Followers

స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు










స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంచొద్దు


 


అనకాపల్లి , పెన్ పవర్


 
 

 ప్రభుత్వం స్థిరాస్తుల  మార్కెట్ విలువలు పెంచే  నిర్ణయం  ప్రస్తుత పరిస్థితి లో సరికాదని  బి ఎస్ పి  అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాల రావు కోరారు.  అసలే కరోనా ఆందోళన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు చాలా మందకొడిగా సాగుతున్నవి రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదించినదనారు. ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ విలువలు పెంచడం వలన రిజిస్ట్రేషన్లు మరింత తక్కువ జరుగుతాయని అంతే కాదు  మార్కెట్ విలువలు పెరుగుదలను ద్రుష్టి లో ఉంచుకోని క్రయ విక్రయ దారులు రిజిస్ట్రేషన్ లు చేయించుకునేటందుకు ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ కార్యాలయములకు రావడం జరుగుతుందన దాని వలన కరోనా వ్యాధి ప్రమాదం మరింత పెరిగే ప్రమాదం ఉందనారు.  మరియు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు తో ఉన్న ప్రజలు  ముఖ్యంగా క్రయ విక్రయ దారులు మీద భారం పెరిగే విధంగా ఉన్న మార్కెట్ విలువలు పెంపు నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.


 

 




 




 



 



 



 లాల్  సలామ్


 లాల్  సలామ్

 నేటి నుంచే మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు
మన్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు

చింతపల్లి, పెన్ పవర్




జజ్జనకరి జనారే డప్పుల దరువులు... ఉత్తేజపరిచే ఎర్రదండు విప్లవ గీతాలు...  తుపాకీ నీడన అమర వీరులకు అర్పించే జోహార్లు... చైతన్యం నింపే ప్రసంగాలు... ఇవీ ఎరుపెక్కిన మన్యంలో వారం రోజులపాటు మావోయిస్టులు నిర్వహించే వారోత్సవాల విషయాలు...
ప్రతీ ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీలో పని చేసి అసువులు బాసిన వారి పేరుతో నాటి సి పి ఐ (ఎంఎల్) నేటి మావోయిజం, నక్సల్బరీ పితామహుడు         చారు మజుందార్ మృతి చెందిన తేదీని స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తారు. నక్సల్బరీ చావలేదు... దానికి చావు లేదంటూ నాటి నక్సల్స్ నుంచి నేడు పేరు మార్చుకున్న మావోయిస్టుల వరకు అదే నినాదంతో పోరాటాలు చేస్తూ వస్తున్నారు. పోలీస్ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ స్థూపాలు నిర్మించి ఎర్ర జెండాల రెపరెపల మధ్య 1972 జూలై 28 నుంచి నేటి వరకు ఆ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తూ వస్తున్నారు. మావోయిజానికి చావు లేదనే నినాదాన్ని పాటిస్తూ ఈ సమయంలోనే కొత్తవారిని దళంలో చేర్చుకొని శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే యాక్షన్ టీంలు రంగ ప్రవేశం చేస్తాయి. పోలీసులను పక్కదోవ పట్టించి మరీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు.గాలింపు చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లోనే మృతిచెందిన మావోయిస్టులకు స్థూపాలు (తాత్కాలికంగా) నిర్మిస్తారు. మారుమూల గ్రామాల్లో యువతను చైతన్య పరచి సమావేశాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. వారోత్సవాలు మరింత ఉత్సాహంగా సాగడానికి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఏవోబీ లోని దళ సభ్యులు కూడా పాల్గొంటారు.ఈ దఫా ఏవోబీ, విశాఖ ఏజెన్సీలోని వారోత్సవాలకు కేంద్ర కమిటీ మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ రామకృష్ణ( ఆర్ కె), ఏవోబీ కార్యదర్శి చలపతి, అరుణ, ఉదయ్, జగన్ వంటి నాయకులు హాజరై ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 22 న, జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్ కె తప్పించుకోగా చలపతి, అరుణ గాయపడినట్లు తెలిసింది. వారు విడిచి వెళ్ళిన రైఫైల్,కిట్ బ్యాగులు పోలీసులు గుర్తించి, స్వాధీనపరుచుకున్నారు.25న, జరిగిన ఎదురు కాల్పుల్లో ముఖ్య మావోయిస్టు నాయకులు తప్పించుకోగా ఒక మావోయిస్టు మృతి చెందాడు.మావోయిస్టులు జరిపే ఈ వారోత్సవాల వలన వారం రోజుల పాటు గిరిజన ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఏజెన్సీ ప్రాంతంలోని పలువురు రాజకీయ నాయకులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు.లాల్ సలాం అంటూ సిపిఐ మావోయిస్టు జరిపే కార్యక్రమాలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వారం, పది రోజుల పాటు భయానక వాతావరణంలో గడపవలసిందేనని ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 

 

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం



విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.


 


       


విశాఖపట్నం,పెన్ పవర్


 

విశాఖ నగరం లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో సోమవారంమధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది.విమానాశ్రయం సమీపంలోని షీలనగర్ సిఎస్ఎస్కంటైనర్ యార్డులో మంటలు ఎగిసిపడడంతోస్థానికులు అధికారులకు సమాచారం తెలియజేశారు.హానికర రసాయనం అల్యూమినియం ఫ్లోరిడే క్యాచ్లుద్వారా వ్యాపిస్తున్న ఎగిసిపడుతున్న మంటలనుఅగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు. ఈ ప్రమాదం లో నాలుగు కంటైనర్ లు కాలిపోయాయి.రసాయన ‌అగ్నిప్రమాదంపై నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ సాయినర్  ఎట్రొడ్రగ్స్ ఇప్పుడు అల్యూమినా అంగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కు గురిచేస్తుంది.

కరోనా పరీక్ష కేంద్రాలు


ఏజెన్సీ 11 మండలాల్లో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 


 


సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య పడాల్.


 


 చింతపల్లి , పెన్ పవర్


 

విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. సోమవారం వామపక్ష రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు సీపీఐ, సిపిఎం నాయకులతో చింతపల్లి గ్రామ సచవాలయం ఎదురుగా ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయలేకపోవడంతో గత్యంతరం లేని ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం (లాక్ డౌన్) పాటించవలసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. ఐసోలేషన్ కేంద్రాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడించాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు,పట్టణాల్లో మునిసిపాలిటీ, పారిశుద్ధ్య కార్మికులకు పీ పీ కిట్లు, శానిటైజర్ లు రక్షణతో కూడిన భద్రత పరికరాలు ప్రభుత్వాలు వెంటనే అందించాలన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు, కుటుంబానికి నెలకు రూ. 7,500 లు, 6 నెలల పాటు అందించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల  నాయకులు ఎస్ కె రహీమాన్, (బుజ్జి ) మాజీ వైస్ సర్పంచ్ గింజారి రమణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దళ సభ్యుల ప్రాణాలు బలి





అభివృద్ధి నిరోధకులు మావోయిస్టు లు


 


అగ్ర నాయకుల ప్రాణాలకు దళ సభ్యుల ప్రాణాలు బలి


 


ఏ ఎస్ పి  విద్యాసాగర్  నాయుడు


 


చింతపల్లి, పెన్ పవర్


 

జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నవరం పోలీస్ పరిధి       ఏ ఓ బి లోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా  తారసపడిన మావోయిస్టులు ముందుగా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఒక మావోయిస్టు  మృతిచెందాడని  చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏ ఎస్ పి విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ కోరుకొండ,పెదబయలు దళ సభ్యులు,మిలీషియా సభ్యులతో మావోయిస్టు అగ్ర నేతలు  ఏవోబీ లోని దిగజనబ అటవీ ప్రాంతంలోని పెద్ద వాగు వద్ద సమావేశం అవుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఒడిస్సా ప్రత్యేక పోలీస్, జిల్లా ప్రత్యేక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించారన్నారు.  దిగజనబ ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులపై మావోయిస్టులు  కాల్పులు ప్రారంభించారన్నారు.ఆత్మ రక్షణార్థం పోలీసులు నిర్వహించిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు.చీకటి పడడంతో 26 ఉదయం మృతదేహం లభ్యమయ్యిందన్నారు. మృతిచెందిన మావోయిస్టు జి.మాడుగుల మండలం, వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి దయ అలియాస్ పేతురు గా గుర్తించామన్నారు. ఐదేళ్ల నుంచి దళంలో తిరుగుతున్నాడన్నారు. మృతిచెందిన మావోయిస్టు సోదరుడు(అన్న) కూడా గతంలో రామ్ గూడ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడన్నారు. మరి వారి కుటుంబ సభ్యులకు దిక్కెవరని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు మావోయిస్టులకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఎప్పుడూ అమాయకులైన దళ సభ్యులే మృతి చెందుతున్నారన్నారు. అగ్ర నేతలు అమాయకులైన వీరిని అడ్డం పెట్టుకుని,వారి ప్రాణాలు కాపాడుకుంటూ తప్పించుకుంటున్నారన్నారు. మావోయిస్టులు వారోత్సవాల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటూ, గిరిజన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.గిరిజనులకు రహదారులు, పాఠశాలలు,సెల్ టవర్లు, భవనాలు అడ్డుకుంటూ అభివృద్ధికి అవరోధకులుగా మిగిలారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం కూంబింగ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు హింసను విడనాడి, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవమని ఆయన హితవు పలికారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు వచ్చేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.


 

 




 మూడువేల లీటర్ల సారా


 మూడువేల లీటర్ల సారా పులుపు ద్వంసం


  పాయకరావుపేట,పెన్ పవర్ 


 

 మండల గోపాలపట్నం శివారు కొండల్లో సారా తయారు కేంద్రాలపై పోలీసులు దాడి చేసి తయారి సామాగ్రిని ద్వంసంచేసారు.సారా దాడులపై ఎసై .విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం నక్కపల్లి మండలం గునిపూడి,స్తానిక మండల గోపాలపట్నంను ఆనుకోనివున్న సరిహద్దు కొండ ప్రాంతంలో సారా తయారి కేంద్రాలను గుర్తించినట్లు గ్రామ వాలంటరిలు,గ్రామ మహిళా పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు స్టేషన్ సిబ్బందితో దాడులు నిర్వహించాము.కార్బైల్లో నిల్వవుంచిన  మూడువేల లీటర్ల సారా పులుపును తయారీకి ఉపయోగించే సామగ్రి,అమ్మోనియా,నల్లబెల్లంను ద్వంసం చేసామని తెలిపారు.అదేవిదంగా ప్రతీ పౌరుడు బాద్యతతో మండలంలో అక్రమంగా జరిగే సారా తయారికేంద్ర ప్రదేశాలను గుర్తించి సమాచారం అందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో గోపాలపట్నం గ్రామ వాలంటరీలు,గ్రామ మహిళా పోలీసు,సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ


కరోనా పై పరవాడ జనసైనికుల పోరాటం.
స్వయంగా వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ.


           


 పరవాడ, పెన్ పవర్



పరవాడ : కరోనా పై పోరాటానికి  పరవాడ జనసైనికులు నడుం బిగించారు. స్వయంగా జనసైనికులు భుజాలకు హైపో క్లోరైడ్ ద్రావణ డబ్బాలను తగిలించుకొని గ్రామ పురవీధుల్లో ఆదివారం ఉదయం పిచికారి చేసి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం భయపడకుండా గ్రామ పురవీధుల్లో క్రిమిసంహారక మందును స్వయంగా స్ప్రే చేయడంపై పలువురు జనసైనికుల పై ప్రశంసల  కురిపిస్తున్నారు. పరవాడ గ్రామంలో జనసైనికులు శెట్టి బలిజ, రజక వీధి, సిరిపురపు వారి వీధి, చుక్క వారి వీధి, శివాలయం రోడ్డు చేలల్లో ఇళ్లలు, ముస్లిం వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారి చేసారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగు, కరెడ్ల అభిరామ్, వడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, మెకానిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...