఏర్పడ్డ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మొట్టమొదటి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టించాడు... నాడు కాంగ్రెస్ ..బిజెపి ..వేరువేరుగా .టిఆర్ఎస్ పొత్తు ద్వారా పోటీ చేసినప్పటికీ ప్రజలు మాత్రం వైయస్సార్ అనుంగశిష్యుడుగా ఉన్న కూనశ్రీశైలంగౌడ్ను  గెలిపించారు. 2009లో ఇండిపెండెంట్గా గెలిచి నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్ అనుబంధ సంఘ సభ్యునిగా కొనసాగారు. వైయస్సార్ కు నమ్మినబంటుగా ఉంటూ పాదయాత్ర చేస్తున్న క్రమంలో మొత్తం అన్ని తానై చూసుకున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీసీ నాయకునిగా గుర్తింపు పొందిన కూన శ్రీశైలం గౌడ్ ప్రజాబలం ఉన్న నాయకుడు. దీంతో బీజేపీ శ్రేణులు అతనిపై గత సంవత్సర కాలంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆది నాయకుల నుండి ఒత్తిడి తెచ్చారు. పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన ఇంతవరకు కొత్త వ్యక్తిని నియమించకపోగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మూలంగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలిసింది.

అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

 అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

హరితహారం మొక్కలను తిన్న మేకలకు జరిమానా..

మొక్కలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఏ శిక్ష వేయాలో..?



మొక్కలకు ట్రీగార్డులు ఉన్నాయా..ఉంటె మేకలు తినే అవకాశం ఉంటుందా..

అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే జరిమానాలు..? 

మూగజీవాల పట్ల ఏవిధంగా వ్వవహరిస్తున్నారో ఈ అధికారులను చూసి నేర్చుకోవాలా..?

ఉన్నతాధికారుల మెప్పు పొందటానికే ఈ చర్యలా..?

కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటె ఇదేనేమో..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్

దుండిగల్ మున్సిపల్ అధికారుల వ్యవహారశైలి ఈ మధ్య చిత్ర విచిత్రంగా తయారౌతుంది. హారితహారం మొక్కలను తిన్నందుకు మేకలకు 100/- రూపాయల జరిమానా విధించారు.. మరి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఎలాంటి   శిక్ష వేయాలో అని పలువురు జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.. నిర్వహాణ సరిగ్గాలేక ఎండిపోయిన మొక్కలు దుండిగల్ మునిసిపాలిటీ లో కోకొల్లలు.. అవకాశం దొరికింది కదా అని.. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే  మేకలు తిన్నాయని చెప్పుకోవడానికి రికార్డు కోసం ఇదంతా చేస్తున్నారని జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు.. 



వివరాల్లోకి వెళితే శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచంపల్లి సాయిపూజ కాలనీకి చెందిన నవాజ్ కు సంభందించిన  మేకలు మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై అక్కడక్కడ హరితహారంలో నాటిన మొక్కలను తిన్నాయని మున్సిపాలిటీ సిబ్బందికి కోపం వచ్చింది. ఇక అంతే మొక్క తిన్న మేకకు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ చేసి మరీ జరిమానా విధించారు.. మరి మిగతా మొక్కలకు కనీసం ట్రీ గార్డులు కూడా వేయకుండా  గాలికి వదిలేశారు. మొక్కలకు ఎలాంటి ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదు..అలాంటి మొక్కలు కనిపించగానే మూగజీవాలైన మేకలు తిన్నాయని యజమాని "నవాజ్" కు 100 రూపాయలు జరిమానా విధించారు.. 


టెక్నాలజీతో పోటీపడుతూ ముందుకెళ్తున్న మానవులే మతిస్థిమితం లేక వ్యవహరిస్తుంటారు.. అలాంటిది నోరులేని మూగజీవివులకు జరిమానాలు విధించి దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు తమ సత్తాను చాటుకుంటున్నారు.. అక్రమనిర్మాణాలపై ఎన్ని సార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా దున్నపోతుపై వర్షంపడ్డ చందంగా స్పందించని మున్సిపల్ అధికారులు.. ఇలాంటి  విషయాలలో మాత్రం చాలా తొందరగానే చర్యలు తీసుకోవడం కొసమెరుపు...

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...