Followers

 మూడువేల లీటర్ల సారా


 మూడువేల లీటర్ల సారా పులుపు ద్వంసం


  పాయకరావుపేట,పెన్ పవర్ 


 

 మండల గోపాలపట్నం శివారు కొండల్లో సారా తయారు కేంద్రాలపై పోలీసులు దాడి చేసి తయారి సామాగ్రిని ద్వంసంచేసారు.సారా దాడులపై ఎసై .విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం నక్కపల్లి మండలం గునిపూడి,స్తానిక మండల గోపాలపట్నంను ఆనుకోనివున్న సరిహద్దు కొండ ప్రాంతంలో సారా తయారి కేంద్రాలను గుర్తించినట్లు గ్రామ వాలంటరిలు,గ్రామ మహిళా పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు స్టేషన్ సిబ్బందితో దాడులు నిర్వహించాము.కార్బైల్లో నిల్వవుంచిన  మూడువేల లీటర్ల సారా పులుపును తయారీకి ఉపయోగించే సామగ్రి,అమ్మోనియా,నల్లబెల్లంను ద్వంసం చేసామని తెలిపారు.అదేవిదంగా ప్రతీ పౌరుడు బాద్యతతో మండలంలో అక్రమంగా జరిగే సారా తయారికేంద్ర ప్రదేశాలను గుర్తించి సమాచారం అందిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో గోపాలపట్నం గ్రామ వాలంటరీలు,గ్రామ మహిళా పోలీసు,సిబ్బంది పాల్గొన్నారు. 

 

 

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ


కరోనా పై పరవాడ జనసైనికుల పోరాటం.
స్వయంగా వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ.


           


 పరవాడ, పెన్ పవర్



పరవాడ : కరోనా పై పోరాటానికి  పరవాడ జనసైనికులు నడుం బిగించారు. స్వయంగా జనసైనికులు భుజాలకు హైపో క్లోరైడ్ ద్రావణ డబ్బాలను తగిలించుకొని గ్రామ పురవీధుల్లో ఆదివారం ఉదయం పిచికారి చేసి గ్రామస్తులు చేత శభాష్ అనిపించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం భయపడకుండా గ్రామ పురవీధుల్లో క్రిమిసంహారక మందును స్వయంగా స్ప్రే చేయడంపై పలువురు జనసైనికుల పై ప్రశంసల  కురిపిస్తున్నారు. పరవాడ గ్రామంలో జనసైనికులు శెట్టి బలిజ, రజక వీధి, సిరిపురపు వారి వీధి, చుక్క వారి వీధి, శివాలయం రోడ్డు చేలల్లో ఇళ్లలు, ముస్లిం వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ పిచికారి చేసారు. ఈ కార్యక్రమంలో చుక్కా నాగు, కరెడ్ల అభిరామ్, వడిసెల రాము సన్నాఫ్ బంగారు బాబు, మెకానిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి


ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి


 పెందుర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకటరమణ


         


   పరవాడ పెన్ పవర్


 

పరవాడ:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ(రామ్ కీ ఫార్మాసిటీ) లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా ప్రజలు బయ బ్రాoతులతో జీవిస్తున్నారు అని అందుకు ఫార్మాసిటీ చుట్టు ప్రక్కల గ్రామాలను తరలించండి లేదా వారికి హాని కలగ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని పెందుర్తి బీజేపీ కన్వీనర్ బొద్ధపు వెంకట రమణ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కి స్పoదన కార్యక్రమంలో ఎమ్యెల్సి మాధవ్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం వేoకటరమణ మాట్లాడుతూ ఫార్మాసిటీ దగ్గరలో అనేక గ్రామాలు ఉన్నాయి అని ఫార్మా పొల్యూషన్ వలన ఈ గ్రామాల్లోని ప్రజలు అనేక రుగ్మతలకు లోనవుతున్నారు అని అన్నారు.గుండె,ఊపిరితిత్తుల వ్యాధులు,కిడ్నీ సమస్యల తో భాధపడటమే కాకుండా కొందరు మృతి చెంది కూడా ఉన్నారు అని తెలిపారు.ఇప్పటికే విశాఖ జిల్లా పలు ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్,ఎన్టీపీసీ,ఫార్మాసిటీ,బ్రాన్డిక్స్,లాంటి కంపెనీల కాలుష్యం వలన ఆ చుట్టుప్రక్కల నివసిస్తున్న అనేక మంది మహిళలు,చంటి పిల్లలు అవస్థలు పడుతున్నారు అని అన్నారు.ఇదే కాకుండా అనేక రకాలు అయిన ఫార్మా విష రసాయనాలు,వ్యర్ధాలు సముద్రంలోకి వదిలివేయడం వలన సముద్రం లోని మత్యు సంపద పూర్తిగా నాశనం అయి మాత్యుకారుల మనుగడకే ప్రమాద ఏర్పడింది అని అన్నారు.ఇటు ఫార్మా,ఎన్టీపీసీ లాంటి వాటి వాయు కాలుష్యం వలన ఈ ప్రాతంలో వర్ష ప్రభావం తగ్గిపోవడం వలన ఈ ప్రాంతాల్లో వ్యవసాయమే జీవన ఆధారంగా బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు వ్యవసాయం లేక రోడ్డున పడ్డారు అని అన్నారు.ఈ ప్రస్థితుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించ లేదు అని తమరు అయినా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి తో మాట్లాడి ఈ చుట్టు ప్రక్కల గ్రామాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని కలెక్టర్ వినయ్ చంద్ ని కోరుతూ వినతిపత్రం ఇచ్చాము అని వెంకటరమణ తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం





ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం.

     

విశాఖపట్నం, పెన్ పవర్

 

 

విశాఖలో  సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.మదురవడా సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యు న్నత స్థాయిలో సీఆర్పీఎఫ్ పాలమిలాటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సీఆర్పీఎఫ్ .. విపత్కర పరిస్థితుల్లో, రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది.82వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సీఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు.

 

 




జిల్లాలో బ్యాంకులు1గంట వరకే




జిల్లాలో బ్యాంకులు1గంట వరకే పనిచేస్తాయ్..
     


జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
   


  విశాఖపట్నం, పెన్ పవర్


 

జిల్లాలోని బ్యాంకులు  మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తాయని  జిల్లా కలెక్టర్  వి వినయ్ చంద్  అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉదృతం అవుతున్న సందర్భంగా బ్యాంకు ల  పని వేళలను తగ్గించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తా అన్నారు.  పైలట్ ప్రభుత్వ రంగ బ్యాంకులు  పని వేళలు మార్పు చేయాలని బ్యాంక్ యూనియన్ లో కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.  మంగళ వారం నుంచి  బ్యాంకుల పనివేళలో మారుతున్నాయని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలు తప్పక పాటించాలని బ్యాంకర్లను కోరడం జరిగిందన్నారు. బ్యాంకుల పనివేళల్లో తగ్గించడం వల్ల ఖాతాదారుల  రద్దీ తగ్గుతుందని  వినయ్ చంద్ తెలిపారు.

 

 




మావోయిస్టులు మృతి



ఏవోబీలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు.
మావోయిస్టులు మృతి. మృతుడు జి.మాడుగుల వాసి.
మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు  అటవీ ప్రాంతంలో కాల్పులు.

            


విశాఖపట్నం, పెన్ పవర్



  ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో  పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో  మావోలు  విడిచిన 3 కిట్ బ్యాగులు 303 రైఫిల్  మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28నించి ఆగస్టు3 వరకు  అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. మావోల ప్లీనరీ చెదించడానికి విశాఖ గ్రేహౌండ్స్ ఒడిశా ఎస్ వో జి  బలగాలు శనివారం సాయంత్రం  మల్కనగిరి జిల్లా గుజ్జేరు  అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా  మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు తలెత్తాయి. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర  తుపాకీల పోరు జరిగింది. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి కావడంతో మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు జి. మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా  పోలీసులు గుర్తించారు. 2016 లో జరిగిన రామ్ గూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దోసో సోదరుడు దయా. అక్క మృతిచెందడంతో మావోయిస్టుల్లో చేరాడు. ఈ పది రోజుల్లో  ఏవోబీ పరిధిలో నాలుగు  దఫాలు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ డివిజన్  కార్యదర్శి అరుణ చల పతి  అగ్రనేత ఆర్ కె తప్పించుకున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి  చెందారు. పోలీసులు మావోయిస్టు వ్యూహ ప్రతి వ్యూహాలతో  ఎదురు కాల్పులకు తెగబడుతున్నారు.


 

విస్తృతంగా టెస్ట్ లు







కరోనా నివారణకు విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి


సీపీఎం మండల కన్వీనర్ పి.మాణిక్యం


         


  పరవాడ ,పెన్ పవర్


 

పరవాడ:మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రజలు భయ బ్రాoతులు చెందుతున్నారు అని కరోనా ని నివారించేందుకు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి అని మండల సిపిఎం కన్వీనర్ పి.మాణిక్యం తహశీల్దార్ గంగాధర్ కి వినతిపత్రం అందించారు.అనంతరం మాణిక్యం మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని తగిన్నన్ని కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రపంచంలో కరోనా కేసుల లెక్కల్లో భారత దేశం 2వ స్థానానికి రావడం భారత దేశంలో ఆంద్రప్రదేశ్ 4 వ స్థానంలోకి రావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది అని ఆవిడ అన్నారు.దేశంలో ఈ విధంగా కరోనా కేసులు పెరగటం ప్రభుత్వాల వైఫల్యాలను సూచిస్తోంది అని అన్నారు.కేరళ తరహాలో కరోనా నివారణకు నిధులు కేటాయించి ప్రజలు రోడ్లపైకి రాకుండా వారి ఇళ్లకే నిత్యావసరాలు సరఫరా చేయాలని సూచించారు.కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి కావలిసిన మాస్కలు, పి.పి కిట్లు లాంటి వి నిరంతరాయంగా సరఫరా చేయాలి అని.కరోనా నివారణకు పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు 50 లక్షల వ్యక్తిగత భీమా కల్పించాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు ఏ.రామస్వామి,సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ,సిపిఎం పి.చిన్నా పాల్గొన్నారు.


 

 




 

 



 



 



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...