ఐ. సి. డి.ఎస్ అంగన్ వాడి స్టాఫ్ కు కోవిడ్ వ్యాక్షిన్
వి. ఆర్. పురం. పెన్ పవర్వి ఆర్ పురం మండలంలో ఉన్నా ఐ సి డి ఎస్ అంగన్ వాడికి సంబంధించినా టీచర్లకు,ఆయాలకు,శుక్రవారం రేఖపల్లి,మరియూ జిడిగుప్ప పి హెచ్ సి కేంద్రాలలో సుమారు వందమందికి కోవిడ్ వ్యాక్షిన్ లను చేసారు. ఈ కోవేక్షన్ అనేది ఇంతకముందు కోవిషిల్డ్ ఏక్షన్ వేయించుకున్నా వారికి మాత్రమే చేస్తాము అంటూ, ఈ వేక్షన్ వేయించుకున్నావారు ఇరవై ఎనిమిది రోజులు తరువాత మరల రెండోవ సారి ఇదే వేక్షన్ వేయించుకోవాలి.ఈ విధముగా మండలంలో ఉన్న రివెన్యూ,యండిఓ, పోలీసుశాఖ, ఫారెస్ట్ ,ఇలా అన్ని డిపార్ట్మెంట్ లకు ఈ వేక్షన్ తప్పనిసరిగా వేస్తాము అని రేఖపల్లి పి హెచ్ సి అధికారి డాక్టర్ సందీప్ నాయుడు మీడియాకు తెలిపారు . ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శ్రీనివాస్ రావు,అంగన్ వాడి సి డి పి ఓ శంషాద్ బేగం,ఏ ఎన్ యం లు, తదితరులు పాల్గొన్నారు.