రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం
వీ.ఆర్.పురం. పెన్ పవర్
వీ.ఆర్.పురం మండలం రాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం పనులను మండల వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పి.మండల కన్వీనర్ గోపాల్ మాట్లాడుతూ గతప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పెరుగాచూపించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ముంపుతో సంబంధం లేకుండా ఇక్కడ నుండి నిర్వాసితులు వెళ్ళేఅంతవరకు వీరికి అన్ని సధుపాయలు కల్పించానే ఉదేశం మన నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ ధనలక్ష్మి డి.సి.సి.బీ చైర్మన్ అనంతబాబు ఇద్దరూ ముంపుమండలల్లో ఉన్న సమస్యలను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆయన స్పందించి వీ.ఆర్.పురం మండలం రాజుపేట కాలనిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్ర ఆరోగ్యకేంద్రం అంచనా విలువ ఎనభై లక్షల రూపాయలతో మండల ప్రజల కొరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంపుమండలల్లో లక్షల కోట్ల రూపాయలతో సి.సి.రోడ్లు,డ్రైనేజీలు నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి.మండల యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచర్ల గంగులు, మామిడి రమణ,మాదిరెడ్డి సత్తిబాబు, ముత్యాల మురళి, కడుపు రమేష్, గణిత్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.