Followers

పార్టీ బలోపేతానికి కృషి

 పార్టీ బలోపేతానికి కృషి

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యం ప్రమోద్ రెడ్డి

గ్రామ గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు.. 

ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు కార్యకర్తలు



 బేలా (అదిలాబాద్), పెన్ పవర్ 


 టిఆర్ఎస్ పార్టీని  మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్యం ప్రమోద్ రెడ్డి అన్నారు. శనివారం  మండలంలోని పోనాల గ్రామంలో చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలో లేనటువంటి ప్రాధాన్యత టిఆర్ఎస్ పార్టీలో లభిస్తుందని, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల జీవిత బీమా లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసుకునేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అవినాష్ రావు, అమూల్, శాశికాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తాం

అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తాం 



 గూడెం కోత్తవీధి, పెన్ పవర్ 

మండల కేంద్రమైన గూడెం కోత్తవీధి పంచాయతీ, మారుమూల గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తుమని కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కొర్రా సుభద్ర ధీమా వ్యక్తం చేశారు, సుభద్రని పెన్ పవర్ విలేఖరి ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు, ఈ సందర్భంగా సర్పంచ్ కొర్రా సుభద్ర మాట్లాడుతూ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీగా గూడెం కోత్తవీధి ఉందని గత పలుకుల హయాంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమైనట్లు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తెలుస్తోందన్నారు, మండల కేంద్రమైన పంచాయతీ కేంద్రంలో ప్రజలు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారన్నారు, వీరందరికీ అవసరమైన డ్రైనేజీ, ఇంటింటికి కొల్లాయిలు, కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు, ముఖ్యంగా పంచాయతీ పరిధిలో చిన్న చిన్న మారుమూల గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయని అన్ని చోట్ల అందరికీ అవసరమైన తాగునీరు, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు,ఇతర వసతులు కల్పించి మండలంలోనే ఆదర్శంగా నిలవాలన్నదే తమ ధ్యేయమన్నారు, మండల కేంద్రంలో డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లు పై నిత్యం మురుగు నీరు ప్రవహించి అపరిశుభ్రంగా ఉంటోందన్నారు, ఇక్కడ చేపడుతామన్నారు, అలాగే వీధుల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీలు, తాగునీరు, నిత్యం వీధి లైట్లు వెలిగేలా సంబంధిత అధికారులకు తెలుపుతామన్నారు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో సర్పంచ్ పీఠం ఎక్కే అవకాశం వచ్చిందని అన్ని విధాలా అభివృద్ధి చేసి వారి రుణం           తీర్చుకుంటానన్నారు,అలాగే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సహకారంతో ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు

కలియుగ వైకుంఠ వాసుని దర్శనార్ధమై బారులు తీరిన భక్తులు

 కలియుగ వైకుంఠ వాసుని దర్శనార్ధమై బారులు తీరిన భక్తులు



ఆత్రేయపురం, పెన్ పవర్ 

 ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వెలిసిన శ్రీ అలివేలుమంగ  పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ  ఈ ఆలయనికి  ఒక విశిష్టత ఉంది వెంకన్న కు శనివారం పర్వదినం వెంకన్న దర్శనానికి 7 శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతారని భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక ప్రగాఢ నమ్మకం ఈ సన్నిధిలో స్వామివారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది.దూర ప్రాంతాల నుండి కాళ్ళ నడకతో వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్ర సమయానికి ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది ఆ భక్తులకు భోజన వసతులు కల్పించి వారు  సేద  తీర్చుకునే విధంగా ఏర్పాట్లు చేశారు   



 స్వామివారి దర్శనానికి ఉదయం నుండే క్యూలైన్లలో నిలబడిన ఆ వైకుంఠ వాసుని  దర్శన భాగ్యం పొందడానికి  గోవిందా  గోవిందా అని నామ స్వరం తో ఆలయమంతా మారుమోగుతుంది.



మాధవసేవగా మానవ సేవ చేయాలి

 మాధవసేవగా మానవ సేవ చేయాలి 

వేడుకగా విశ్వశాంతి సనాతన సత్సంగ వార్షికోత్సవం 



అనపర్తి, పెన్ పవర్ :

  సమాజంలో ప్రతి మానవుడు భగవంతుని పట్ల శ్రద్ధ, భక్తి , విశ్వాసం కలిగి ఉంటూ భగవత్ సేవతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టెలిఫోన్ గురుస్వామి అన్నారు. అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో  శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద  విశ్వశాంతి సనాతన సత్సంగ 22వ వార్షికోత్సవ వేడుకలు సత్సంగ వ్యవస్థాపకులు టెలిఫోన్ గురుస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎన్. ఆర్. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తాడి సతీష్ రెడ్డి, శ్రీమతి సుమదివిజ దంపతులు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పొలమూరు గ్రామ సర్పంచ్ గుడాల ధనలక్ష్మి వెంకట్రావు దంపతులను, వైస్ ప్రెసిడెంట్ సత్తి సూరారెడ్డి,వెంకటరెడ్డి లను సత్సంగ అధినేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడి లచ్చారెడ్డి గిరిబాల, తాడి సత్యనారాయణ రెడ్డి పార్వతి, గొలుగూరి సత్తిరెడ్డి అనిత, గొలుగూరి విజయలక్ష్మి, మల్లిడి  వీర్రాఘవరెడ్డి, సత్తి వీర్రాఘవరెడ్డి, మల్లిడి నాగిరెడ్డి, సత్తి కనకారెడ్డి,వనములు తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ పై అపోహలొద్దు...

 కొవిడ్ వ్యాక్సిన్ పై అపోహలొద్దు... ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి



అనపర్తి, పెన్ పవర్ :

 తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు శనివారం రెండో విడత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అపోహలకు పోవద్దని తెలియచెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ 19 ఇప్పటికీ  తన ప్రభావం చూపుతూనే ఉందని కావున ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం కూడదని ఆయన సూచన చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తమకు ఏ విధమైన దుష్పరిణామాలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే వెల్లడించారు.

తాళ్ళపూడి పి హెచ్ సి లో కరోన వ్యాక్సిన్ 2 వ డోస్

 తాళ్ళపూడి పి హెచ్ సి లో కరోన వ్యాక్సిన్ 2 వ డోస్

తాళ్ళపూడి, పెన్ పవర్

తాళ్ళపూడి పి హెచ్ సి లో కరోన వ్యాక్సిన్ మొదటిసారి వేయించుకున్న వారికి 2 వ డోస్ కూడా  వేయడం జరుగు తోందని డాక్టర్ రమణ నాయక్ తెలిపారు. దీనిలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్, మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, తదితరులు శనివారం వేయించుకోవడo జరిగింది. రోజుకి 100 మందికి వేయడం జరుగుతుందని తెలిపారు.

రైతు భరోసా కేంద్రంలో రబీ సీజన్ కు అవసరమైన శిక్షణ

 రైతు భరోసా కేంద్రంలో రబీ సీజన్ కు అవసరమైన శిక్షణ



తాళ్ళపూడి, పెన్ పవర్,  

వైయస్సార్ ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా వరి మరియు మొక్కజొన్న పంటలు తాళ్ళపూడి మండలంలో సెలెక్ట్ అయ్యాయి. దానిలో భాగంగా శిక్షణా కార్యక్రమం 

మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎఓ జి.రుచిత అధ్యక్షతన శనివారం జరిగింది. ఎయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ సహాయకులు, ఉద్యానవన సహాయకులకు రబీ సీజన్ విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన శిక్షణ అందించారు. వరి మరియు మొక్కజొన్న యూనిట్ నంబర్లు, రాండమ్ నంబర్లు వారికి అందించి, వారు ఫారాలు ఎలా పూర్తిచేయాలని కూలంకషంగా వివరించడం జరిగింది. ఏ ఇబ్బందులు ఉన్న వ్యవసాయ అధికారిని దృష్టికి తీసుకురావాలని, ఏ పంట నష్ట పోకూడదని, ప్రయోగాలు పారదర్శకంగా ఉండాలని, భాద్యతగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు. ఎఒ జి.రుచిత మాట్లాడుతూ ఈ వారంలోపే ఫారం 1 లను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఎలు, విహెచ్ఎలు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...