ఎన్నికల సందర్భంగా ర్యాలీ గ్రామ వీధుల్లో పోలీసులు కవాతు
ఆత్రేయపురం, పెన్ పవర్
ఆత్రేయపురం మండలంర్యాలీ గ్రామంలో 21 న జరగబోయే స్థానిక ఎన్నికలునాలుగో దశ కావడంతో స్థానిక నాయకులు ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు ఈ నేపథ్యంలో ఆత్రేయపురం మండలం లో అతి పెద్ద గ్రామం పంచాయతీ అయినా ర్యాలీ లో శాంతి భద్రత దృశ్య ఆత్రేయపురం ఎస్ ఐ జి.నరేష్ నేతృత్వంలో 100 మంది పోలీసు బలగాలతో శాలిగ్రామం మెయిన్ రోడ్డు అయినా జగన్మోహిని కేశవ స్వామి ఆలయం నుండి పోలీసులు కవాతు నిర్వహించారు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు చర్యగా ప్రజల అందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ కవాతు నిర్వహించామని ఎస్సై నరేష్ పేర్కొన్నారు