లంక ప్రాంతాల్లో మట్టి త్రవ్వకాలను అరికట్టాలి
కడియం మట్టి త్రవ్వకాలను కండిస్తున్న పలువురు అధికార పార్టీ నేతలు లంక భూముల్లో మట్టి రవాణా నిలువరించాలి....
సహజ వనరులను పరిరక్షించి రైతులను ఆదుకోవాలి...
జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీ సభ్యులు కందుల దుర్గేష్..
ఆలమూరు, పెన్ పవర్
కడియపులంక కు బంగారు మణిహారం లంకభూమి.పూలతోటలు, కూరగాయలు, మొక్కల తో పచ్చ'ధనం' సిరిసిల్లే చక్కని భూములవి.అటువంటి భూముల్లో మట్టిత్రవకాలకు ప్రభుత్వం ఎలా అనుమతించిందని జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీ సభ్యులు కందుల దుర్గేష్ ప్రశ్నించారు. లంక ప్రాంతాల్లో మట్టి త్రవ్వకాలను ఖండిస్తూ జనసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు కడియపులంక లో శుక్రవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. సహజవనరుల దోపిడీ అరికట్టాలని కడియం తాశీల్దార్ భీమరావు కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అరాచక విధానాలకు లంకభూముల్లో మట్టిత్రవ్వకాలు పరాకాష్ట అన్నారు. మట్టి త్రవ్వకాలకు అనుమతి పొందిన 147 సర్వే నెం. రెవెన్యూ అధికారుల చే వివాదాస్పద భూమిగా రెడ్ మార్క్ చేయబడిందన్నారు.తాశీల్దార్ నిరభ్యంతర పత్రం ఇవ్వకుండా పర్యావరణ అనుమతులు లేకుండా మైన్స్ అధికారులు ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారంటే వెనుక ఎవ్వరున్నారో అర్ధం చెసుకోవచ్చన్నారు.నదీ గర్భం లో ఈ మట్టి తవ్వకాల వల్ల త్రవ్విన భూములతో పాటు ఒడ్డున ఉన్న భూములు వరదలకు కొట్టుకుపోయి సహజత్వం దెబ్బతింటుందన్నారు. తాత్కాలిక అనుమతులపై పరిమిత క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వకాలకు అనుమతిపొంది నాలుగు యంత్రాలతో నిత్యం వందల లారీల్లో వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించుకుపోతున్నా పట్టించుకొనే అధికారి కరువయ్యారన్నారు.ప్రశించిన రైతులను పోలీసులచే బెదిరిస్తున్నారని దుర్గేష్ తెలిపారు.ఈ దోపిడీ అపకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, కడియపులంక సర్పంచ్ మార్గాని అమ్మాణిఏడుకొండలు, కడియపు సావరం సర్పంచ్ చెక్కపల్లి మురళి కృష్ణ, మాజీ సర్పంచులు గట్టి నరసయ్య,పుల్లా రామారావు, ఉప సర్పంచులు వెలుగుబంటి రఘురామ్, పాటంశెట్టిరాంజీ, రత్నం అయ్యప్ప,తిరుమలశెట్టిబాబు,పాటంశెట్టి ప్రకాశం,పలువురు జనసేన, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు