Followers
ఫార్మా నిర్వాసిత గ్రామాల్ని తరలించండి
ఘనంగా సీ ఆర్పీ ఎప్ ఆవిర్బావ దినోత్సవం
విశాఖలో సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.మదురవడా సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యు న్నత స్థాయిలో సీఆర్పీఎఫ్ పాలమిలాటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సీఆర్పీఎఫ్ .. విపత్కర పరిస్థితుల్లో, రక్షణ పరంగా అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తుంది.82వ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సీఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు.
జిల్లాలో బ్యాంకులు1గంట వరకే
జిల్లాలో బ్యాంకులు1గంట వరకే పనిచేస్తాయ్..
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
విశాఖపట్నం, పెన్ పవర్
మావోయిస్టులు మృతి
ఏవోబీలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు.
మావోయిస్టులు మృతి. మృతుడు జి.మాడుగుల వాసి.
మల్కన్ గిరి జిల్లా గుజ్జేడు అటవీ ప్రాంతంలో కాల్పులు.
విశాఖపట్నం, పెన్ పవర్
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగిన సంఘటనలో మావోలు విడిచిన 3 కిట్ బ్యాగులు 303 రైఫిల్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28నించి ఆగస్టు3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయి. మావోల ప్లీనరీ చెదించడానికి విశాఖ గ్రేహౌండ్స్ ఒడిశా ఎస్ వో జి బలగాలు శనివారం సాయంత్రం మల్కనగిరి జిల్లా గుజ్జేరు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు తలెత్తాయి. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర తుపాకీల పోరు జరిగింది. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రాత్రి కావడంతో మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టు జి. మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన దయాగా పోలీసులు గుర్తించారు. 2016 లో జరిగిన రామ్ గూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పాంగి దోసో సోదరుడు దయా. అక్క మృతిచెందడంతో మావోయిస్టుల్లో చేరాడు. ఈ పది రోజుల్లో ఏవోబీ పరిధిలో నాలుగు దఫాలు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ చల పతి అగ్రనేత ఆర్ కె తప్పించుకున్న విషయం తెలిసిందే. రెండు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. పోలీసులు మావోయిస్టు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎదురు కాల్పులకు తెగబడుతున్నారు.
విస్తృతంగా టెస్ట్ లు
కరోనా నివారణకు విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలి
సీపీఎం మండల కన్వీనర్ పి.మాణిక్యం
పరవాడ ,పెన్ పవర్
ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు
నేటి నుంచి ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీల మధ్య
ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు
మంత్రి బొత్స
విశాఖపట్నం, పెన్ పవర్
ఎయిర్ పోర్ట్ విశాఖ సిటీ మధ్య ఫ్లై ఓవర్ పై మంగళ వారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయనతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఎంపీ సత్యనారాయణలు ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో అధికారులకు తగిన సూచనలు చేశారు. విశాఖ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంమధ్యలో ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు నడుపు కోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశించారు. మర్రిపాలం నుంచి గోపాలపట్నం మధ్యలో ఫ్లైఓవర్ ను ఆగస్టు 15 నా ప్రారంభిస్తామన్నారు. పనులు కొద్దిగా మిగిలి ఉండడంతో వాటిని పూర్తి చేసి ఆరోజున దానాలు రాకపోకలు అనుమతిస్తున్నారు. ఎంతో కాలంగా విశాఖ వాసులను వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య నేటితో తీరిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో అతిపెద్ద ట్రాఫిక్ సమస్య ఎన్ఏడి కొత్త రోడ్ వద్దనే అని అది నేటితో తీరిపోతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరం అయినా చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మంత్రులతోపాటు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుట్టు రట్టు
సృష్టి ఆసుపత్రి కేంద్రంగా వెలుగుచూసిన పసిపిల విక్రయ రాకెట్
గుట్టు రట్టు చేసిన నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా.
ఆస్పత్రి ఎం డి తో ఎనిమిది మంది అరెస్ట్.
పిల్లల సేకరణలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం.
విశాఖపట్నం ,పెన్ పవర్
విశాఖ నగరంలో సృష్టి ఆస్పత్రి కేంద్రంగా జరుగుతున్న పసిపిల్లల విక్రయ రాకెట్‌ను పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా ఆదివారం విలేకరుల సమావేశంలో సృష్టి హాస్పత్రి లో పసిపిల్లల అమ్మకాల గుట్టు రట్టు చేశారు. ప్రధాన ముద్దాయిగా సృష్టి ఆస్పత్రి ఎండి పచ్చిపాల నమ్రత ఇద్దరు ఆశా వర్కర్ లు (ఏ 2ఏ 3) కోడి వెంకటలక్ష్మి బొట్టు అన్నపూర్ణ ఏ4గా ఏజెంట్ ఆర్ డి రామకృష్ణ ఏ 5 డాక్టర్ తిరుమల ఏ6 లోపింటి చం గూగుల్ద్రమోహన్ ఏ7ఏ 8 లుగా పిల్లాడ్ని కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని సి పి ఆర్కె మీనా వివరించారు.వైల్డ్ లైవ్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీస్ కమిషనర్ చాకచక్యంగా వ్యవహరించి పసిపిల్లల విక్రయ రాకెట్ను చేధించారు. వివరాల్లోకి వెళితే మాడుగుల మండల కేంద్రం కనికర మాత కాలనీకి చెందిన ఒక వీడో అవాంఛిత గర్భం ధరించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆశ కార్యకర్త బొట్ట అన్నపూర్ణ చీడికాడ మండలం అర్జునగిరి ఆశ కార్యకర్త కోడి వెంకటలక్ష్మికి తెలిపింది. గర్భవతిని ఏజెంట్ రామకృష్ణ ద్వారా సృష్టి ఆస్పత్రి తీసుకువెళ్లారు. ఉచితంగా డెలివరీ చేయడం బిడ్డకు కొంత డబ్బు ఇస్తామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. వైద్యుల సూచన మేరకు గర్భిణీ ని ఆశా వెంకటలక్ష్మి డెలివరీ వరకు తన వద్ద ఉంచుకొని సాకంది.సుందరమ్మకు మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్ కు చెందిన వారికి అమ్మేసారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన సుందరము కార్యకర్త ఆరా తీసింది. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియజేయడంతో డొంక కదిలింది.చైల్డ్ లైవ్ సంస్థ పోలీసులకు తెలియజేయడంతో విచారణ మొదలైంది. విశాఖ జిల్లా పరిషత్ పరిధిలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండి పచ్చిపాల నమ్రత విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒడిశా ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు అక్కడి ఆశా వర్కర్ లను ఆకర్షిస్తుంటారు.ఆ ప్రాంతాల్లో పేద గర్భిణీలు అవాంఛిత గర్భిణీలు టార్గెట్ చేస్తున్నారు. ఆ శాల ఆధ్వర్యంలో వారికి డబ్బు ఎర చూపుతున్నారు. ఆశాలు దళారీల ఒత్తిడితో పసిపిల్లల సేకరణ పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...